సంక్రాంతి తర్వాత గల్ఫ్ దేశాలకు సీఎం! | Reap the Gulf countries, wallpapers! | Sakshi
Sakshi News home page

సంక్రాంతి తర్వాత గల్ఫ్ దేశాలకు సీఎం!

Published Sat, Jan 10 2015 12:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

సంక్రాంతి తర్వాత గల్ఫ్ దేశాలకు సీఎం! - Sakshi

సంక్రాంతి తర్వాత గల్ఫ్ దేశాలకు సీఎం!

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈనెల 17 నుంచి 22వ తేదీల మధ్యలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్‌లలో ఆయన పర్యటించనున్నట్లు తెలిసింది. ఇటీవల కేరళలో లూలూ సంస్థల అధిపతి కుటుంబ వివాహానికి వెళ్లినప్పుడు ఆయన సీఎంను దుబాయ్‌కి ఆహ్వానించారు. ముఖ్యమంత్రితోపాటు ఒకరిద్దరు మంత్రులు, అధికారుల బృందం వెళ్లనున్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి ఈ పర్యటనను వినియోగించుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తాత్కాలికంగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఆయన సంక్రాంతి పండుగ తర్వాత మూడు నుంచి ఐదు రోజుల వరకు గల్ఫ్‌లో పర్యటిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement