కేసీఆర్ కు వ్యతిరేకంగా చెన్నైలో జర్నలిస్టుల ధర్నా
కేసీఆర్ కు వ్యతిరేకంగా చెన్నైలో జర్నలిస్టుల ధర్నా
Published Mon, Sep 22 2014 5:00 PM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM
చెన్నై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా చెన్నైలో వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టుల మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ, తెలుగు, మలయాళ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ చెన్నై సభ్యులు చెన్నై ప్రెస్ క్లబ్ వద్ద ధర్నా చేపట్టారు.
ప్రతికా స్వేచ్పను కాలరాసే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని చెన్నై ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భారతీ తమిజాన్ అన్నారు. తెలంగాణలో ప్రైవేట్ ఛానెల్స్ ప్రసారాలపై ఆంక్షలు విధించడాన్ని భారతీ ఖండించారు. తమ ప్రాంతానికి, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కథనాలు వెల్లడించే మీడియాను పాతరేస్తామని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Advertisement