
రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ టిడిపి ఎమ్మెల్యే ఏ.రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతల తీరుని ఆయన దుయ్యబట్టారు. తీవ్రస్థాయిలో విమర్శించారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను విమర్శిస్తే విద్యుత్ కష్టాలు తీరవని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కెసిఆర్) తన బంట్రోతులతో మీటింగ్ పెట్టించి చంద్రబాబును కావాలనే తిట్టిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో ముక్కుతూ, మూలుగుతూ మూడు గంటలు కరెంట్ ఇస్తున్నారని అన్నారు. ఇల్లు కట్టి ఇవ్వకుండా నల్లా ఇస్తే ఏమి లాభం? అని ప్రశ్నించారు. రైతులకు 5 గంటలపాటు కూడా కరెంట్ ఇవ్వడంలేదని విమర్శించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ లైన్లను ఎందుకు వాయిదా వేశారని అడిగారు. సిఎంగా ఉండి అడ్డగోలుగా తిడితే మిగిలిన ప్రభుత్వాలు ఎలా సహకరిస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
**