ఆదిబట్ల: ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం మమ్‌రాజిగూడ. ఇక్కడ దాదాపు 480 ఎకరాల వరకు భూమి ఉంది. ఈ భూములలో రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదిబట్లలో రియల్టీ ఓ ఊపు ఊపుతున్న ఈ గ్రామ వాసులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఏ ఒక్కరు కూడా తమ వ్యవసాయ భూములను అమ్మడానికి ఎలాంటి ఆసక్తి చూపడం లేదుజ అప్పట్లో సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్, అల్మాస్‌గూడ గ్రామాలకు చెందిన కొంత మంది ఇక్కడ నివాసం ఏర్పర్చుకున్నారు. గుర్రంగూడలోని ఎవియేషన్ అకాడమీ ఏర్పాటుతో అక్కడ వ్యవసాయ భూములు కోల్పోయినవారు వచ్చిన పరిహరంతో 1957లో ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల సమీపంలో భూములు కొని వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు.
ఈ గ్రామంలో దాదాపు 40 కుటుంబాలున్నాయి. వారందరూ రైతులే కావడం విశేషం. గ్రామంలో ఎటు చూసినా పచ్చని పంటలతో పొలాలు కళకళలాడుతుంటాయి. ఈ గ్రామంలో భూగర్భజలాలు పుష్కలంగా ఉండడానికి మహేశ్వరం మండలంలోని రావిరాల చెరువు ప్రధాన కారణం. ఇక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయం మూడు పూవ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.
రియల్టర్లకు అందని గ్రామం
ఆదిబట్ల గ్రామం పలు కంపెనీల రాకతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. టీసీఎస్, టాటా ఏరోస్పేస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీల రాకతో రియల్ వ్యాపారం పుంజుకుంది. ఇంకా రియల్ వ్యాపారులు ఈ ప్రాంతంలో భూములు కనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిబట్ల గ్రామం చుట్టుపక్కన భూములను ఇప్పుడు రియల్ వ్యాపారులు కొనుగోలు చేశారు.
ఆదిబట్ల అనుబంధ గ్రామమైన మమ్‌రాజిగూడ వైపు మాత్రం రియల్ వ్యాపారుల తాకిడి లేదు. ఎందుకంటే ఇక్కడి రైతులు మట్టినే నమ్ముకొని పంటలనే ప్రాణంగా చుసుకొని నివసిస్తున్నారు. కోట్లు వద్దు వ్యవసాయమే ముద్దు అంటున్నారు. ఇక్కడ భూములకు రెండు నుంచి మూడు కోట్ల ధరలు పలుకుతున్నా .. అయినా వ్యవసాయమే జివనాధరం అని తేగేసి చేబుతున్నారు.
ఆదిబట్ల గ్రామంలో భూములు వెంచర్లుగా మారిన తరువాత రియల్ వ్యాపారుల కన్ను ఆదిబట్ల అనుబంధ గ్రామమైన మమ్‌రాజ్‌గూడపై పడింది. రైతులకు ఆశలు రేపే పనిలో రియల్ వ్యాపారులు పడ్డారు. ఇప్పటికే పలువురు వ్యాపారులు రైతన్నలకు భారీ ఆఫర్లు కూడా ఇచ్చారు. అయినా భూములు అమ్మడానికి ససేమిరా అంటున్నారు ఇక్కడి రైతులు.
కోట్లు వద్దు..వ్యవసాయమే ముద్దు
Published Fri, Nov 14 2014 12:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement