హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే జైళ్లలో పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు.
హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే జైళ్లలో పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణి ప్రారంభిస్తున్నామన్నారు.
కరీంనగర్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధానోపాద్యాయులు- గుణాత్మక విద్య అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఈటెల సన్మానించారు.