వరికోలు శివారులో మోయతుమ్మెద వాగులో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు (ఫైల్)
కోహెడరూరల్(హుస్నాబాద్): ఒకరి అవకాశం మరొకరికి ఆసరాగా మారడం అంటే ఇదే నేమో... అధికారులందరూ ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండటంతో ఇసుకాసురులు అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నారు. పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలించి జోరుగా డంపు చేస్తున్నారు. ఆ నిల్వను రాత్రి వేల టిప్పర్లు, లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. అధికారులు సైతం మామూలుగా తీసుకోవడంతో అక్రమార్కులకు పండుగా చేసుకొంటున్నారు. సాధారణ రోజులకంటే రేట్టింపు ధరలకు ఇసుకను అక్రమ వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదు.
అధికారుల అండదండలతోనే...
మండలంలోని రాంచంద్రాపూర్, తంగళ్లపల్లి, కూరెల్లతో పాటు పలు గ్రామాల్లో అధికారులు అండదండలతో ఇసుక వ్యాపారం మూడు పూవ్వులు ఆరుకాయలుగా వ్యాపారం సాగుతుంది. మోయతుమ్మెద వాగు నుంచి భారీగా ఇసుక తరలిస్తున్న అధికారులు స్పందించకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసుత్తం రెవెన్యూ అధికారులు సోమవారం నుంచి గురువారం వరకు ఇసుక అనుమతి ఇస్తున్నారు. దీనిని అదనుగ భావించిన దళారులు గ్రామాల్లో ఇసుక డంపులు వేస్తూ రాత్రిల్లు సిద్దిపేటతో పాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనుమతి ముసుగులో దళారులు తమ వ్యాపారానికి పదును పేట్టారు. ఎక్కడ ఆవకాశం దొరికిన సోమ్ము చేసుకుంటున్నారు.
కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక..
అవును మీరు విన్నది నిజమే ఇసుక అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సాధారణ సమయంలో కంటే ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఇసుక రూ.5నుంచి 7వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అలాగే ఒక లారీ 40నుంచి 50వేలకు హైదారాబాద్ ప్రాంతాలకు విక్రయిస్తునట్లు సమాచారం. కూలీలతో ఇసుక నింపితే బయట తెలుస్తుందని దళారులు ఏకంగా జేసీబీ ఉపయోగిస్తున్నారు.
సమాచారం అందించినా..
నెల రోజుల క్రితం మండలంలోని ఒక గ్రామంలో ఇసుక డంపు ఉందని గ్రామస్తులు రెవెనూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఇసుక డంపును వీఆర్‌ఏ సహాయంతో గుర్తించిన రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో బేరం కుదుర్చుకుని చూసి చూడనట్లు వ్యవహరించారు. దీంతో అదే రోజురాత్రి డంపు మాయం చేశారు. వ్యాపారులు.అధికారులకు ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందించిన స్పందించకపోవడం, పట్టుబడిన ట్రాక్టర్లను సైతం కార్యాలయానికి తరలించాక విడిచిపేట్టడంతో ప్రజలు అనూమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు...
అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ పనులను బట్టి ఇసుక అనుమతి ఇస్తున్నాం. గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుక తరలింపుపై నిఘా పేడతాం. ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు నిర్ధేశ సమయంలో ఇసుక అనుమతి ఇచ్చాం. – అనిల్‌కుమార్, తహసీల్దార్ కోహెడ
Comments
Please login to add a commentAdd a comment