6 వరుసలుగా హైదరాబాద్‌–బీజాపూర్‌ రోడ్డు | 6 rows Hyderabad-Bijapur Road | Sakshi
Sakshi News home page

6 వరుసలుగా హైదరాబాద్‌–బీజాపూర్‌ రోడ్డు

Published Fri, Jan 13 2017 2:20 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

6 వరుసలుగా హైదరాబాద్‌–బీజాపూర్‌ రోడ్డు

6 వరుసలుగా హైదరాబాద్‌–బీజాపూర్‌ రోడ్డు

మంత్రి మహేందర్‌రెడ్డి
చేవెళ్ల రూరల్‌: హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారి త్వరలోనే ఆరు వరుసల రహదారిగా మారనుందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. దీనికి కేంద్రం రూ.300 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులు చేయి స్తామని చెప్పారు. గుంతలమయంగా మారిన ఈ రహదారిని వెంటనే మర మ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, హైదరాబాద్‌కి కావాల్సిన కూరగాయలను నగర శివారు ప్రాంతS రైతులు పండించేలా చర్యలు తీసుకుం టున్నట్లు చెప్పారు. రైతులకు కావాల్సిన ప్రోత్సహకాలను అందింస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement