సాక్షరభారత్ కో ఆర్డినేటర్ ఆత్మహత్యాయత్నం
శాయంపేట : తనకు 16 నెలలుగా వేత నం ఇవ్వకుండా ఎంపీపీ రమాదేవి అడ్డుకుంటున్నారని సాక్షరభారత్ మండల కో ఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామి ఎంపీడీఓ కార్యాలయం ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శాయంపేటలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. 2014 డిసెంబర్ 21న(ఆదివారం) మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా కుమారస్వామి హాజరుకాలేదు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటూ కుమారస్వామిని విధుల నుంచి తొలగిస్తూ తీర్మా నం చేశారు. ఈ విషయూన్ని ఆయనకు 2015 మార్చి 27న లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినా, ఎవరూ పట్టించుకోకపోవడంతో తనను అన్యాయంగా తొ లగించారంటూ ఎంపీపీ, ఎంపీడీఓపై కో ర్టులో కేసు వేయగా, కుమారస్వామిని విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేత నాలు చెల్లించాలని ఆర్డర్ ఇచ్చింది.
దీంతో 2015 మార్చి11న ఎంపీపీ, ఎంపీడీఓకు జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన కుమారస్వామి నాటి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, పెండింగ్ వేతనాలు చెల్లిం చాలంటూ మార్చి 22న కుమారస్వామి భార్యా పిల్లలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టగా, ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఆయనతో మాట్లాడి దీక్ష విరమింపజేశారు. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం రావాల్సిన 16 నెలల వేతనాన్ని ఇవ్వాలంటూ ఎంపీడీవో భద్రునాయక్ అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీకి సిఫారసు చే శారు.
అయితే కుమారస్వామి తనకు సమాచారం లేకుండా విధులకు ైగె ర్హాజరయ్యూడని, పని చేయని సమయంలో వేతనాలు ఎలా ఇస్తామని గత 28న జరిగిన సమావేశంలో ఎంపీపీ రమాదేవి ప్రశ్నించారు. కాగా, తనకు రావాల్సిన వేతనాల గురించి కుమారస్వామి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడ గా, ఎంపీపీ చెప్పడం వల్లే వేతనాలు ఆపామని వారు చెప్పారు. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సీఐ శ్రీనివాస్ కుమారస్వామిని ఆపి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయమై ఎంపీపీ రమాదేవిని ‘సాక్షి’ వివరణ కోరగా, కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత తిరి గి విధుల్లో చేరుతున్నట్లు కుమారస్వా మి రిపోర్టు ఇవ్వలేదని చెప్పారు. పని చేయనప్పుడు వేతనాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు.