Sunshine hospital
-
రోబో 4.O
సాక్షి, హైదరాబాద్: తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. శనివారం సైబర్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సన్‌షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు. మోకాలి చిప్ప, తుంటి ఎముక అరుగుదల భాగాన్ని కచ్చితంగా గుర్తించి, ఆ మేరకు కంప్యూటర్ నావిగేషన్ సాయంతో సరైన ప్రమాణం నిర్ధారించుకుని, శస్త్రచికిత్స సమయంలో ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా ఇంప్లాంట్‌ను విజయవంతంగా అమర్చే ప్రక్రియలో ఈ రోబో సాయపడుతుందని, దీంతో రోగికి తక్కువ రక్తస్రావం, నొప్పితోపాటు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుందని గురువారెడ్డి తెలి పారు. కార్యక్రమంలో డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుషాల్ హిప్పల్‌గావన్‌కర్, డాక్టర్ సుహాన్‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘శాస్త్ర విజ్ఞాన ఫలాలను కింది స్థాయి ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఖరీదైన చికిత్సలను తక్కువ ధరలకే అందిస్తూ గురవారెడ్డి ఎంతోమంది వైద్యులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఏ వ్యక్తి రాణించాలన్నా కష్టపడకుండా, ఇష్టపడకుండా సాధ్యం కాదు, గురవారెడ్డి 30 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. వేలాది మందికి విశ్వాసాన్ని కల్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు’ అని అన్నారు. -
గచ్చిబౌలిలో సన్‌షైన్ ఆస్పత్రిలో పల్మొనరీ ల్యాబ్ ప్రారంభించిన వివిఎస్ లక్ష్మణ్
-
వైద్యం వికటించి వ్యక్తి మృతి
వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఆది వారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో సన్ షైన్ ఆస్పత్రిలో చేరాడు. కాగా... అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సరైన చికిత్స అందక పోవడం వల్లే రోగి మృతి చెందాడని అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. -
సన్‌షైన్‌లో అరుదైన శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె నాళాలు మూసుకుపోయిన ఆరుగురు రోగులకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు క్రాస్‌బాస్ పద్ధతిలో యాంజియో ప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. టోక్యోకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అకసూరతో కలిసి ఈ అరుదైన శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ‘కార్డియాలజీలో వస్తున్న అధునాతన చికిత్స... శస్త్ర చికిత్స విధానా లు’ అనే అంశంపై ఆస్పత్రిలో గురువారం సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ గుండె రక్తనాళం పూర్తిగా లేదా 80 శాతానికి పైగా పూడుకు పోయిన వారికి, కాల్షి యం లాంటి గట్టి పదార్థాలతో బ్లాక్స్ ఏర్పడిన వారికి ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించే వారని తెలిపారు. వారికి యాంజియోప్లాస్టీ శస్త్ర చికిత్సలు చేయడం క్లిష్టమైనదని వివరించారు. తాము మొట్టమొదటి సారిగా క్రాస్‌బాస్ పద్ధతిలో యాం జియోప్లాస్టీ నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎమ్డీ డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి గాటు లేకుండా శస్త్ర చికిత్స చేయడంతో రోగి త్వరగా కోలుకుంటారని తెలిపారు. రోజు వారీ పనులు యధావిధిగా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ కొండల్రావు పాల్గొన్నారు. -
స్వచ్ఛ కార్యక్రమంలో ఎస్పీ బాలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.4 లక్షలతో ఆధునీకరించిన బస్టాండ్‌ను ప్రారంభించారు. పలు చోట్ల మొక్కలు నాటారు. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం స్థానిక ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 320 రోజుల నుంచి ఇక్కడ స్వచ్ఛ కార్యక్రమం జరుగుతోంది. -
వైద్య సేవలు మరింత విస్తరించాలి
- మాదాపూర్‌లో సన్‌షైన్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ సాక్షి,హైదరాబాద్: హెల్త్‌హబ్‌గా పేరున్న హైదరాబాద్‌లో వైద్యసేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కొత్తగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 200 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సన్‌షైన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యుత్తమ సేవలతో సన్‌షైన్ ఆస్పత్రి జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌లతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ ఆస్పత్రులను ఏర్పాటు చేసి సేవలు విస్తరింపజేయాలని సూచించారు. 25 వేలకుపైగా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు నిర్వహించిన ఘనత ఆస్పత్రి సొంతమని కొనియాడారు. ఈ ఆస్పత్రిపై ఉన్న నమ్మకంతోనే కీళ్లనొప్పులతో బాధపడుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని చికిత్స కోసం డాక్టర్ గురవారెడ్డిని సంప్రదించాల్సిందిగా సూచిం చినట్లు తెలిపారు. సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గురవా రెడ్డి మాట్లాడుతూ.. మాదాపూర్, హైటెక్‌సిటీ, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఇక్కడ ఆస్పత్రిని నెలకొల్పినట్లు తెలిపారు. రోగుల అవసరాలకు తగ్గట్లు కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, న్యూరోసర్జరీ తదితర విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం కోరితే నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కె.కేశవరావు, వైద్యఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఆస్పత్రి ఎండీ డాక్టర్ అనీల్కృష్ణ, సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
సన్‌షైన్ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎంపీ కవిత, సమంత
-
కోటిరెడ్డి సారు ఇకలేరు
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ ప్రాంతంలోని పలుమురికివాడల పిల్లలకు ఉచిత విద్యాబోధన అందించి ఉన్నత ఉద్యోగాల్లో నిలిపిన అమరావతి విద్యాసంస్థల అధినేత వట్టిపల్లి కోటేశ్వర్‌రెడ్డి(కోటిరెడ్డి సారు) (56) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆరురోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన్ను స్థానిక సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. మాస్టారు మరణవార్త వినగానే పలు మురికివాడలకు చెందిన ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. కోటేశ్వరరెడ్డికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం కోసం వచ్చి.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం రామాపురానికి చెందిన వట్టిపల్లి కోటేశ్వరరావు ఉన్నత విద్యకోసం నగరానికి వచ్చారు. ఓయూ హాస్టల్ నుంచి కాలినడక చిలకలగూడలోని శ్రీదేవి, నామాలగుండులోని సురేష్ థియేటర్ ప్రాంతానికి వచ్చేవారు. అక్కడి మురికివాడలు ఆయన్ను కదిలించాయి. అక్కడివారి కుటుంబాల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతో 1984లో ఇక్కడ పాఠశాల నెలకొల్పి మురికివాడల పిల్లలకు అక్షరాలు నేర్పిచారు. కేవలం 30 మందితో చిన్న గదిలో ప్రారంభమైన అమరావతి పాఠశాల పలు శాఖల విద్యా సంస్థగా ఎదిగింది. ఇక్కడి మురికివాడల్లో ఉన్న ఏడు పాఠశాలల్లో 8 వేల మంది విద్యార్థులుండగా, వారిలో 2,500 మందికి ఉచితంగానే విద్యాబోధన అందిస్తున్నారు. మిగతావారు నెలకు రూ.10 మొదలు ఎంతతోస్తే అంతే ఫీజు చెల్లిస్తారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసినవారిలో 800 మంది ఇంజినీర్లు, 600 మంది డాక్టర్లుగా స్థిరపడ్డారు. మరో 1500 మంది ఎంబీఏ, ఎంసీఏ చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కోటేశ్వరరెడ్డి కూతుర్లు, అల్లుళ్లు సైతం అమరావతి విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులే కావడం గమనార్హం. ఎక్కడకు వెళ్లిన లూనాపైనే.. పలు పాఠశాలల కరస్పాండెంట్ హోదా ఉన్నా కోటేశ్వరరెడ్డి సాధారణ జీవితమే గడిపారు. ఆయనకు ఏ పాఠశాలలోనూ ఛాంబర్ లేదు. మిత్రులు, పేరెంట్లు ఎవరోచ్చినా సరే సదరు పాఠశాలపై టైలో రెండు కుర్చీలు వేసుకుని మాట్లాడేవారు. ఆయన ఎక్కడికైనా ఓ పాత లూనాపైనే వెళ్లేవారు. కోటేశ్వర్‌రెడ్డి మాస్టారు తుదిశ్వాస విడిచేవరకు అద్దె ఇంటిలోనే జీవించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. నేడు పాఠశాలల బంద్ కోటేశ్వరరెడ్డి మృతికి సంతాపంగా సోమవారం సికింద్రాబాద్ ప్రాంత ప్రై వేటు పాఠశాలల యాజమాన్యలు సెలవు ప్రకటించాయి. సీతాఫల్మండి మేడిబావిలోని గల నివాసంలో కోటేశ్వరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఇంటర్నెట్ ద్వారా హృదయ స్పందనల నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటేనే ఆరోగ్యం. లయ తప్పి 100... 150 సార్లకు చేరుకుంటే ప్రమాదకర సంకేతాలే. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఒక రోగి హృదయ స్పందనలను ఇంటర్నెట్ సాయంతో నియంత్రించేందుకు హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన హృద్రోగ వైద్య నిపుణులు వెంకట్, నాగరాజన్ ఒక వినూత్న చికిత్స చేశారు. మంగళవారం విలేకరులకు ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన సంజీవ్(54) హృదయ స్పందనలు పరిమితికి మించి ఉండటంతో గత నెల 22న సన్‌షైన్ అస్పత్రిలో చేరాడు. వైద్యులు సంజీవ్‌కు పలు పరీక్షలు చేసి మోచేయి రక్త నరాల ద్వారా గుండె సమీపంలో ‘ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిల్టర్ పరికరాన్ని అమర్చారు. చాతీ కింద చర్మం లోపల ఒక సంచిని ఏర్పాటుచేసి దానిలో ఒక బ్యాటరీ పెట్టి పరికరంతో అనుసంధానం చేశారు. ఈ రెండింటినీ యూనిక్ వైఫై పద్ధతిలో ఆస్పత్రిలో వైద్యుడి కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశారు. దీని ద్వారా రోగి ఎక్కడున్నా అతని గుండె లయ వేగం గుర్తించేందుకు వీలుంటుంది. గుండె వేగం అధికమైతే వైద్యుడి కంప్యూటర్ గుర్తించి సంకేతాలు ఇస్తుంది. దీంతో వైద్యనిపుణులు తక్షణమే రోగికి ఫోన్ ద్వారా సలహాలు అందించేందుకు అవకాశం ఉంటుంది.