తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం | saffron juggernaut plans to roll into Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం

Published Tue, Apr 4 2017 4:18 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం - Sakshi

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం

హైదరాబాద్‌ : రాజకీయాల్లో నైతికత చాలా ముఖ్యమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని,  ఇక్కడ తమ ప్రయోగం విజయవంతం అవటం ఖాయమని  ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. దక్షిణాదిన కూడా పార్టీ బలోపేతానికి బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టిందన్నారు. టీఆర్‌ఎస్‌ ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు చేయలేదని దత్తాత్రేయ విమర్శలు చేశారు. 

బంగారు తెలంగాణ చేస్తామని టీఆర్‌ఎస్‌ ఎన్నికలపుడు హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆమేరకు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. కొత్త ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించిన దత్తాత్రేయ త్వరలో సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోసం చర్చలు జరిపామని, త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement