బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. మంగళవారం రాత్రి రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా సుమారు 30 సంచుల్లో ఉంచిన 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ బియ్యాన్ని రామగిరి ప్యాసింజర్ రైలులో మహారాష్ట్రకు తరలించేందుకు కొందరు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం విచారణ చేపట్టామన్నారు.