రంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్ల విలువైన భూముల రికా ర్డులు మాయం అయ్యాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించండి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్ల విలువైన భూముల రికా ర్డులు మాయం అయ్యాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామంలో భూ రికార్డులు మాయమయ్యాయని, భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంటూ హెచ్.మల్లేశ్వరరావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం హైకోర్టు విచారణకు వచ్చింది.
ఈ రిట్‌ను విచారిం చిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు కలెక్టర్ దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రికార్డులు మాయం కావడం మిస్టరీగా ఉందని, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో, డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో రికార్డులు లేవని అధికారులు చెబుతు న్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని ఆదేశించిన న్యాయమూర్తి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేశారు.