జడ్‌పీ ఆదాయానికి గండి
ఇందూరు: టెండర్ల ద్వారా ఇసుక, కంకర, మొరం తరలింపు పనులను తీసుకున్న కాంట్రాక్టర్లు స్థానిక సంస్థల బలోపేతానికి సీనరేజి చార్జీలు చెల్లించేలా 2001లో అప్పటి ప్రభుత్వం జీఓనం. 255ను జారీ చేసింది. అలా సమకూరిన నిధులను గనుల శాఖ నుంచి జిల్లా పరిషత్ జనరల్ ఫండ్‌కు మళ్లించి అభివృద్ధి పనులకు ఉపయోగించాలని నిబంధన పెట్టింది. సీ నరేజి చార్జీల ద్వారా గతంలో జడ్‌పీకి ఏడాదికి దా దాపు రూ.ఐదు కోట్ల వరకు ఆదాయం సమకూరేది. ఈ నిధులను గ్రామ పంచాయతీకు 25 శాతం, మండల పరిషత్‌లకు 50 శాతం, జిల్లా పరిషత్‌కు 25 శాతం కేటాయించేవారు. 2012 నుంచి జడ్‌పీకి వచ్చే సీనరేజి అదాయం రూ.50 లక్షలు కూడా దాటడం లేదు.
గతంలోకంటే ఎక్కువగానే
2010లో ఇసుక టెండర్లు జరిగాయి. ప్రస్తుతం ఇసు క, మొరం తవ్వకాలు తాత్కాలిక అనుమతులతో నడుస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువగానే ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ, కాంట్రాక్టర్లు లెక్కలలో మాత్రం తక్కువగానే చూపించి సీనరేజి చార్జీలను ఎగ్గొడుతున్నారు. తద్వారా జడ్‌పీ ఆదాయానికి గండి పడుతోంది. అధికారుల సహాయంతోనే, అనుమతులకు మించి తవ్వకాలు జరిపి లెక్కలకు రాని లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సరిహద్దులు దాటించడంతో జడ్‌పీ అదాయానికి గండి పడుతోందని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ విషయం అధికారులు చూపుతున్న లెక్కలతోనే అర్థమవుతోంది. 2010-11లో టెండర్లు నిర్వహించగా బీర్కూ రు, బరంగెడ్గి క్వారీల ద్వారా రూ.3,85,55,605, బా ల్కొండ, వెల్గటూర్ క్వారీ ద్వారా రూ.1,17,28,394 మొత్తం కలిపి రూ. 5,02,83,999 ఆదాయం సమకూరింది. 2011-12లో బీ ర్కూరు క్వారీకి మాత్రమే టెండర్లు జరగడంతో కేవలం రూ.69 లక్షలు మాత్రమే వచ్చాయి. తరువాత టెండర్లు నిర్వహించకపోవడంతో 2014 ఆగస్టు వరకు ఎంఆర్‌ఓలే తాత్కాలిక అనుమతులు ఇచ్చి సీనరేజి చార్జీలు చెల్లించారు.
వీరు రెండు సంవత్సరాలకు కలిపి రూ. 49,89,000 మాత్రమే చెల్లించారంటే జడ్‌పీఆదాయానికి ఎంతగా విఘాతం కలిగిందో తెలుస్తోంది. భవనాల నిర్మాణాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నా, పెద్ద మొత్తం లో ఇసుక రవాణా అవుతున్నా, అధికారులు, దళారుల ప్రోత్సాహంతో కాంట్రాక్టర్లు గోల్‌మాల్ చేస్తున్నారు. పట్టా భూములను చూపి తవ్వకాలు జరప డం కూడా సీనరేజీ చార్జీలు సమకూరపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.
అభివృద్ధి పనులకు ఆటంకం
క్వారీల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపి రవాణా చేసే కాంట్రాక్టర్లు క్యూబిక్ మీటర్‌కు రూ.40 చెల్లించాలి. అంటే, ఒక టిప్పర్‌లో పట్టే ఆరు క్యూబిక్ మీటర్లకు రూ.240 వరకు సీనరేజి చార్జీలను చెల్లించాలి. ప్రస్తు తం టెండర్లు లేకపోవడం,తాత్కాలిక టెండర్ల ద్వారా తవ్వకాలు జరుగుతున్నా, సీనరేజి చార్జీలు ఎగ్గొట్టడంతో జడ్‌పీకి నిధులు సమకూరడం లేదు. గతంలో కోట్ల రూపాయల ఆదాయం సమకూరినందున జిల్లాలో అభివృద్ధి పనులు జరిగాయి.
ఎంపీటీసీలు, జడ్‌పీటీసీల అసంతృప్తి
ఇప్పుడు నిధులు లేక పనులు జరగడం లేదు. పాఠశాలలు, ప్రహరీలు, మురికి కాలువలు, పంచాయతీ భవనాలు, రోడ్లు, తదితర పనులు సీనరేజి నిధుల ద్వారా జరిగేవి. జనరల్ ఫండ్ లేకపోవడంతో ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెండర్లు నిర్వహించి పక్కాగా సీనరేజి చార్జీలు వసూ లు చేయాలని పట్టుబడుతున్నారు. గతంలో జడ్‌పీ చైర్మన్‌గా ఉన్న వెంకటరమణారెడ్డి, జడ్‌పీటీసీలు పట్టుబట్టి తీర్మానం చేశారు. ఇసుక క్వారీల నుంచి పక్కాగా సీనరేజి వసూలు చేయించి జడ్‌పీకి కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు.