కొల్చారం : అధికారుల నిర్లక్ష ్యంతో ఇసుక అక్రమార్కులు తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అన్న నానుడి నిజం చేస్తూ మంజీరా నదిని జల్లెడ పడుతున్నారు. అధికారులు అటు వైపు చూడక పోవడంతో ఇ దే అదనుగా భావించి ఇసుక అక్రమ రవాణాను జోరుగా సాగిస్తున్నారు. వా ల్టా చట్టం ఇక్కడ ఏ కోశాన కనిపించదు. దీంతో దోపిడీదారుల రాజ్యంగా మారిం ది. మండలంలోని ఎనగండ్ల, కోనాపూర్, వై మాందాపూర్, పైతర, తుక్కాపూర్‌ల మీదుగా మంజీరా నది ప్రవహిస్తోంది.
నదీ ప్రవాహం సమయంలో పెద్ద ఎత్తున ఇసుక తెట్టలు నదిలో పేరుకు పోయి ఉంటాయి. ఇదే సమయంలో ప్రధానంగా కోనాపూర్, మాం దాపూర్, తుక్కాపూర్ గ్రామాలకు చెంది న కొందరు అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా నది నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఇసుక అక్రమ రవాణాకు గ్రామ సేవకులతో పాటు రెవె న్యూ అధికారులు సైతం అండగా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇసుక అక్రమ రవాణాకు ట్రాక్టర్ల యజమాను లు ఏకంగా నదిలోకి రహదారినే ఏర్పా టు చేశారంటే ఎంత దర్జాగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వై.మాందాపూర్, కోనాపూర్ పరి సరాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో లారీల్లో హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు దుంపలకుంట చౌరస్తా మీదుగా తరలిస్తున్నారు.
ఇంత జరుగుతున్న మండల రెవెన్యూ అధికారులుగాని, గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామసేవకులు కూడా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నదిలో ఇసుక మేటలు అంతరించి భూగర్భ జలాలు తగ్గడంతో పాటు వ్యవసాయ బోర్లపై ఆధారపడ్డ తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయా లని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తవ్వుకున్నోడికి.. తవ్వుకున్నంత
Published Tue, Sep 16 2014 11:35 PM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement