Sahara Chief Subrata Roy
-
రూ. 62,600 కోట్లు చెల్లించకుంటే జైలుకే!
ముంబై, సాక్షి: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌తోపాటు, అతనికి చెందిన మరో రెండు కంపెనీలను 8.4 బిలియన్ డాలర్లు(రూ. 62,600 కోట్లు) చెల్లించవలసిందిగా ఆదేశించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. చెల్లించలేని పక్షంలో అతనికిచ్చిన బెయిల్‌ను రద్దు చేయవలసిందిగా కోరింది. సహారా గ్రూప్.. 2012, 2015లలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ఈ సందర్భంగా సెబీ తాజా ఫిర్యాదులో పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించవలసిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియజేసింది. 2014లో అరెస్టయిన రాయ్ 2016 నుంచీ బెయిల్‌పై ఉన్నారు. 8 ఏళ్లుగా.. గత 8 ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘింస్తున్న రాయ్ ఇకనైనా పూర్తిసొమ్మును చెల్లించకుంటే కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టును తాజా ఫిర్యాదులో సెబీ కోరింది. గతంలో సహారా ఇండియా పరివార్ గ్రూప్ అసలు మొత్తంలో కొంతమేర మాత్రమే డిపాజిట్ చేసిందని, మిగిలిన సొమ్ముతోపాటు వడ్డీలు కలిపి భారీగా రూ. 62,600 కోట్లకు చేరాయని సుప్రీంకు సెబీ వివరించింది. 8 ఏళ్ల క్రితం ఈ మొత్తం రూ. 25,700 కోట్లు మాత్రమేనని తెలియజేసింది. కాగా.. సహారా ఇప్పటికే సెబీకి రూ. 22,000 కోట్లు డిపాజిట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే పూర్తి సొమ్ముపై వడ్డీని విధించడం ద్వారా సెబీ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. సహారా గ్రూప్ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి 3.5 బిలియన్ డాలర్లను చట్టవిరుద్ధంగా సమీకరించినట్లు 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే సహారా గ్రూప్ ఈ నిధులను తిరిగి చెల్లించకపోవడంతో గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌ను జైలుకి తరలించారు. -
సెప్టెంబర్ 7లోగా రూ.1,500 కోట్లు కట్టండి
సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు నిధులు వాపసు చేయాల్సిన కేసుకు సంబంధించి సెప్టెంబర్ 7లోగా సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో రూ. 1,500 కోట్లు జమచేయాలంటూ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయనకు మంజూరు చేసిన పెరోల్ గడువును అక్టోబర్ 10 దాకా పొడిగించింది. అటు ఆంబీ వ్యాలీ ప్రాపర్టీ విక్రయానికి సేల్ నోటీసును ప్రచురించడానికి బాంబే హైకోర్టుకు చెందిన అధికారిక లిక్విడేటరుకు అనుమతులిచ్చింది. కేసుపై తదుపరి విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. గ్రూప్ కంపెనీలైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్.. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన రూ. 24,000 కోట్లు తిరిగి చెల్లించాల్సిన కేసులో సుబ్రతా రాయ్ దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది మే 6న ఆయనకు పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం నిర్దిష్ట తేదీల్లోగా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేస్తూ ఉండాలని, లేని పక్షంలో పెరోల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సుబ్రతారాయ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జూలై 15 నాటికి రూ. 552.21 కోట్లు జమ చేయాల్సి ఉండగా రూ. 247 కోట్లే జమచేయగలిగామని, మిగతా మొత్తం రూ. 305.21 కోట్లను ఆగస్టు 12 నాటికి డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి కట్టాల్సిన రూ. 1,500 కోట్లలో దీన్ని కూడా లెక్కవేసి కట్టాలంటూ సుప్రీం కోర్టు సూచించింది. -
‘రూ.600కోట్లు జమ చేయ్.. లేదంటే ఇక జైలుకే..’
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 6లోగా సెబీ-సహారాలో రూ.600 కోట్లు జమచేయాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చదవండి..(పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!) ఇప్పటికే ఆయనకు చాలా అవకాశం ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. మరింత గడువు కావాలంటూ మరోసారి సహారా గ్రూపు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఇప్పటి వరకు సహారా గ్రూపు పెట్టుబడిదారులకు దాదాపు రూ.18,000 కోట్లు తిరిగి చెల్లించింది. అనంతరం మరో వెయ్యి కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి అనంతరం ఆ మొత్తాన్ని రూ.600 కోట్లకు తగ్గించి ఫిబ్రవరి 6నాటికి చెల్లించాలని ఆదేశించింది. -
పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!
సహారా చీఫ్ సుబ్రతా రాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. 2017 ఫిబ్రవరి 6వరకు పెరోల్ గడువు పొడిగిస్తున్నట్టు సుప్రీం సోమవారం పేర్కొంది. అయితే జైలు బయట ఉండటానికి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు రూ.600 కోట్లను డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సహారా చీఫ్‌ను ఆదేశించింది. ఒకవేళ డబ్బును డిపాజిట్ చేయని పక్షంలో సరెండర్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 25న కూడా సుప్రీంకోర్టు సుబ్రతా రాయ్ పెరోల్‌ను నవంబర్ 28వరకు పొడిగించింది. ఈ పొడిగింపుకు సహారా గ్రూప్ రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. మరో రూ.200 కోట్లను నవంబర్ ఆఖరికల్లా చెల్లించనున్నట్టు సహారా పేర్కొంది. కాగ, సుబ్రతారాయ్ తల్లి గత మే నెలలో మరణించడంతో కోర్టు మానవతా దృక్పథంతో ఆయనకు పెరోల్ మంజూరు చేసింది. ఆ తర్వాత డిపాజిట్ దారులకు డబ్బు వెనక్కి ఇచ్చేందు కోసం నాటి నుంచి ఆయన పెరోల్‌ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. నేటితో ముగుస్తున్న ఆయన పెరోల్ గడువును అపెక్స్ కోర్టు మరోసారి పొడిగించింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రెండు సహారా గ్రూప్ సంస్థలు రూ.25,000 కోట్లు వసూలు చేయడం.. వడ్డీతో సహా మొత్తం రూ.35,000 కోట్లు దాటి వాటిని తిరిగి చెల్లించడంలో ఆ సంస్థలు వైఫల్య చెందాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. అనంతరం ఆయన పెరోల్‌పై బయటికి వచ్చారు. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు(సగం నగదు రూపంలో, సగం బ్యాంకు గ్యారెంటీ రూపంలో) చెల్లించాలని మార్చి 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిలో సగం మొత్తం సహారా నగదు రూపంలో సహారా చెల్లించింది. కానీ బ్యాంకు గ్యారెంటీ తరుఫును ఇవ్వాల్సిన రూ.5000 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. -
పెరోల్ పై కొనసాగనున్న రాయ్!
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, సంస్థకు సంబంధించి మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే అక్టోబర్ 24 తరువాతా పెరోల్‌పై కొనసాగడానికి మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28 ఆదేశాలకు అనుగుణంగా గడువుకన్నా రెండు రోజుల ముందుగానే శుక్రవారం సెబీకి సహారా రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ ఏర్పాటు కొనసాగడానికి నవంబర్ 28వ తేదీలోపు సహారా మరో రూ.200 కోట్లు చెల్లించాలని సుప్రీం బెంచ్ ఆదేశించింది. కాగా సెబీ సహారా అకౌంట్లో డిసెంబర్ 2018 నాటికి రూ.12,000 కోట్లు జమచేయడానికి సంబంధించి రోడ్‌మ్యాప్‌తో తాము సిద్ధమని రాయ్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు శుక్రవారం విన్నవించారు. -
సహారా చీఫ్ కి సుప్రీం షాక్
న్యూఢిల్లీ సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కి సుప్రీంకోర్టు షాకి ఇచ్చింది. ఆయన పెరోల్ ను రద్దు చేసింది. ఇటీవల పెరోల్ మీద బయటకు వచ్చిన సుబ్రతా తాత్కాలిక బెయిల్ ను పొడిగించడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వెంటనే ఆయన్ను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. అక్టోబర్ మూడు వరకు జ్యడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సహారా న్యాయవాది, సుప్రీం న్యాయవాది మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి సుబ్రతాను జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. సహారా చీఫ్ సుబ్రతా రాయ్ తో పాటు మరో ఇద్దరి పెరోల్ కూడా రద్దు చేసిన సుప్రీం వారిని తిరిగి జైలుకి పంపాలని స్పష్టం చేసింది. కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. అయితే తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6 న నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సినమొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతు తో ఆగస్టు 3 న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత నేటివరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
300 కోట్లు చెల్లించడానికి సిద్ధం : సుబ్రతా రాయ్
న్యూఢిల్లీ: సహారా అధినేత సుబ్రతారాయ్ తనకు మంజూరు చేసిన పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించడానికి అదనంగా రూ.300 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాను మార్కెట్ రెగ్యులేటరీ సెబీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపారు. రెండేళ్ల పాటు తిహార్ జైలులో ఊచలు లెక్కేస్తున్న సుబ్రతారాయ్‌కు ఆయన తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే నెలలో జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. రూ.300 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేయాలనే ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆయన పెరోల్ గడువును సెప్టెంబర్ వరకు పొడిగించింది. సుప్రీం ఆదేశాల మేరకు బ్యాంకు గ్యారెంటీతో అదనంగా రూ.300 కోట్లను సర్దుబాటు చేయనున్నట్టు రాయ్ తెలిపారు. రెండు గ్రూప్ సంస్థలు-మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమై కేసులో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. బెయిల్ కోసం చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో.. సుప్రీం ఆదేశాల మేరకు కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ పెరోల్‌పై కొనసాగుతున్నారు. -
సుబ్రతో రాయ్ కి మాతృవియోగం: విడుదలపై సందిగ్ధం
లక్నో: సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ మాతృమూర్తి చ్ఛబీ రాయ్ (95) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో లక్నోలోని తమ నివాసంలో తుదిశ్వాస విడిచారని సహారా అధికార ప్రతినిధులు తెలిపారు. ముదుపు దారులను మోసం చేశారనే ఆరోపణలపై గడిచిన రెండేళ్లుగా జైలులో ఉంటోన్న సుబ్రతోరాయ్ కి తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున ఆమె దగ్గర ఉండేదుకు బెయిల్ మంజూరు చేయాలని సుబ్రతోరాయ్ పలు మార్లు సుప్రీంకోర్టుకు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. అయితే సుబ్రతో తన తల్లిని ఆసుపత్రిలో చర్పించలేదని, ఇంట్లోనే ఉంచి చికిత్స చేయిస్తున్నారని సెబీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో ఆ విషయం వివాదంగా మారింది. తల్లి సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని సుబ్రతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ డిఫెన్స్ న్యాయవాదులు గట్టిగా వాదించడంతో సహారా చీఫ్ కు బెయిల్ దొరకలేదు. ఇప్పుడు ఆమె మరణించినందువల్ల రాయ్ కి తప్పక అనుమతి లభించవచ్చని సమాచారం. బిహార్ లోని అరారియా జిల్లాలో జన్మించిన చ్ఛబీ రాయ్.. లక్నోవాసి సుధీర్ చంద్రరాయ్ ని పెళ్లాడారు. వారి సంతానమైన సుబ్రతో వ్యాపార రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అత్యున్నతస్థాయికి చేరారు. అంతలోనే పాతాళానికి పడిపోయారు. సహారా పరివార్ ప్రయాణంలో చ్ఛబీ రాయ్ చుక్కానిలా మార్గదర్శకత్వం వహించారని ఆమె మరణంపై విడుదల చేసిన ప్రకటనలో సహారా పరివార్ పేర్కొంది. చ్ఛబీ రాయ్ కి 1998 పేర్ మేకర్ ను అమర్చారు. 2008లో మరోసారి దానిని రీప్లేస్ చేశారు. దీనితోపాటు శ్వాస సంబంధమైన వ్యాధులతోనూ ఆమె బాధపడేది. -
మరి డిపాజిటర్ల సంగతేంటి?
⇒ వారికి చెల్లించాల్సింది కూడా చూడాలి కదా! ⇒ సహారా కేసులో సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ: మదుపరులకు సహారా గ్రూప్ చెల్లింపుల ప్రతిష్టంభనపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలన్న సంగతి అటుంచితే... డిపాజిట్‌దార్లకు చెల్లించాల్సిన మొత్తం నిధుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఈ సమస్య పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘ బెయిల్‌కు సంబంధించి బ్యాంకు గ్యారెంటీలను మేం అంగీకరిస్తాం. సరే... మరి డిపాజిట్ దార్లకు చెల్లించాల్సిన మిగిలిన మొత్తం సంగతేంటి? ఈ ప్రతిష్టంభన కూడా పరిష్కారం కావాలని మేం కోరుకుంటున్నాం’’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవే, ఏకే సిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. 2012 ఆగస్టు 31వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సహారా సంస్థ రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో సహా మూడు నెలల్లో చెల్లించాల్సి ఉంది. కానీ సహారా ఈ నిధులు చెల్లించలేకపోయింది. వాయిదాలు అడిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014 మార్చి నుంచీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సహారా చీఫ్, మరో ఇరువురు సహారా గ్రూప్ సంస్థల డెరైక్టర్లు తీహార్ జైలులో ఉన్నారు. రాయ్ బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని, ఇందులో రూ.5,000 కోట్లు నగదుగా, మిగిలిన మొత్తం బ్యాంక్ గ్యారెంటీగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిధుల సమీకరణకు సహారా... ఆస్తుల అమ్మకం సహా పలు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవి విజయవంతం కాలేదు. అంతకుముందు సహారా గ్రూప్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తమ క్లయింట్ తరఫు వాదనలు వినిపిస్తూ... బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించటంలో భాగంగా వచ్చే వారం రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కేసు తదుపరి విచారణ మే 14కు వాయిదా పడింది. -
పెటాకులకు సహారానే కారణం: మిరాచ్
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి నిధుల సమీకరణ విషయంలో జరిగిన డీల్ మసకబారిపోవడానికి ఆ సంస్థే కారణం తప్ప తాము కాదని అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. భారతీయ సంతతికి చెందిన ఈ సంస్థ సీఈఓ సారాంశ్ శర్మ ఈ మేరకు ఒక ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు నిధుల వేటలో కొత్త దారులను సహారా వెతకడం ప్రారంభించింది. అలాగే తమను ఘోరంగా మోసాచేశారంటూ మిరాచ్ కేపిటల్‌పై చట్టపరమైన చర్యలను సైతం ప్రారంభించే పనిలో ఆ సంస్థ నిమగ్నమైందని గ్రూప్ వర్గాలు తెలిపాయి. కాగా విదేశాల్లో మూడు హోటల్స్ (న్యూయార్క్‌లోని ప్లాజా, డ్రీమ్ హోటల్స్- లండన్‌లోని గ్రాస్‌వీనర్)ను పూర్తిగా కొనుగోలు చేస్తామన్నది తమ తుది ప్రతిపాదన తప్ప, తనఖాల ద్వారా రుణాలివ్వడం ఆఫర్ కాదని, ఈ విషయం స్పష్టం చేసినందునే డీల్‌ను సహారా తనకుతానుగా అనవసరంగా చెడగొట్టుకుంటోందని వివరించింది. అసలు సహారాకు ఈ ఆస్తుల విక్రయం ఇష్టం లేదని మిరాచ్ తెలిపింది. తమతోపాటు సుప్రీంకోర్టు, సెబీలు విలువైన కాలాన్ని సహారా వృథా చేసిందని మిరాచ్ విమర్శించింది. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫోర్జరీ లేఖను మిరాచ్ తమకు చ్చిందంటూ సహారా ఆరోపించిన అంశంపై మాత్రం మిరాచ్ ఏ వ్యాఖ్యానం చేయలేదు. ఇదీ విషయం... మొదలిలా... సహారా గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశాయన్నది ఆరోపణ. ఇన్వెస్టర్లకు నిధుల పునఃచెల్లింపులకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది. దీనిపై సహారా వైఫల్యంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్లను దాఖలు చేసింది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం... గత ఏడాది మార్చిలో సహారా చీఫ్ రాయ్‌ని తీహార్ జైలుకు పంపింది. బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. రంగంలోకి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ డీల్‌లో తమ పాత్ర ఏదీ లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటించడంతో వ్యవహారం మొత్తం సందేహాస్పదమైంది. కోర్టు డాక్యుమెంట్లలో బ్యాంకర్‌గా తన పేరును పేర్కొన్నట్లు తెలుసుకుని తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి ఒకరు ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో తమను మిరాచ్ మోసం చేసినట్లు సహారా ప్రకటించింది. డాక్యుమెంట్ల ఫోర్జరీలు జరిగినట్లు ఆరోపిస్తూ, ఈ విషయంలో అమెరికా సంస్థ మిరాచ్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. సహారా నిధుల వేట... సుప్రీం ఆదేశంతో విదేశాల్లోని మూడు హోటళ్లను విక్రయం లేదా తనఖా చేసే పనిలో పడింది. ఈ పరిస్థితుల్లో బ్రూనై సుల్తాన్ నుంచి నిధులు వస్తాయని అనుకున్నా... చివరకు ఆ డీల్ కుదరలేదు. రెండవ డీల్ విషయానికి వచ్చే సరికి మిరాచ్ సంస్థ తాజా ప్యాకేజ్ ఆఫర్ చేసిందని సుప్రీంకోర్టుకు సహారా తెలిపింది. దీనికి బ్యాంకర్‌గా బ్యాంక్ ఆఫ్ అమెరికా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంటూ మిరాచ్ ఇందుకు సంబంధించి డాక్యుమెంట్లు తమకు ఇచ్చిందంటూ సుప్రీంకూ సహారా విన్నవించింది. మిరాచ్ ఏమంటోందంటే... సహారా ఆస్తులను కొనుగోలు చేయడానికి మేము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాం. ఫోర్జరీ ఆరోపణలు సత్యదూరం. మూడు హోటళ్లను పూర్తిగా తాము కొనుగోలు చేస్తామన్నది ప్రతిపాదన తప్ప... తనఖా లావాదేవీ ప్రతిపాదన ఎక్కడా రాలేదు. ఈ విషయాన్నే మేము సహారా గ్రూప్‌కు స్పష్టం చేశాం. అయితే దీనికి తొలుత సరేనన్న సహారా, చివరకు తన వైఖరిని మార్చుకుని ఈ కేసులో సుప్రీంకోర్టు, సెబీ, మా కంపెనీ, ఇన్వెస్టర్ల విలువైన సమయాన్ని వృథా చేసింది. సహారాకు ఈడీ నోటీస్ లండన్ హోటల్ సంబంధించి సహారాకు శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరైట్ (ఈడీ) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్ఈఎంఏ- ఫెమా) కింద షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లగ్జరీ హోటల్ గ్రాస్‌వీనర్ కొనుగోలు వ్యవహారంలో రూ. 3,600 కోట్ల మేర నిబంధనలు ఉల్లంఘించిందన్నది ఆరోపణ. రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్ నుంచి 2010లో నిధుల బదలాయింపుల సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందనీ, విదేశాల్లో భారత్ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను పాటించలేదని, సంస్థ అనుమతులు సైతం తీసుకోలేదని ఈడీ పేర్కొంది. ఈ కేసును ఆర్బీఐ ఈడీకి రిఫర్ చేసిందని, తాజాగా దీనిపై షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.