కేశంపేటలో ఫిల్టర్ ఇసుక డంపింగ్, లింగరావుపల్లి శివారులో ట్రాక్టర్‌లోనే ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్న దృశ్యం
కేశంపేట: గతంలో జోరుగా కొనసాగిన ఫిల్టర్ ఇసుక దందా.. అధికారులు, పోలీసుల దాడులతో కొంతకాలం ఆగిపోయింది. ప్రస్తుతం వరుసగా ఎన్నికలు వస్తుండటంతో అధికారులు ఈ విషయంపై దృష్టిసారించకపోవడంతో మళ్లీ ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. కేశంపేట మండలం బో«ధునంపల్లి గ్రామ శివారులో, తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామ శివారులోని వాగులో మటిని తీసి యాథేచ్ఛగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు.
లింగారావుపల్లి శివారులో ఇసుకను ఫిల్టర్ చేసి బోధునంపల్లి గ్రామ శివారులో డంపు చేస్తున్నారు. ఈ ఇసుకను రాత్రి సమయాల్లో లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరస్తున్నారు. గతంలో రాయితో ఫిల్టర్లను నిర్మించి మట్టితో ఇసుకను తయారు చేసేవారు. ఈ విషయం అధికారులకు తెలిసి ఫిల్టర్లను ధ్వంసం చేసేవారు. ఇప్పుడు అక్రమార్కులు ట్రెండ్ మార్చి ట్రాక్టర్ ట్రాలీలోనే ఇసుకను ఫిల్టర్ చేస్తున్నారు.
ఎవరైనా అధికారులు అటువైపు వస్తే తప్పించుకోవడానికి సులువుగా ఉంటుందని ఈ పద్ధతిని అవలంభిస్తున్నారు. రెండు మండలాలను వాగు విభజిస్తుండడంతో వాగు అవతలివైపు ఫిల్టర్లను, ఇవతలి వైపు డంపింగ్ ఏర్పాటు చేసుకొని దందాను కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం రెండు మండలాల మధ్య నడుస్తున్న నేపథ్యంలో రెండు మండలాల అధికారులు ఏకకాలంలో దాడి చేస్తే తప్ప ఈ దందా ఆగదని రైతులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment