
గద్వాల టౌన్: నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయిలో ‘రైతుబంధు’డబ్బును ఖాతాల్లో జమ చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం గద్వాలలో లబ్ధిదారులకు పాడి పశువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ‘రైతుబంధు’పై సరైన అవగాహన లేక విమర్శలు చేస్తున్నారన్నారు. ఎలాంటి కోతలు లేకుండా దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. కార్యక్రమంలో గద్వాల, అలంపూర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, వెంకటేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.