నిందితుడు రాయకోటి
సాక్షి, పూడూరు(రంగారెడ్డి): సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఓ 55 ఏళ్ల వ్యక్తి. తన మనవరాలి వయసుండే బాలికకు చాకెట్ల ఆశ చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామానికి చెందిన జాండ్ర రాయకోటి(55) కొంతకాలం క్రితం గ్రామం నుంచి వెళ్లి పోయాడు. ఆయనను భార్య, కుటుంబీకులు వదిలేశారు. ఈనేపథ్యంలో రెండేళ్ల క్రితం ఆయన తిరిగి స్వగ్రామం పెద్ద ఉమ్మెంతాల్‌కు వచ్చాడు.
స్థానికంగా టీవీలు, ఫ్యాన్ల రిపేరింగ్‌తోపాటు ఎలక్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోని ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి(5)కి తరచూ చాక్లెట్ల ఆశ చూపించి సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మరోమారు రాయకోటి తన ఇంట్లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడగా తీవ్రరక్తస్రావం అయింది. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.
బాధితురాలి కుటుంబీకులు జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పడంతో రాయికోటిపై దాడి చేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు చన్గోముల్ పోలీసులకు అప్పగించారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని పరిగి ఠాణాకు తరలించి విచారణ జరిపారు. సోమవారం రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ హఫీజ్, సీఐ మొగులయ్య తెలిపారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రాయకోటిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment