మహిళపై అత్యాచారయత్నం | rape attempt on woman in mahabubnagar district | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారయత్నం

Published Fri, Nov 6 2015 3:32 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

rape attempt on woman in mahabubnagar district

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామంలో ఓ మహిళపై రాజు(32) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు.

సదరు మహిళ ఇంట్లో గురువారం రాత్రి నిద్రిస్తుండగా అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఆమె గట్టిగా అరవడంతో రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం ఆ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement