Rs 300 crore
-
300 కోట్ల విలువైన భూ రికార్డులు మాయం
దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్ల విలువైన భూముల రికా ర్డులు మాయం అయ్యాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామంలో భూ రికార్డులు మాయమయ్యాయని, భూముల విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంటూ హెచ్.మల్లేశ్వరరావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యం బుధవారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ రిట్‌ను విచారిం చిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు కలెక్టర్ దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రికార్డులు మాయం కావడం మిస్టరీగా ఉందని, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో, డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో రికార్డులు లేవని అధికారులు చెబుతు న్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కలెక్టర్ విచారణ జరపాలని ఆదేశించిన న్యాయమూర్తి విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేశారు. -
6 వరుసలుగా హైదరాబాద్–బీజాపూర్ రోడ్డు
మంత్రి మహేందర్‌రెడ్డి చేవెళ్ల రూరల్: హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి త్వరలోనే ఆరు వరుసల రహదారిగా మారనుందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికి కేంద్రం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు చేయి స్తామని చెప్పారు. గుంతలమయంగా మారిన ఈ రహదారిని వెంటనే మర మ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, హైదరాబాద్‌కి కావాల్సిన కూరగాయలను నగర శివారు ప్రాంతS రైతులు పండించేలా చర్యలు తీసుకుం టున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన ప్రోత్సహకాలను అందింస్తామన్నారు. -
ఆ గణపతికి కోట్లలో బీమా కవరేజ్
ముంబై : వినాయక చవితి.. వీధికో వినాయకుడితో ఊరంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో ఇదీ ఒకటి. వినాయక చవితికి ఇంకా రెండు రోజులే సమయం మిగిలి ఉండటంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. అప్పుడే మండపాలు ఏర్పాటు, అలంకరణ పనులు ప్రారంభిచేశారు. ఎప్పటిలాగే ముంబాయిలో భారీ గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తున్న సేవా మండల్లు భారీగా బీమా కవరేజ్‌లు పెంచేశాయట. ఈ ఏడాది రికార్డు స్థాయిలో బీమా కవరేజ్‌లు పెరిగాయట. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భారీ గణపతిని ప్రతిష్టిస్తున్న జీఎస్బీ సేవా మండల్ ... ఏకంగా రూ.300 కోట్లకు ఆ విగ్రహానికి ఇన్సూరెన్స్ చేపించింది. ఈ బీమా మొత్తం గతేడాది కంటే రూ.2 కోట్లు ఎక్కువగా ఉంది. భారీ ఎత్తున్న వెండి గణపతికి కానుకగా వస్తుండటంతో బీమా కవరేజ్‌ను పెంచినట్టు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. తమ గణపతిని 68 కేజీల బంగారం, 315 కేజీల వెండితో ముస్తాబు చేశామని, గతేడాది 298 కేజీల వెండి కంటే ఈ ఏడాది 17 కేజీల ఎక్కువ వెండితో అలంకరించామని మాజీ అధ్యక్షుడు ఆర్జీ భట్ తెలిపారు. కానుకలు సమర్పిస్తున్న వారందరీ కోరికలను దేవుడి తీర్చాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. దేవత కోసం అందమైన మండపాన్ని కూడా తయారుచేస్తున్నట్టు చెప్పారు. రూ.300 కోట్ల బీమా కవరేజ్‌లో రూ.25 కోట్లు ఆభరణాలకు, రూ.10 కోట్లు అగ్నిప్రమాదం, భూకంపాలకు, రూ.40 కోట్లు ప్రజా బాధ్యత రక్షణకు, మిగిలిన రూ.225 కోట్లు భక్తులు, అధికారులు, స్వచ్ఛంద సేవకుల రక్షణగా చేపించారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ దీనికి బీమా అందిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ముంబాయిలోని మరో ప్రముఖ గణేశుడు లాల్ బగ్చా రాజాకు రూ.51 కోట్లు, ముంబాయి కా రాజా గణేశుడికి రూ.5.53 కోట్లు ఇన్సూరెన్స్ చేపించారు. దొంగతనం, ఉగ్రవాద ముప్పు, అగ్నిప్రమాదాలు వంటి కారణాలతో మండల్లు ఇన్సూరెన్స్ కవరేజ్‌కు కంపెనీలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. -
300 కోట్లు చెల్లించడానికి సిద్ధం : సుబ్రతా రాయ్
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతారాయ్ తనకు మంజూరు చేసిన పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించడానికి అదనంగా రూ.300 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు. రెండేళ్ల పాటు తిహార్ జైలులో ఊచలు లెక్కేస్తున్న సుబ్రతారాయ్‌కు ఆయన తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. రూ.300 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆయన పెరోల్ గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. సుప్రీం ఆదేశాల మేరకు బ్యాంకు గ్యారెంటీతో అదనంగా రూ.300 కోట్లను సర్దుబాటు చేయనున్నట్టు రాయ్ తెలిపారు. రెండు గ్రూప్ సంస్థలు-మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమై కేసులో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. బెయిల్ కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో.. సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ పెరోల్‌పై కొనసాగుతున్నారు. -
ఆర్టీసీకి రూ.300 కోట్ల తక్షణ సాయం
ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.300 కోట్లను ప్రకటించింది. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో చేతిలో చిల్లిగవ్వ కూడా లే ని దుస్థితిలో కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రత్యేక నిధిని కూడా ఆర్టీసీ వాడేసుకుంది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు ఉపయోగపడాల్సిన నిధులను వాడుకున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం.. కనీసం వాటిని సర్దుబాటు చేసే ఉద్దేశంతో తక్షణ సాయం ప్రకటించనున్నట్టు హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ.300 కోట్లు విడుదల చేయాల్సిందిగా గురువారం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇక 1,100 కొత్త బస్సులు కొనాలని నిర్ణయించిన ఆర్టీసీ.. అందుకు సాయం చేయాల్సిందిగా ఇటీవల సీఎంను కోరింది. కావాలంటే బ్యాంకుకు పూచీకత్తు ప్రభుత్వం ఉంటుందని, బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. ఈ మేరకు రూ.350 కోట్లు ఆర్టీసీకి రుణం ఇప్పించాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. సిటీ బస్సు నష్టాలను జీహెచ్ఎంసీ నిధులతో పూడ్చే చర్యల్లో భాగంగా రూ.190 కోట్లు ఇప్పించినట్టు సీఎం పేర్కొన్నారు. ఇక బస్‌పాసు రాయితీని పూర్తిగా ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.