సన్‌షైన్‌లో అరుదైన శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె నాళాలు మూసుకుపోయిన ఆరుగురు రోగులకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు క్రాస్‌బాస్ పద్ధతిలో యాంజియో ప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. టోక్యోకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అకసూరతో కలిసి ఈ అరుదైన శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ‘కార్డియాలజీలో వస్తున్న అధునాతన చికిత్స... శస్త్ర చికిత్స విధానా లు’ అనే అంశంపై ఆస్పత్రిలో గురువారం సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ గుండె రక్తనాళం పూర్తిగా లేదా 80 శాతానికి పైగా పూడుకు పోయిన వారికి, కాల్షి యం లాంటి గట్టి పదార్థాలతో బ్లాక్స్ ఏర్పడిన వారికి ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించే వారని తెలిపారు. వారికి యాంజియోప్లాస్టీ శస్త్ర చికిత్సలు చేయడం క్లిష్టమైనదని వివరించారు.
తాము మొట్టమొదటి సారిగా క్రాస్‌బాస్ పద్ధతిలో యాం జియోప్లాస్టీ నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎమ్‌డీ డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి గాటు లేకుండా శస్త్ర చికిత్స చేయడంతో రోగి త్వరగా కోలుకుంటారని తెలిపారు. రోజు వారీ పనులు యధావిధిగా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ కొండల్‌రావు పాల్గొన్నారు.