300 కోట్లు చెల్లించడానికి సిద్ధం : సుబ్రతా రాయ్
300 కోట్లు చెల్లించడానికి సిద్ధం : సుబ్రతా రాయ్
Published Fri, Aug 26 2016 12:36 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతారాయ్ తనకు మంజూరు చేసిన పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించడానికి అదనంగా రూ.300 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు. రెండేళ్ల పాటు తిహార్ జైలులో ఊచలు లెక్కేస్తున్న సుబ్రతారాయ్కు ఆయన తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది.
రూ.300 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆయన పెరోల్ గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. సుప్రీం ఆదేశాల మేరకు బ్యాంకు గ్యారెంటీతో అదనంగా రూ.300 కోట్లను సర్దుబాటు చేయనున్నట్టు రాయ్ తెలిపారు. రెండు గ్రూప్ సంస్థలు-మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమై కేసులో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. బెయిల్ కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో.. సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ పెరోల్పై కొనసాగుతున్నారు.
Advertisement