ఎగువప్రాంతంలో వర్షాలు తగ్గిపోవడంతో జూరాలకు వరద ఉధృతి తగ్గింది. దీంతో జూరాల జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. రిజర్వాయర్‌ను నీటితో పూర్తిస్థాయిలో నింపేందుకు ఔట్‌ఫ్లోను ఆపేశారు. జూరాల ప్రధానకాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులకు నీటి విడుదల మాత్రం కొనసాగిస్తున్నారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా పంపింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 18,611 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా 2900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఔట్‌ఫ్లోను నిలిపేశామని అధికారులు అన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 10.34 టీఎంసీల నీటినిల్వ ఉంది.
జూరాలకు తగ్గిన వరద
Published Sun, Sep 13 2015 8:34 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement