తలసాని ఒక సన్నాసి.. | revanth reddy fires on thalasani srinivas yadav | Sakshi
Sakshi News home page

తలసాని ఒక సన్నాసి..

Published Sat, May 9 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

తలసాని ఒక సన్నాసి..

తలసాని ఒక సన్నాసి..

చీము, నెత్తురుంటే పోటీ చేసి మళ్లీ గెలవాలి: రేవంత్‌రెడ్డి సవాల్
హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఒక సన్నాసి. ఆయన అనుభవించిన పదవుల వెనుక టీడీపీ పెట్టుబడి, శ్రమ, రక్తం ఉంది. ఆ సన్నాసికి సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యేగా గెలిపించిన సైకిల్ పార్టీకి రాజీనామా చేయాలి. దమ్ముంటే  టీడీపీని వీడి టీఆర్‌ఎస్ డొక్కు కారు ఎక్కి మళ్లీ గెలిచి, తనకున్న బలమేంటో నిరూపించుకోవాలని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.

శుక్రవారం సికింద్రాబాద్‌లో టీడీపీ మినీ మహానాడు కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సనత్‌నగర్‌లో చంద్రబాబును, పవన్‌కల్యాణ్‌ను పోటీచేయాలంటూ సవాల్ విసురుతున్న తలసాని టీడీపీలో చేరకముందు.. మోహన్‌బాబు సినిమా షూటింగ్‌ల వద్ద బౌన్సర్‌గా పనిచేశాడని,  పచ్చగా ఉన్నచోట తిని, వెచ్చగా ఉన్న చోట పడుకునే స్వార్థపరుడని రేవంత్ అభివర్ణించారు.

కేసీఆర్‌ది కుటుంబ పాలన, టీఆర్‌ఎస్ దొరలు, దొంగల పార్టీ అని టీటీడీపీ రాష్ట్ర నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆ ప్రభుత్వంలో పేదలకు చోటులేదని, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోతే నిధులెందుకు ఇవ్వరు, 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఎందుకు పరామర్శించరని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement