నోట్ల రద్దు... ఇంత దౌర్భాగ్యమా? | 'RBI 'favouring' pvt banks in cash supply' Bank Employees Federation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు... ఇంత దౌర్భాగ్యమా?

Published Sat, Nov 26 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

నోట్ల రద్దు... ఇంత దౌర్భాగ్యమా?

నోట్ల రద్దు... ఇంత దౌర్భాగ్యమా?

ఆర్‌బీఐపై తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య మండిపాటు
‘నో క్యాష్’ బోర్డులు ఇంకెన్నాళ్లు?
ప్రైవేటు బ్యాంకులకు ఎక్కువ డబ్బులెందుకు?
తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం.. కొందరు చనిపోతున్నారు.. బాధ్యతెవరిది?

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బ్యాంకింగ్‌కు సంబంధించి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య విరుచుకుపడింది. బ్యాంకుల నిండా డిపాజిట్లు ఉండి కూడా ‘నో క్యాష్’ అనే బోర్డులు పెట్టాల్సి వస్తోందని, ఇంత దారుణమైన పరిస్థితి  ఎన్నడూ చూడలేదని ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య దుయ్యబట్టింది. ఈ ‘నో క్యాష్’ బోర్డుల్ని ఎంతకాలం పెట్టాలన్నది చెప్పాలని ఆర్‌బీఐని డిమాండ్ చేసింది. ప్రైవేటు బ్యాంకులకు ఎక్కువ నగదు ఇచ్చి ప్రభుత్వ బ్యాంకుల్ని పక్కనబెడుతున్నారని, దీనిపై ఆర్‌బీఐ దగ్గరకు వెళ్లి అడిగితే అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.

పెపైచ్చు ప్రైవేటు బ్యాంకులకు వెళ్లి తీసుకోమని ఉచిత సలహాలిస్తున్నారని మండిపడింది. ‘‘సరైన సదుపాయాలు లేవు. నిర్ణయాలేమో ఢిల్లీలో కూర్చుని తీసుకుంటున్నారు. మరోవంక ఆర్బీఐ  ప్రకటనలు గుప్పిస్తోంది. ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. కొందరు ఈ ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారు. దీనికెవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ సమాఖ్య నిలదీసింది. శుక్రవారమిక్కడ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మీడియాతో మాట్లాడారు.

దొంగ నోట్లొస్తే బాధ్యత ఎవరిది?: ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులంతా పూర్తిగా మెషీన్లపై ఆధారపడి పనిచేస్తున్నారని వారు చెప్పారు. ‘‘నకిలీ నోట్ల గురించి తెలియటమే లేదు. డిసెంబర్ 31 తర్వాత వీటిని ఆర్‌బీఐ వద్ద జమ చేసేటప్పుడు ఫేక్ నోట్స్ వస్తే అందుకు బాధ్యులెవరు? బ్యాంకులో ఎవరిని బాధ్యుల్ని చేస్తారు?’’ అని ప్రశ్నించారు. ఏటీఎంల విషయంలోనూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ‘‘86 వేల పైచిలుకు ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చామంటున్నారు. కానీ ఏటీఎంల సిబ్బంది మాత్రం సుమారు 26 వేలు మాత్రమే కాన్ఫిగర్ చేశామంటున్నారు. వీటి విషయంలో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా?’’ అని ప్రశ్నించారు. నగదు విత్‌డ్రాపైనా నిబంధనలు మార్చేస్తూ కప్పగంతులు వేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్ని గతంలో ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. డిపాజిట్లు భారీగా వచ్చి పడటంతో వాటిపై వడ్డీ రేట్లు తగ్గి, రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్నారు.

ఈ సామర్థ్యంతో ఎప్పటికయ్యేను?: ‘‘దేశంలో  16.4 లక్షల కోట్లు చలామణిలో ఉండగా వాటిలో  14.15 లక్షల కోట్లు రూ.500, రూ.1,000 నోట్లే. అంటే 86%. ఏ దేశంలో కూడా ఇంత భారీగా చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసిన దాఖలాలు లేవు. ఆర్‌బీఐ నోట్ల ముద్రణ సామర్థ్యం నెలకు 300 కోట్ల నోట్లు. ప్రస్తుతం రద్దరుున నోట్లు 2,200 కోట్లు. వాటిని ముద్రించాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఖాతాదారులు రూ.2 వేల నోట్లిస్తే తీసుకోవటం లేదు. చిల్లర అడుగుతున్నారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేదు’’ అని వారు దుయ్యబట్టారు.

ఆ బ్యాంకుల్ని పక్కనబెట్టారేం?: ‘‘అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, రైతాంగానికి సహకార బ్యాంకులు తోడ్పాటునిస్తున్నారుు. కానీ ప్రస్తుతం నోట్ల విషయంలో సహకార బ్యాంకులను పక్కన పెట్టారు. దీంతో వాణిజ్య బ్యాంకులపై ఒత్తిడి మరింత పెరిగిపోరుుంది. అక్కడి నాయకులెవరైనా తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలే తప్ప సహకార బ్యాంకులను పూర్తిగా పక్కన పెడితే ఎలా?’’ అని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు చేశారు. అవి...

1. ప్రైవేట్ బ్యాంకులకు ఏ ప్రాతిపదికన ఎంత నగదును సరఫరా చేశారో బహిర్గత పర్చాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ప్రైవేటు బ్యాంకులకెళ్లి రెమిటెన్సులు ఎందుకు తీసుకోవాలి? తెలంగాణలో నగదు ఎప్పుడు సరఫరా చేస్తారు? ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఎందుకిలా దాడి చేస్తున్నారు? వీటికి సమాధానాలు చెప్పాలి.
2. సహకార బ్యాంకులు కూడా నగదు డిపాజిట్లను అంగీకరించేలా తక్షణం నిర్ణయం తీసుకోవాలి.
3. సత్వరం చర్యలు తీసుకుని బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలి. ఆర్‌బీఐ వాస్తవాలు చెప్పాలి. తక్కువ డినామినేషన్ నోట్లను ముద్రించాలి.
4. ప్రైవేట్ బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నారుు. నిబంధనలకు మించి ప్రైవేట్ బ్యాంకుల్లో నగదు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరపాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement