15 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
విహారయాత్రలో విషాదం
శంషాబాద్: ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తాపడడంతో 15మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పటాన్‌చెరులోని సాయితేజ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థు లు శుక్రవారం విహారయాత్రకు వెళ్లారు. పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వేరే పాఠశా లలకు చెందిన మూడు బస్సులను తీసుకెళ్లారు. బస్సుల్లో విద్యార్థులతో పాటు పది మంది పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. విజ యవాడ రోడ్డులోని మౌంట్ ఒపేరా నుంచి వీరు తిరిగి వస్తూ పెద్దఅంబర్‌పేట్ వద్ద ఔటర్‌పైకి చేరుకున్నారు. పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ దా టగానే ఓ బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. బస్సులో సుమారు 32 మంది విద్యార్థులున్నారు. దాదాపు 15 మందికి గాయాల య్యాయి. విద్యార్థులు హీనా(15), ప్రత్యూష(15) పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో శంషాబాద్‌లోని ఓ ్రైపైవేట్ ఆస్పత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన సేఫ్‌గార్డును ఢీకొట్టడంతో టైర్ పంక్చర్ అయి బోల్తా పడినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. క్షతగాత్రుల వివరాలు వెల్లడించడానికి ఉపాధ్యాయులు నిరాకరించారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆగ్రహం
పెద్దగోల్కొండ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్కూలు బస్సు ప్రమాదంపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు అచ్యుతరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాద కేసు ను సుమోటోగా స్వీకరించినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా విహారయాత్రకు తీసుకెళ్లిన పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి, జిల్లా ఎస్పీ, కలెక్టరుకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
స్కూలు బస్సు బోల్తా
Published Sat, Dec 27 2014 3:16 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM
Advertisement
Advertisement