సాక్షి, హైదరాబాద్: నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రోరైల్లో ఎక్కడానికి నగరవాసులు ఉవ్విళ్లూరారు. వందలమంది మెట్రోరైల్లో ప్రయాణించారు. మెట్రో రైలెక్కి ఫొటోలు, సెల్ఫీలు దిగి.. షేర్ చేసుకున్నారు. మెట్రోలో ప్రయాణిస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టు ఉందని తమ అనుభూతిని పంచుకున్నారు.
మొత్తానికి మెట్రోరైలు అందుబాటులోకి రావడంతో అందులో ప్రయాణించేందుకు ప్రయాణికులు బారులు తీరుతున్నారు. మెట్రో ప్రయాణం బాగుందని చెప్తున్న ప్రయాణికులు ధరల విషయంలో మాత్రం కాస్తా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెట్రో ధరలను కొంచెమైనా తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్‌చేసింది. అధికంగా మెట్రో ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు. మెట్రో ఆలస్యానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, పెరిగిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment