ఉపాధికి ఊతమిస్తా.. | 'Sakshi' VIP Reporter by MLC KOMPALLY Yadava Reddy | Sakshi
Sakshi News home page

ఉపాధికి ఊతమిస్తా..

Published Mon, Jan 19 2015 5:00 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM

ఉపాధికి ఊతమిస్తా.. - Sakshi

ఉపాధికి ఊతమిస్తా..

యువతను, మహిళలను ఆదుకుంటా     
నారెగూడ పురోభివృద్ధికి పాటుపడతా
ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి
కష్టాల కడలికి ఎదురీదుతూ.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది ఆ గ్రామం. తాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతోంది. అంతర్గత రహదారులు, మురుగునీటి కాల్వలు సక్రమంగా లేకపోవడంతో స్థాని కులు సతమతమవుతున్నారు. నవాబుపేట మండలం పూల పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నారెగూడ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది.


గ్రామంలో బీఎస్‌ఎన్‌ఎల్ లీజ్‌లైన్ అందుబాటులో లే కపోవడంతో స్థానిక కెనరా బ్యాంక్ సేవలను సమీప గ్రామాల ప్రజలు, రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి నారెగూడలో పర్యటించారు. స్థానికుల కష్టాలను తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ హామీలు
 
స్థానిక యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా  
త్వరితగతిన బీఎస్‌ఎన్‌ఎల్ లీజ్‌లైన్ ఏర్పాటుZ
గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హాల్  
సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. తాగునీటి పైపులైన్
ఏర్పాటుకు నిధులు కేటాయిస్తా
 
ఎమ్మెల్సీ: అమ్మా.. నమస్కారం మీ సవుస్య చెప్పండి?
లక్ష్మమ్మ: సార్ నా భర్త చనిపోయాడు. నాకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగముందని నాకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు.
 
ఎమ్మెల్సీ: పెద్ద కొడుకును మినహాయించి మీ ముగ్గురికి రేషన్ కార్డు వచ్చేలా చూస్తాం.
ఎమ్మెల్సీ: ఏం పెద్దమనిషి.. పింఛన్ వస్తోందా?
పాపయ్య: పింఛన్ వస్తోంది సార్.. కానీ గ్రావుంలో మురుగు కాలువలు లేక మురుగు నీరు రోడ్డుపై పారుతోంది. మురుగు కాలువ నిర్మించి, సీసీ రోడ్డు వేయాలి.
 
ఎమ్మెల్సీ: మురుగు కాలువ నిర్మించి, సీసీ రోడ్డు వేయిస్తాం.  
ఎమ్మెల్సీ:ఏం తమ్ముడు ఏం పని చేస్తున్నావ్.. ఆటో ఇంటి వద్ద ఉందేమిటి?
బందయ్య: ఆటో నడిపితే వచ్చే ఆదాయుంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా. అందుకే ఆటో ఇంటి వద్దే ఉంచి కల్లు దుకాణం పెట్టుకొని బతుకుతున్నాం.
 
ఎమ్మెల్సీ: పెద్దమ్మా.. నీకు పింఛన్ వస్తోందా ?
లక్ష్మమ్మ: వస్తోంది సార్ ..
 
ఎమ్మెల్సీ: మీ గ్రావుంలో ఇంకేం సవుస్యలున్నాయ్?
కిష్టయ్య: సార్.. ఇళ్ల మధ్య మంచి నీటి చేదబావి ఉంది. దాని చుట్టూ బండలు లేక అధ్వానంగా మారింది.  
 
ఎమ్మెల్సీ: చేదబావిని బాగు చేయించి, వినియోగంలోకి వచ్చేలా చూస్తాం. కావాల్సిన నిధులు మంజూరయ్యేలా చూస్తా.  
ఎమ్మెల్సీ: ఏమమ్మా.. నీ భర్తకు ఏమైంది?
చంద్రమ్మ: రెండు రోజుల కింద కల్లు తాగి ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఉలుకూపలుకూ లేదు.
 
ఎమ్మెల్సీ: ఎక్సైజ్ అధికారులకు చెప్పి కల్తీ కల్లు విక్రయాన్ని బందు చేయిస్తా.
మహిపాల్‌రెడ్డి: గ్రామం నుంచి మూసీ నది (వాగు) వరకు ఫార్మేషన్ రోడ్డు వేయించండి.

ఎమ్మెల్సీ: అక్కడ పొలాలున్న రైతులంతా మాట్లాడుకొని చెబితే తప్పక ఫార్మేషన్ రోడ్డు మంజూరు చేయిస్తా.
కిష్టయ్య: అంతర్గత మురుగు కాలువ నిండి దుర్వాసన వస్తోంది.
 
ఎమ్మెల్సీ: సర్పంచ్‌కు చెప్పి చేయిస్తా.
ఎమ్మెల్సీ: ఏం బాబు.. నీకు వికలాంగుల పింఛన్ వస్తోందా?
రమేష్: రూ.1,500 పింఛన్ వస్తోంది సార్.
మాణెమ్మ: సార్ ఇంత వరకూ మాకు ప్రభుత్వ ఇల్లు రాలేదు. నా భర్తకు వస్తున్న పింఛన్ కూడా రద్దు చేశారు.
 
ఎమ్మెల్సీ: ఇల్లు వచ్చేలా చూస్తాం. నీ భర్తకు పింఛన్ మాత్రం 65 ఏళ్లు నిండాకే వస్తుంది.
పర్మయ్య: సార్.. రేషన్ కార్డులో నా వయస్సు 65 ఏళ్లు ఉంది. ఆధార్ కార్డులో తక్కువగా ఉండడంతో పింఛన్ ఇవ్వడం లేదు.
 
ఎమ్మెల్సీ: తహసీల్దార్‌తో మాట్లాడి ఆధార్ కార్డులో వయస్సు సరిచేసుకుంటే పింఛన్ వస్తుంది.
ఎమ్మెల్సీ: పెద్దమ్మా.. నీ సమస్యలేంటి?
మల్లమ్మ: నా కొడుకు, మనవడు చనిపోయారు. కోడలు, మనవరాలు ఉంది. మాకు ఇంత వరకు ఇల్లు రాలేదు.
 
ఎమ్మెల్సీ: బాధపడకండి.. ఇల్లు వుంజూరయ్యేలా చూస్తా.
అనంతమ్మ: సార్.. మా ఇంటి ముందు మురుగు నీరు వచ్చి చేరుతోంది. కనీసం వీధి లైట్లు కూడా వే యడం లేదు.
 
ఎమ్మెల్సీ: మురుగు కాలువ నిర్మించేందుకు కృషి చేస్తా.
శివ్వమ్మ: సార్.. నా భర్త చనిపోయి పదేళ్లు కావస్తోంది. వితంతు పింఛన్ రావడం లేదు.
 
ఎమ్మెల్సీ: ఆందోళన వద్దు. నీకు వంద శాతం పింఛన్ వస్తుంది.
సంజీవులు: నాకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు డైట్‌సెట్ పూర్తి చేశారు. బీఈడీ చేరుుంచే స్థోవుత లేదు.
 
ఎమ్మెల్సీ: అవకాశం ఉంటే ప్రైవేటులో కాస్త ఫీజు తగ్గించి సీటు ఇప్పిస్తా.
యాదయ్య: వాటర్ ట్యాంకు నిండి నీళ్లు కిందికి అపరిశుభ్రంగా మారుతోంది. మహిళలు అక్కడే బట్టలు ఉతుకుతున్నారు.
 
ఎమ్మెల్సీ: మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బట్టలు దూరంగా ఉతకాలి. ట్యాంకు నిండాక  మోటారు ఆపుచేస్తే సమస్య రాదు.
అనంతమ్మ (వార్డు మెంబర్): బీసీ కాలనీలో సీసీ రోడ్డు, మురుగు కాలువలు నిర్మించాలి.  
 
ఎమ్మెల్సీ: త్వరలో నిధులు వుంజూరు చేసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తా.
తిరుపతిరెడ్డి: రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగి నాలుగేళ్లుగా మంచంపైనే ఉంటున్నా.
 
ఎమ్మెల్సీ: సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం అందేలా చూస్తా.  
ఎమ్మెల్సీ: ఏం తమ్ముడు.. పత్తి గిట్టుబాటు ఎలా ఉంది?
జాంగీర్: ఎనిమిదెకరాల్లో పత్తి పంటను సాగు చేస్తే 27 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ధర గిట్టుబాటు కావడం లేదు. క్వింటాలుకు రూ. 3900 మాత్రమే పలుకుతోంది. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.
 
ఎమ్మెల్సీ: సీసీఐలో విక్రయిస్తే ప్రభుత్వ మద్దతు ధర రూ.4050 వస్తుంది. వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దు.  
తిరుపతిరెడ్డి (సర్పంచ్): గ్రామంలో మంచినీటి పైపులైన్లను మార్చాలి. ఆరోగ్య ఉప కేంద్రం, బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ లీజులైన్ ఏర్పాటు చేయాలి. వికారాబాద్ నుంచి హైదరాబాద్ (వయా చిలుకూరు మీదగా) ఆర్టీసీ బస్సులు వేయాలి. అంగన్‌వాడీ భవనం మధ్యలో ఆపారు. నారెగూడ నుంచి అక్నాపూర్ వరకు బీటీ రోడ్డు వేయాలి.

ఎమ్మెల్సీ: ఎమ్మెల్యే యాదయ్యతో మాట్లాడి మా ఇద్దరి కోటాల నుంచి నిధులు వుంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తా.
 
దశలవారీగా అభివృద్ధి చేస్తా...
‘సాక్షి’ చొరవతో నారెగూడ గ్రావుంలోని సవుస్యలను పూర్తిగా తెలుసుకున్నాను. చాలా సం తోషంగా ఉంది. ‘సాక్షి’కి ప్రత్యేక కృతజ్ఞతలు. దశలవారీగా గ్రావూభివృద్ధికి కృషి చేస్తా. గ్రావూనికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటా.
 -ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement