no cash board
-
ఓ వైపు హోదా అంటూనే.. మరోవైపు పోరాటాన్ని నీరు గారుస్తున్నారు
-
అంకెల గారడీ తప్ప.. అభివృద్ధి లేదు : బొత్స
సాక్షి, విశాఖపట్నం: దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులున్నాయని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవు.. జనం ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాల అంకెల గారడీ తప్ప.. అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బొత్స ధ్వజమెత్తారు. అంతేకాక కిడ్నాప్‌లు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారని.. ఆ తర్వాత ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం గత నాలుగేళ్ల నుంచి వైఎస్సార్ సీపీ ఉద్యమాలు చేస్తుందన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టి టీడీపీ నేతలు హోదా పేరుతో డ్రామాలాడుతున్నారని బొత్స విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. ముందు కాదని చెప్పినా.. ఆ తర్వాత టీడీపీ కూడా అదే దారిలోకి వచ్చింది. ఎంపీలు రాజీనామాలు చేస్తే దండగన్నారు.. హేళన కూడా చేశారు. బంద్‌లో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారు. ఓ వైపు హోదా అంటూనే.. మరోవైపు పోరాటాన్ని నీరు గారుస్తున్నార’ని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. -
వీడని నగదు కష్టాలు!
ప్రజల్లో చిన్న అపోహ.. దాన్ని నివృత్తి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం.. బ్యాంకింగ్ వ్యవస్థ పరపతినే పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది! విత్‌డ్రాలు జోరుగా సాగుతుంటే మరోవైపు డిపాజిట్లు, జమలు నీరసించిపోతున్నాయి. దీంతో బ్యాంకుల్లో నగదు కొరత తీరట్లేదు సరికదా... ప్రతినెలా లావాదేవీల కోసం రిజర్వ్‌బ్యాంకు వైపు చూడాల్సిన ఆగత్యం తప్పట్లేదు! దీంతో ప్రజలు ముఖ్యంగా రైతుల నగదు కష్టాలు తారస్థాయికి చేరాయి. ధాన్యం సొమ్ము ఖాతాలో కనిపిస్తున్నా నగదు చేతికి రాక అప్పులు తీర్చుకోలేకపోతున్నారు. ఇవిలా ఉండగానే మళ్లీ ఖరీఫ్ కాలానికి మదుపులు ఎలాగనే భయాందోళనకు గురవుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో రైతులు 5.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 130 ధాన్యం కొనుగోలు కేంద్రాల (పీపీసీల) ద్వారా విక్రయించారు. ఈ కొనుగోళ్లు మార్చి 31వ తేదీతో ముగిసిపోయాయి. అయితే ఆ ధాన్యంకు సంబంధించిన సొమ్ము చాలావరకూ రైతుల ఖాతాల్లో జమ అయ్యిందని పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ సొమ్ము బ్యాంకుల నుంచి రైతుల చేతుల్లోకి చేరట్లేదు. జిల్లాలో జాతీయ, ప్రైవేట్, సహకార బ్యాంకులు 24 తాలూకు బ్రాంచిలు 260 ఉన్నాయి. వీటికి జిల్లావ్యాప్తంగా 300 వరకూ ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో నిర్వహణ సరిగాలేక 32 ఏటీఎంలు పనిచేయట్లేదు. 268 ఏటీఎంలు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.10 కోట్లు వరకూ నగదు ఉంచాల్సి ఉంది. కానీ వాటిలో 60 వరకూ క్యాష్ రీసైకిల్ ఏటీఎంలే. వాటిలో ఎవ్వరైనా డిపాజిట్ చేస్తే మరెవ్వరికైనా ఆ నగదును విత్‌డ్రా చేసే అవకాశం లభిస్తోంది. చాలా ఏటీఎంలు నగదు లేకుండా దర్శనం ఇస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా అవసరాల కోసం రోజుకు రూ.200 కోట్లు నగదు కావాలి. కానీ ప్రస్తుతం బ్యాంకుల్లో రోజువారీ లావాదేవీలు రూ.8 కోట్లకు పడిపోయాయి. మరోవైపు నగదు ఆధారిత లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నగదురహిత లావాదేవీల విధానాన్ని తెరపైకి తెచ్చినా ఆచరణలో పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు నాలుగు పురపాలక సంఘాలు, సుమారు 2,200 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల బ్యాంకులు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. నగదు విత్‌డ్రా కోసం రైతులు గ్రామాల నుంచి కొన్ని కిలోమీటర్లు వ్యయప్రయాసలు ఎదుర్కొని వస్తున్నారు. తీరా బ్యాంకులలో రూ.2 వేలు లేదంటే రూ.3 వేల వరకూ మాత్రమే విత్‌డ్రా చేయడానికి సిబ్బంది అంగీకరిస్తున్నారు. ఎక్కువ మొత్తం కావాలంటే నగదు లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నగదు కోసం నగుబాటు తప్పదా... కొత్త రూ.2000 కరెన్సీ నోట్లు చలామణి తగ్గిపోతున్నాయి. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి వస్తున్న నోట్లకు, అవి ప్రజల్లో వెళ్లి మళ్లీ బ్యాంకుకు తిరిగొస్తున్న నోట్ల సంఖ్యకు చాలాచాలా వ్యత్యాసం కనిపిస్తోందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. దీనికితోడు జిల్లా ప్రజలు ఎక్కువమంది కొనుగోళ్లు విశాఖపట్నం, విజయనగరంలోనే చేస్తున్నారు. దీనికి నగదుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో జిల్లా నుంచి నగదు చాలావరకూ పొరుగు జిల్లాలకు వెళ్లిపోతోందని బ్యాంకు సిబ్బంది వాదన. నగదురహిత లావాదేవీలకు అవకాశం ఉన్నా వ్యాపారుల్లో చాలామంది జీఎస్టీ భయంతో క్యాష్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. కార్డుల కన్నా క్యాష్తో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తుండటం దీనికి నిదర్శనం. దీనివల్ల నగదు వ్యాపారుల చేతుల్లోకి, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లోని పెద్ద వ్యాపారులు (డిస్ట్రిబ్యూటర్లు), డీలర్ల చేతిలోకి నగదు వెళ్లిపోతోందనేది మరో వాదన. ఏదేమైనా జిల్లాలో మాత్రం నగదు కొరత తీరట్లేదు. గత ఏడాది చివర్లో వచ్చిన ఎఫ్ఆర్డీఐ బిల్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్లు, జమలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనిపై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంలో అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకులు విఫలమయ్యాయి.దీంతో బ్యాంకుల్లో నగదు నిల్వ ప్రతి నెలా తగ్గిపోతోంది. ఆర్బీఐ నుంచి నెలనెలా వచ్చే నగదు కోసం బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. గత నెల రూ.100 కోట్లు కావాలని కోరితే రూ.90 కోట్ల నగదు వచ్చింది. దీనిలో రూ.35 కోట్ల వరకూ పింఛన్లకే పోయింది. మళ్లీ ఈనెలలో మరో రూ.100 కోట్ల నగదు కోసం బ్యాంకర్లు విన్నపాలు చేశారు. దీనిలో మళ్లీ పింఛన్లకు రూ.35 కోట్లు పోతే మిగిలిన సొమ్ము ఖాతాదారుల అవసరాలకు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ప్రతినెలా ఇదే పరిస్థితి ఉండటంతో జిల్లాలో ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే భయమేల? ఎఫ్ఆర్డీఐ బిల్లుపై సందేహాలు తగదు. దానివల్ల ఖాతాదారుల డిపాజిట్లకు వచ్చే నష్టమేమీ ఉండదు. సొమ్ము ఇళ్లల్లో కన్నా బ్యాంకుల్లో ఉంటేనే భద్రం కూడా. ప్రస్తుతం బ్యాంకుల నుంచి విత్‌డ్రా అవుతున్న సొమ్ము కన్నా తిరిగి బ్యాంకులకు వచ్చే సొమ్ము చాలా తక్కువగా ఉంటోంది. దీనివల్ల లావాదేవీలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈనెల 25వ తేదీ నాటికి రూ.100 కోట్లు నగదు అవసరమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ద్వారా ఆర్బీఐకి నివేదించాం. గత నెల ఇలా రూ.100 కోట్లు కోరితే ఈనెల మొదటి వారంలో రూ.90 కోట్లు జిల్లాకు వచ్చింది. పింఛన్ల కోసమే రూ.35 కోట్లు నగదు నెలనెలా అవసరమవుతోంది. – పి.వెంకటేశ్వరరావు, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు, శ్రీకాకుళం అప్పులు తీరక ఉక్కిరిబిక్కిరి... నేను ఫిబ్రవరిలో 87 క్వింటాళ్ల ధాన్యం పాలకొండ పీఏసీఎస్‌కు అందించాను. కానీ ఆన్లైన్లో నా భూమి వివరాలు లేవని నెల రోజులు తిప్పారు. తర్వాత బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. కానీ ఇప్పటికీ మొత్తం డబ్బు చేతికి రావట్లేదు. రోజంతా బ్యాంకు వద్ద లైన్లో నిలబడితే రెండు వేలో, మూడో వేలో ఇస్తామంటున్నారు. ఏటీఎంలు పనిచేయట్లేదు. ఏడాది క్రితం పొలం పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరట్లేదు. అప్పు ఇచ్చినోళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వచ్చే ఖరీఫ్‌కు మదుపు చూసుకోవాలి. – బలగ నాగేశ్వరరావు, కొండాపురం, పాలకొండ మండలం చేతకాని ప్రభుత్వం వల్లే అవస్థ నేటికి నా ధాన్యం సొమ్ము బ్యాంకు నుంచి తీసుకోలేకపోతున్నాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (పీపీసీ)లోనే ధాన్యం ఇచ్చా. పాస్ పుస్తకాలు, అడంగల్ పత్రాలంటూ తొలుత పీపీసీ వాళ్లు తిప్పారు. ధాన్యం సొమ్ము తీరా ఖాతాలో జమ చేసినా బ్యాంకుల్లో నగదు లేక చేతికి ఇవ్వట్లేదు. రైతులను ఏవిధంగా ఆదుకోవాలో చేతకాని ప్రభుత్వమిది. – కండాపు ప్రసాదరావు, రుద్రిపేట, పాలకొండ మండలం ఖాతాలకే పరిమితమైన ధాన్యం డబ్బు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మితేనే మా అప్పులు తీరుతాయి. కానీ పీపీసీల్లో అమ్మడానికీ ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో ఉన్నా అక్కడా ఇప్పటికీ అవసరమైనంత తీసుకోలేకపోతున్నాను. ఇంటి అవసరాలకూ ప్రైవేట్ వ్యాపారులు, తెలిసినవాళ్ల వద్ద చేబదులు తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో! – యాబాజి రమేష్, లింగాలపాడు, నరసన్నపేట ప్రజల్లో చైతన్యం వస్తేనే పరిష్కారం ప్రజల్లో చైతన్యం రానంతవరకూ బ్యాంకుల్లో నగదు కష్టాలకు పరిష్కారం దొరకదు. ప్రస్తుతం బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరు వల్ల అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. కొబ్బరి వ్యాపారులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తాలను ఇవ్వడానికి కూడా బ్యాంకులో నగదు ఇవ్వకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. రైతుల నుంచి కొన్న సరకుకు సకాలంలో నగదు చెల్లించలేకపోతున్నాం. – నరేష్ గుప్తా, చాంబర్ ఆప్ కామర్స్ అధ్యక్షుడు, కంచిలి -
నో క్యాష్ బోర్డు కనిపించొద్దు
బ్యాంకర్ల సమావేశంలో రైతు సంఘాలు సాక్షి, హైదరాబాద్: ‘డీమోనిటైజేషన్ ప్రక్రియ తర్వాత చాలా బ్యాంకు శాఖల్లో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. దాంతో ఎంతో దూరం నుంచి వచ్చిన ఖాతాదారులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా రైతులు పంట రుణాలకోసం వస్తే వారికి ఈ పరిస్థితి గుదిబండగా మారుతోంది. ఇకపై ఇలా జరగడానికి వీల్లేదు. ఒక్క శాఖలోనూ ‘నో క్యాష్’ బోర్డు కనిపించొద్దు’ అని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ), వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకుల్లో నెలకొన్న పరిస్థితులపై రైతు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మూడో విడత రుణ మాఫీ చేసినప్పటికీ రైతులకు నిధులు ఇవ్వడం లేదని, ప్రస్తుతం నాల్గో విడత మాఫీ సైతం జరుగుతోందన్నారు. గ్రామీణ బ్యాంకుల్లో రోజుల తరబడి నగదు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. దీంతో దత్తాత్రేయ జోక్యం చేసుకుంటూ బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతుకు తప్పనిసరిగా రూ.లక్ష వరకు నగదు ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. బ్యాంకు శాఖల వారీగా రైతులకు ఇచ్చిన నగదు వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. వారానికోసారి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. పంటరుణాలపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించినట్లు దత్తాత్రేయ చెప్పారు. జూన్ నెలాఖరు నాటికి రూ.9వేల కోట్లు బ్యాంకులకు అందించామని, అదేవిధంగా జూలై మొదటివారం నాటికి రూ.2,600 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. రెండ్రోజుల్లో మరో 2వేల కోట్లు రాష్ట్రంలోని బ్యాంకులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. -
కష్టాలు తీరవా??
కొనసాగుతున్న కరెన్సీ సమస్య నగదు కోసం క్యూలైన్లలో పడిగాపులు సామాన్యులు, ఖాతాదారుల ఇబ్బందులు శ్రీకాకుళం అర్బన్: నగదు కష్టాలు వీడటం లేదు! కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి! ఏటీఎంలు ‘నో క్యాష్’ బోర్డులతో దర్శనమిస్తున్నాయి! బ్యాంకుల్లోనూ నగదు కొరత తీవ్రంగా ఉండటంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో సామాన్యులు, ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎక్కడికి వెళ్లినా మొండిచెయ్యే.. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కరెన్సీ కొరత ఏర్పడింది. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్న జిల్లా వాసులకు మళ్లీ ‘కరెన్సీ’ షాక్ మొదలైంది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు కావాలనుకునే ఖాతాదారులు బ్యాంకులకు వెళ్తే మొండి చెయ్యే ఎదురవు తోంది. దీంతో చేసేది లేక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. చివరికి చిన్న మొత్తం కోసం ఏటీఎం కేంద్రాల వద్దకు వెళ్లినా.. అక్కడ కూడా ‘నో క్యాష్’ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో ఖాతాదారులు, వినియోగదారుల బాధలు వర్ణనాతీతం. ఎవరైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తేనే.. నగదు కోసం ఏ బ్యాంకుకు వెళ్లినా ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. తనకు కావాల్సిన నగదు కోసం విత్‌డ్రా చేసేందుకు వెళితే అక్కడ సరిపడా నగదు ఉండటం లేదు. దీనికి బ్యాంకుల్లో నగదు నిల్వలేకపోవడమే కారణమని తెలుస్తోంది. ఖాతాదారులు నగదును డిపాజిట్ చేస్తేనే ఆ సొమ్మును విత్‌డ్రా కోసం వేచి ఉండే ఇతర ఖాతాదారులకు సర్దుబాటు చేస్తున్నారు. డిపాజిట్ కనుక రాకపోతే విత్‌డ్రా కోసం వచ్చిన ఖాతాదారులు అలా ఉండాల్సిందే. ఇదే తంతు ఏటీఎంల వద్ద ఏర్పాటు చేసిన క్యాష్ డిపాజిట్ మెషీన్ వద్ద కూడా జరుగుతోంది. ఖాతాదారుడు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత.. మళ్లీ వేరొకరు విత్‌డ్రా చేస్తే నగదు వస్తోంది. నగదు విషయంలో అంతా సక్రమంగానే ఉందని ఒక పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు చెబుతుంటే అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ప్రజలు, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగదు కష్టాలను ప్రజాప్రతినిధులుగానీ, అధికారులు గానీ పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. రూ.10నాణేలు తీసుకునేందుకు వెనకడుగు మరికొన్ని బ్యాంకుల్లో నగదు కోసం వెళ్తే రూ.100, రూ.500, రూ.2వేలు నోట్లు లేకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో రూ.10 కాయిన్లు తీసుకెళా్లలని బ్యాంకు అధికారులు కోరినా.. ఖాతాదారులు వాటిని తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రూ.10 కాయిన్లుచెల్లుబాటు కావనే అపోహ ఉండటంతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
నగదు కష్టాలు: ఏటీఎంలు మళ్లీ ఖాళీ!
పెద్దనోట్లు రద్దు చేసిన కొన్నాళ్ల వరకు నగదు అందుబాటులో లేక, ఏటీఎంలు ఖాళీగా దర్శనమిచ్చి ప్రజలకు నానా కష్టాలు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే వస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో దాదాపు నాలుగోవంతు వాటిలో డబ్బులు ఉండట్లేదు. వాటి ముందు 'నో క్యాష్' బోర్డులు మళ్లీ దర్శనమిస్తున్నాయి. నెల మొదటి వారం కావడం, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి పెంచడంతో చెల్లింపుల కోసం ప్రజలు భారీగా డబ్బులు తీసేస్తున్నారని, దానివల్లే ఇలాంటి పరిస్థితి వస్తోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అసంఘటిత రంగంలోని లక్షలాది మంది కార్మికులకు ఇప్పటికీ డబ్బు రూపంలోనే వేతనాలు చెల్లిస్తాని, సాధారణంగా నెల మొదటి వారంలో చెల్లింపులు చేయాల్సి ఉన్నందున నగదు ఎక్కువగా తీస్తున్నారని అన్నారు. దాదాపు 56 కోట్ల మందికి పైగా ఫ్యాక్టరీ వర్కర్లకు జీతాలు ఇవ్వాల్సి రావడంతో ఇలా ఏటీఎంలలో నగదు నిండుకుని ఉండొచ్చన్నది అధికారుల అభిప్రాయం. ఫిబ్రవరి పదోతేదీ నాటికల్లా ఈ నగదు కొరత తీరుతుందని, రెండు రోజుల్లో మళ్లీ అన్ని ఏటీఎంలలోను పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఏటీఎంల నుంచి ఒకేసారి రూ. 24వేల వరకు తీసుకునే అవకాశాన్ని రిజర్వు బ్యాంకు గత వారం కల్పించింది. అంతకుముందు ఈ పరిమితి చాలా తక్కువగా ఉండేది. కొన్ని కంపెనీలు మొదటి తేదీ నాడే జీతాలు ఇస్తే మరికొన్ని కంపెనీలు 10-15 తేదీల వరకు కూడా ఇస్తుంటాయని, దానివల్ల ఇంతకుముందు కంటే తాము ఏటీఎంలలో నగదు ఎక్కువగానే నింపుతున్నా త్వరగా అయిపోతోందని క్యాష్ లాజిస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రితురాజ్ సిన్హా చెప్పారు. రోజుకు దాదాపు రూ. 12వేల కోట్ల నగదును ఏటీఎంలలో పెడుతున్నారు. అయితే నోట్ల రద్దుకు ముందు దాదాపు రూ. 13వేల కోట్లు పెట్టేవారు. పెద్ద నగరాల్లో కంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే నగదు కొరత ఎక్కువగా కనిపిస్తోందని ఒక ప్రైవేటు రంగ బ్యాంకు అధికారి చెప్పారు. మొత్తానికి మరికొన్నాళ్ల పాటు ఈ కష్టాలు మాత్రం తప్పేలా లేవు. -
బతుకు బ్యాంక్‌ల పాలు..
-
ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ..
• బ్యాంకుల మూతతో బేజారు • రెండు రోజుల సెలవులతో సతమతం బ్యాంకుల గేట్లకు తాళాలు, ఏటీఎంలపై నో క్యాష్ బోర్డుల తోరణాలతో బిక్కచచ్చిపోరుున ప్రజలు ‘ఏమీ సేతుర లింగా ఏమీ సేతూ’ అంటూ పాడుకుంటున్నారు. బ్యాంకులకు శని, ఆదివారాల సెలవుతో ఖాతాదారులు సతమతమైపోతున్నారు. ఆశగా ఏటీఎంల వైపు వెళితే డబ్బులు లేని ఆ డబ్బాతో నిరాశే మిగులుతోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు పేద, మధ్యతరగతి ప్రజలనే ఎక్కువగా బాధిస్తున్నదని గట్టిగా చెప్పవచ్చు. నగదు కోసం 16 రోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పాత నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త నోట్లతో ఆదుకోవడంలో విఫలమైంది. రూ.2వేల నోట్లను మాత్రమే ముందుగా విడుదల చేసి చిన్ననోట్లపై చిన్నచూపు చూసింది. రూ.24వేల వరకు డ్రా చేసుకోవచ్చని కేంద్రం చెబుతున్నా కరెన్సీ లేని కారణంగా కొంత మొత్తాన్ని మాత్రమే కొసరి కొసరి సర్దుతున్నారు. రూ.100, రూ.500 కరెన్సీ చిల్లర నోట్లు కావాలంటూ ప్రజలు చిటపటలాడుతున్నారు. ఈ దశలో శుక్రవారం చెన్నైకి చేరుకున్న 14 టన్నుల రూ.500 నోట్లు ఎంత వరకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయోననే అనుమానాలు నెలకొన్నారుు. 28వ తేదీకి అన్ని ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను పొందవచ్చని బ్యాంకు అధికారుల చెబుతున్నారు. ఈ 14వేల టన్నుల్లో ఏ బ్యాంకు ఎంత వాటా దక్కుతుందోననే అనుమానాలు నెలకొని ఉన్నారుు. చెన్నైలోని రిజర్వు బ్యాంకు ఆధీనంలోని ఈ సొమ్ము పంపిణీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే సింహభాగం దక్కే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్లుగా రాష్ట్రంలోని ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇటీవల కోవైలో ప్రకటించడం గమనార్హం. ఏటీఎంల రంగ ప్రవేశం వల్ల నగదు డ్రా కోసం బ్యాంకులపై ఆధారపడే రోజులు ఏనాడో పోయారుు. పెద్ద నోట్ల రద్దుతో మళ్లీ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదు. శని, ఆదివారాలను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల నిండా సొమ్ము పెట్టి ఉంటారని అందరూ ఆశించగా అది నిరాశే అని తేలేందుకు పెద్దగా సమయం పట్టలేదు. నగదున్న ఏటీఎం కోసం వేటాడి వెంటాడిన ఖాతాదారులు వాటి ముందే కూలపడిపోవడం చూపరుల గుండెను ద్రవింపజేసింది. అతికొద్ది ఏటీఎంలలో మాత్రమే నగదు ఉండడంతో చాంతాడంత క్యూ తయారైంది. గంటల తరబడి క్యూలో నిల్చుని ఏటీఎం వద్దకు వచ్చి కార్డు పెట్టగానే డబ్బులేదనే సమాచారం దర్శనమిస్తోంది. కొన్ని బ్యాంకులు ముందుగానే నో క్యాష్ బోర్డు పెట్టేశారుు. ఏటీఎంలలో డబ్బు లేనపుడు నింపాలిగానీ బోర్డు పెట్టడం ఏమిటని విమర్శిస్తున్నారు. పాత నోట్ల ద్వారా పన్నులు చెల్లించవచ్చని చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. 28న సామూహిక ఆందోళనలు : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ఈనెల 28వ తేదీన సామూహిక ఆందోళనలు సాగనున్నారుు. నిరసన ప్రదర్శనలు చేస్తున్నట్లు డీఎంకే, వామపక్షాలు వేర్వేరుగా గతంలో ప్రకటించి ఉన్నారుు. డీఎంకే ఆందోళనలో తాము పాల్గొంటున్నట్లు తమిళ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య సంఘాలు సైతం నిరసన తెలుపబోతున్నట్లు శనివారం ప్రకటించారుు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల దుకాణాలను మూసివేయనున్నారు. -
నోట్ల రద్దు... ఇంత దౌర్భాగ్యమా?
• ఆర్బీఐపై తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య మండిపాటు • ‘నో క్యాష్’ బోర్డులు ఇంకెన్నాళ్లు? • ప్రైవేటు బ్యాంకులకు ఎక్కువ డబ్బులెందుకు? • తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం.. కొందరు చనిపోతున్నారు.. బాధ్యతెవరిది? హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బ్యాంకింగ్‌కు సంబంధించి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదని బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య విరుచుకుపడింది. బ్యాంకుల నిండా డిపాజిట్లు ఉండి కూడా ‘నో క్యాష్’ అనే బోర్డులు పెట్టాల్సి వస్తోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదని ఏపీ, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య దుయ్యబట్టింది. ఈ ‘నో క్యాష్’ బోర్డుల్ని ఎంతకాలం పెట్టాలన్నది చెప్పాలని ఆర్బీఐని డిమాండ్ చేసింది. ప్రైవేటు బ్యాంకులకు ఎక్కువ నగదు ఇచ్చి ప్రభుత్వ బ్యాంకుల్ని పక్కనబెడుతున్నారని, దీనిపై ఆర్బీఐ దగ్గరకు వెళ్లి అడిగితే అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. పెపైచ్చు ప్రైవేటు బ్యాంకులకు వెళ్లి తీసుకోమని ఉచిత సలహాలిస్తున్నారని మండిపడింది. ‘‘సరైన సదుపాయాలు లేవు. నిర్ణయాలేమో ఢిల్లీలో కూర్చుని తీసుకుంటున్నారు. మరోవంక ఆర్బీఐ ప్రకటనలు గుప్పిస్తోంది. ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారు. కొందరు ఈ ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నారు. దీనికెవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ సమాఖ్య నిలదీసింది. శుక్రవారమిక్కడ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మీడియాతో మాట్లాడారు. దొంగ నోట్లొస్తే బాధ్యత ఎవరిది?: ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులంతా పూర్తిగా మెషీన్లపై ఆధారపడి పనిచేస్తున్నారని వారు చెప్పారు. ‘‘నకిలీ నోట్ల గురించి తెలియటమే లేదు. డిసెంబర్ 31 తర్వాత వీటిని ఆర్బీఐ వద్ద జమ చేసేటప్పుడు ఫేక్ నోట్స్ వస్తే అందుకు బాధ్యులెవరు? బ్యాంకులో ఎవరిని బాధ్యుల్ని చేస్తారు?’’ అని ప్రశ్నించారు. ఏటీఎంల విషయంలోనూ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ‘‘86 వేల పైచిలుకు ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చామంటున్నారు. కానీ ఏటీఎంల సిబ్బంది మాత్రం సుమారు 26 వేలు మాత్రమే కాన్ఫిగర్ చేశామంటున్నారు. వీటి విషయంలో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా?’’ అని ప్రశ్నించారు. నగదు విత్‌డ్రాపైనా నిబంధనలు మార్చేస్తూ కప్పగంతులు వేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్ని గతంలో ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. డిపాజిట్లు భారీగా వచ్చి పడటంతో వాటిపై వడ్డీ రేట్లు తగ్గి, రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతాయన్నారు. ఈ సామర్థ్యంతో ఎప్పటికయ్యేను?: ‘‘దేశంలో 16.4 లక్షల కోట్లు చలామణిలో ఉండగా వాటిలో 14.15 లక్షల కోట్లు రూ.500, రూ.1,000 నోట్లే. అంటే 86%. ఏ దేశంలో కూడా ఇంత భారీగా చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసిన దాఖలాలు లేవు. ఆర్బీఐ నోట్ల ముద్రణ సామర్థ్యం నెలకు 300 కోట్ల నోట్లు. ప్రస్తుతం రద్దరుున నోట్లు 2,200 కోట్లు. వాటిని ముద్రించాలంటే ఆరేడు నెలలు పడుతుంది. ఖాతాదారులు రూ.2 వేల నోట్లిస్తే తీసుకోవటం లేదు. చిల్లర అడుగుతున్నారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేదు’’ అని వారు దుయ్యబట్టారు. ఆ బ్యాంకుల్ని పక్కనబెట్టారేం?: ‘‘అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, రైతాంగానికి సహకార బ్యాంకులు తోడ్పాటునిస్తున్నారుు. కానీ ప్రస్తుతం నోట్ల విషయంలో సహకార బ్యాంకులను పక్కన పెట్టారు. దీంతో వాణిజ్య బ్యాంకులపై ఒత్తిడి మరింత పెరిగిపోరుుంది. అక్కడి నాయకులెవరైనా తప్పులు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలే తప్ప సహకార బ్యాంకులను పూర్తిగా పక్కన పెడితే ఎలా?’’ అని వారు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లు చేశారు. అవి... 1. ప్రైవేట్ బ్యాంకులకు ఏ ప్రాతిపదికన ఎంత నగదును సరఫరా చేశారో బహిర్గత పర్చాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ప్రైవేటు బ్యాంకులకెళ్లి రెమిటెన్సులు ఎందుకు తీసుకోవాలి? తెలంగాణలో నగదు ఎప్పుడు సరఫరా చేస్తారు? ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఎందుకిలా దాడి చేస్తున్నారు? వీటికి సమాధానాలు చెప్పాలి. 2. సహకార బ్యాంకులు కూడా నగదు డిపాజిట్లను అంగీకరించేలా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. 3. సత్వరం చర్యలు తీసుకుని బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించాలి. ఆర్బీఐ వాస్తవాలు చెప్పాలి. తక్కువ డినామినేషన్ నోట్లను ముద్రించాలి. 4. ప్రైవేట్ బ్యాంకుల్లో అవకతవకలు జరుగుతున్నారుు. నిబంధనలకు మించి ప్రైవేట్ బ్యాంకుల్లో నగదు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరపాలి. -
ఏటీఎం కేంద్రాలలో 'నో క్యాష్' బోర్డ్స్