
సాక్షి, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం మిథిలాస్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అభిజిత్ లగ్నంలో స్వామివారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతకుముందు సీతారాముల వారికి తెలంగాణ ప్రభుత్వం, టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, పలువురు అధికారులు సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో ఆలయ పరిసరాలు శ్రీరామ నామ స్మరణతో మార్మోగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment