రామాయంపేట/చేగుంట: పశువులను అపహరించిన ఓ ముఠా సభ్యులు పోలీసులపై దాడి చేసి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ వద్ద చోటుచేసుకుంది. పుల్యానాయక్‌కు చెందిన ఒక ఎద్దును, మల్లేశంకు చెందిన రెండు ఎద్దులను దొంగల ముఠా వ్యాన్‌లోకి ఎక్కించింది.
విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ లోపే దుండగులు వాహనంలో పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ, ఏఎస్‌ఐ మురళి ఆధ్వర్యంలోని రామాయంపేట పోలీసులు దౌల్తాబాద్ క్రాస్ రోడ్డు వద్ద దొంగల వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో రెచ్చిపోయిన దుండగులు పోలీసులపై రాళ్ల దాడికి దిగి వాహనంలో చేగుంట వైపు వెళ్లారు. అయితే పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని గుర్తించి తమ వాహనాన్ని పేట్ బషీర్‌బాగ్ బషీరాబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వదిలి పారిపోయారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్ రామకృష్ణ, హోంగార్డు కుతుబుద్దీన్‌లు గాయపడ్డారు.
పోలీసులపై దొంగల రాళ్ల దాడి
Published Sat, Jan 17 2015 1:47 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement