ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి తక్షణ సాయంగా ప్రభుత్వం రూ.300 కోట్లను ప్రకటించింది. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో చేతిలో చిల్లిగవ్వ కూడా లే ని దుస్థితిలో కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రత్యేక నిధిని కూడా ఆర్టీసీ వాడేసుకుంది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
కార్మికులకు ఉపయోగపడాల్సిన నిధులను వాడుకున్న తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం.. కనీసం వాటిని సర్దుబాటు చేసే ఉద్దేశంతో తక్షణ సాయం ప్రకటించనున్నట్టు హామీ ఇచ్చారు. ఆ మేరకు రూ.300 కోట్లు విడుదల చేయాల్సిందిగా గురువారం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇక 1,100 కొత్త బస్సులు కొనాలని నిర్ణయించిన ఆర్టీసీ.. అందుకు సాయం చేయాల్సిందిగా ఇటీవల సీఎంను కోరింది. కావాలంటే బ్యాంకుకు పూచీకత్తు ప్రభుత్వం ఉంటుందని, బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు.
ఈ మేరకు రూ.350 కోట్లు ఆర్టీసీకి రుణం ఇప్పించాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. సిటీ బస్సు నష్టాలను జీహెచ్‌ఎంసీ నిధులతో పూడ్చే చర్యల్లో భాగంగా రూ.190 కోట్లు ఇప్పించినట్టు సీఎం పేర్కొన్నారు. ఇక బస్‌పాసు రాయితీని పూర్తిగా ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం రూ.500 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఆర్టీసీకి రూ.300 కోట్ల తక్షణ సాయం
Published Fri, Jun 24 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement