
గాయాల పాలైన సంజయ్
నిజామాబాద్, పెర్కిట్(ఆర్మూర్): సరిగా రాయడం లేదని విద్యార్థిని చితకబాదాడో స్కూల్ యజమాని. అంతే కాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన సంజయ్ ఆర్మూర్ మండలం మామిడిపల్లి సెయింట్ పాల్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ట్యూషన్ సమయంలో ఆకలికి బదులు అకలి అని రాసినందుకు సంజయ్‌ను స్కూల్ యజమాని బబ్లూ చితకబాదాడు. కర్రతో ఇష్టమొచ్చినట్లు వీపుపై కొట్టడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బబ్లూ బెదిరించాడని విద్యార్థి తల్లి విజయ పేర్కొంది. స్కూల్ యజమానిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని బుధవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment