seetharama kalyanam
-
ఒంటిమిట్ట.. విశేషాల పుట్ట..
ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ, లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. – ఒంటిమిట్ట/కడప కల్చరల్ రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. కంపరాయుల పాలనలో ఆలయం రూపుదిద్దుకున్న తరువాత బుగ్గను రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ రామతీర్థంలో స్వామికి చక్రస్నానం చేయించుటకు స్థలం సరిపోకపోవడంతో కోదండ రామాలయం ఎదురుగానే నూతనంగా నిర్మించిన పుష్కరిణిలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి చక్రస్నానం జరుపుతారు. జాంబవంతుడి ప్రతిష్ట ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీ రామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ, సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు, యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు. విదేశీ మెచ్చుకోలు క్రీ.శ. 1652లో భారత యాత్ర చేసిన టావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు భారత దేశంలోని గొప్ప (పెద్దదైన) ఆలయ గోపురాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒకటి అని మెచ్చుకుని ప్రశంసించారు. ఇది అద్భుతమైన క్షేత్రమని ఆయన పేర్కొన్నారు. వెన్నెల్లో కల్యాణం శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ, భరత, శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి. చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం. రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట చెరువు జిల్లాలోని పెద్ద చెరువులలో ఒంటిమిట్ట చెరువుకు ప్రత్యేకత ఉంది. ఒంటిమిట్టకు వచ్చిన వారితోపాటు ఆ రోడ్డున వెళ్లే వారు ఈ చెరువును చూసే ఉంటారు. మెయిన్రోడ్డునుంచి కనుచూపుమేర విశాలంగా కొండల వరకు విస్తరించి ఉన్న ఆ చెరువుకు గొప్ప చరిత్ర ఉంది. కడప కైఫీయత్తుల సమాచారం మేరకు .. 1340లో కంపరాయులు విజయనగర సామ్రాజ్యంలో ఒక భాగమైన ఉదయగిరికి పాలకుడిగా ఉన్నారు. తన పరిధిలోని ప్రాంతమంతా స్వయంగా పర్యటిస్తూ అవసరమనిపించిన చోట దేవాలయాలు, చెరువులు నిర్మింపజేశారు. ఆయన నిర్మించిన చిట్వేలి చెరువు వద్దగల కంపసముద్రం అగ్రహారం, నెల్లూరు జిల్లాలోని కంపసముద్రం తదితర ప్రాంతాలు నేటికీ ఆయన పేరుతోనే ఉన్నాయి. తన పాలనలో ఆయన అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవలు అందించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి, ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు. గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద, చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు. కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది. పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు, లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు. కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కల్యాణ వేదికపై కల్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కల్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు. రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. 1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. తొలి బ్రహ్మోత్సవాలలో శిల్పులు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసింది. ఆయన వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాలను గమనించారు. రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. ► అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారా లు చెబుతున్నాయి. రామాభ్యుదయం కా వ్యం ఆయన కలం నుంచి జాలువారింది. ► బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. ► వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ► కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. ► వర కవి నల్లకాలువ అయ్యప్ప, ఉప్పు గొండూరు వెంకట కవి, మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం క్రీ.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సోదరుడు కంపరాయులు ఉదయగిరిని పాలిస్తూ ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఒంటడు, మిట్టడు అనే బోయ సోదరులు ఉండేవారు. వీరిద్దరు రాజులతో పాటు ఆయన వెంట వచ్చిన బృందానికి వసతి కల్పించారు. వారిద్దరు చెరువు, రామాలయం నిర్మించాలని కంప రాయులను అడిగారు. వారి కోరిక మేరకు వాటిని నిర్మించేందుకు ఆయన కృషి చేశారు. ఒంటడు, మిట్టడు కట్టిన ఆలయం కనుక ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండరామాలయం అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది. ► క్రీ.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం, ఎదుర్కోలు మండపాలు, ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. -
కరోనా ఆంక్షల నడుమ వైభవంగా రాములోరి కల్యాణం
భద్రాచలం: చూడచక్కగా అలంకరించుకున్న రామాలయ ప్రాంగణం. వైకుంఠాన్ని తలపించిన కల్యాణ మండపం. చల్లని రామయ్య వేద పండి తుల మంత్రోచ్ఛారణల నడుమ.. మంగళ వాయిద్యాల మోతల నడుమ చక్కని సీతమ్మను పరిణయమాడేందుకు పెళ్లి పీటలెక్కారు. సంప్రదా యబద్ధంగా నిర్వహించిన ఈ వివాహ వేడుక వైభవోపేతంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండు వగా జరిగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారి కల్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2 గంటలకే రామాలయ తలుపులు తెరిచారు. సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళా శాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూల వరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను పూలపల్లకీలో ఉంచి.. మంగళ వాయిద్యాల నడుమ సకల విధ రాజలాంఛనాలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొని వచ్చి సీతమ్మ వారిని, స్వామివారిని ఆసీనులను చేశారు. ముందుగా తిరువారాధన, విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఆ తర్వాత అందరి గోత్రనామాలు జపించి చేయ బోయే కల్యాణ తంతుకు ఎటువంటి విఘ్నాలు జరగకుండా మండప శుద్ధి చేశారు. కల్యాణానికి సంబంధించిన వస్తువులకు ఎటువంటి దోషాలు లేకుండా మంత్రజలంతో సంప్రోక్షణ జరిపించారు. దీని ద్వారా కల్యాణ సామగ్రి అంతా సీతా రాములకు వినియోగించేందుకు యోగ్యతమవు తాయని అర్చకులు వివరించారు. శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టి కన్యావరణను నిర్వహించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం చేశారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబం ధించి ప్రవరలను ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళణం, పుష్పోదక స్నానం నిర్వహించి వర పూజ చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలతో.. రామ భక్తుడైన భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాల గురించి వివరించి.. వాటిని స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివే దించి, సీతారామయ్య లకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పట్టించారు. అనంతరం కన్యాదానంతోపాటు గోదానం, భూదానం చేయించారు. స్వామికి ఎని మిది శ్లోకాలతో, అమ్మవారికి మరో ఎనిమిది శ్లోకా లతో మంగళాష్టకం చదివారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం సమీ పించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్ర హాల శిరస్సులపై ఉంచారు. రామదాసు చేయించిన మంగళసూత్రాలకు పూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగళ్యధారణ గావించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కనుల పం డువగా జరి గింది. తాత్కాలిక నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశా రు. మహదాశీర్వచనం నిర్వహించి హారతి పట్టారు. దీనితో స్వామివారి కల్యాణ తంతు పూర్తయింది. వీఐపీలు, వేదపండితుల సమక్షంలో.. కోవిడ్–19 కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్ది మంది వీఐపీలు, వేదపండితుల సమక్షంలోనే సీతారాముల కల్యాణం జరిపారు. గురువారం ఇదే నిత్యకల్యాణ వేదిక వద్ద స్వామివారి మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. కల్యాణ వేడుకలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దంపతులు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీయార్ వర్సెస్ ఏయన్నార్!
ఎన్టీయార్... ఏయన్నార్... ఇద్దరు అగ్ర హీరోలు. సినీ పరిశ్రమకు ఇద్దరూ రెండు కళ్ళు. పలకరింపులున్నా, కలసి పనిచేస్తున్నా – బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ మాత్రం వదలని ఇద్దరు ప్రత్యర్థి మిత్రులు! సంక్రాంతి లాంటి తెలుగు వారి పెద్ద పండుగకు ఆ టాప్ స్టార్ల ఇద్దరి సినిమాలూ ఒకదానిపై మరొకటి పోటీకొస్తే? పైగా, ఆ పోటీపడ్డ సినిమాలు కూడా ఆ హీరోలు స్వయంగా నిర్మించిన సొంత సినిమాలైతే? తెలుగు సినీచరిత్రలో 60 ఏళ్ళ క్రితం ఒకే ఒక్కసారి ఆ ‘క్లాష్ ఆఫ్ ది టైటాన్స్’ జరిగింది. ఆ కథేమిటంటే... నిజానికి, అగ్రహీరోలు ఎన్టీయార్, ఏయన్నార్ల ఇద్దరి సినిమాలూ ఒకే రిలీజ్ టైమ్‌లో పోటీపడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, సరిగ్గా అరవై ఏళ్ళ క్రితం 1961 నాటి ఆ సంక్రాంతి ప్రత్యేకత – ఆ అగ్రహీరోలు స్వయంగా నిర్మించిన వారి సొంత సినిమాలు ఒక దానితో మరొకటి ఢీ కొట్టడం! ఒకటి – ఎన్టీయార్ స్వయంగా నిర్మిస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం ‘సీతారామ కల్యాణం’. రెండోది – ఏయన్నార్ తన సొంత సంస్థ అన్నపూర్ణా పిక్చర్స్‌లో నటించిన సాంఘిక చిత్రం ‘వెలుగు నీడలు’. అలా వారిద్దరి సొంత సినిమాలూ పోటీపడ్డ సందర్భం అదొక్కటే. విచిత్రంగా పోటీపడ్డ రెండు సినిమాలూ సూపర్ హిట్టే! రెండూ ఆణిముత్యాలే!! దేని ప్రత్యేకత దానిదే! మాతాపిత పాదపూజ... మెగాఫోన్‌తో ఫస్ట్ టైమ్... ‘సీతారామ కల్యాణం’తో ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తారు. నిజానికి, ఎన్టీఆర్‌ను రాముడిగా, ఎస్వీఆర్ను రావణుడిగా పెట్టి ఈ సినిమా తీయాలనీ, ఎన్టీఆర్‌కు గురుతుల్యుడైన కె.వి. రెడ్డి దర్శకత్వం చేయాలనీ మొదటి ప్లాన్. ఈ చిత్రకథ కోసం ఎన్టీఆర్ బంధువు, స్నేహితుడైన ధనేకుల బుచ్చి వెంకట కృష్ణ చౌదరి ‘వాల్మీకి రామాయణం’లో లేని అనేక జనశ్రుతి కథలనూ, పురాణ గాథలనూ సేకరించారు. గమ్మత్తైన ఆ అంశాల ఆధారంగా రావణబ్రహ్మ గురించి మరింత తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ పాత్ర తానే వేయాలని ముచ్చటపడ్డారు. అయితే, వెండితెర శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, శ్రీనివాసుడిగా ఎన్టీఆర్‌ను మెచ్చిన జనం, ప్రతినాయకుడైన రావణ బ్రహ్మ పాత్రలో ఆయనను చూడలేరని కె.వి. రెడ్డి వాదన. సినీ జీవిత దర్శక గురువు కె.వి. రెడ్డి పక్కకు తప్పుకున్నా, ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. దర్శకుడిగా ఎవరి పేరూ వేయకుండా, తానే తొలిసారిగా ఆ సినిమా డైరెక్ట్ చేసి, జనాన్ని మెప్పించారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నా రు. తల్లితండ్రులకు పాదపూజ చేసి, వారి పాదపద్మాలకు ఎన్టీఆర్ తన ఆ తొలి దర్శకత్వ ప్రయోగాన్ని సమర్పించారు. ‘సీతారామ కల్యాణం’ టైటిల్స్ చివర సినిమాలో ఆ పాదపూజ దృశ్యం కనిపిస్తుంది. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో తల్లితండ్రులకు పాదపూజ కనిపించేది ఆ ఒక్క చిత్రంలోనే! సావిత్రి ఆధిక్యానికి శుభారంభం! ‘వెలుగు నీడలు’కు అక్కినేని ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావే దర్శకుడు. అప్పట్లో ఆదుర్తి వద్ద అసోసియేట్ డైరెక్టరైన కె. విశ్వనాథ్ ఈ చిత్ర రూపకల్పన, చిత్రీకరణల్లో కీలకభాగస్వామి. ‘వెలుగు నీడలు’కు ముందు దశాబ్దమంతా అక్కినేని – సావిత్రి వెండితెరపై హిట్ పెయిర్‌గా వెలిగారు. కానీ, ‘వెలుగు నీడలు’ నుంచి సావిత్రికి ఆధిక్యమిచ్చే కథలు, కథనాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి సావిత్రి పోషించే పాత్ర చుట్టూ సినిమాలు తిరగడం, కథలో అక్కినేనికి జోడీగా సైడ్ హీరోయిన్ ఉండడం కామన్ అయ్యింది. తరువాత ఓ దశాబ్ద కాలం పాటు ‘మంచి మనసులు’, ‘మూగ మనసులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ – ఇలా అనేక సినిమాలు ఆ పద్ధతిలో వచ్చాయి. ఆ రకంగా తెలుగు తెరపై సావిత్రి ఆధిక్యాన్ని ప్రజానీకానికి ప్రదర్శించిన తొలి చిత్రం ‘వెలుగు నీడలు’. ఆ పాటలు... ఆల్ టైమ్ హిట్స్! ‘సీతారామ కల్యాణం’, ‘వెలుగు నీడలు’ – రెండూ మ్యూజికల్ హిట్లే. ‘సీతారామ కల్యాణం’లో సముద్రాల సీనియర్ రాయగా, గాలి పెంచల నరసింహారావు స్వరపరచిన ‘శ్రీసీతారాముల కల్యాణము చూతము రారండి..’ పాట ఆల్ టైమ్ హిట్. ఎన్టీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ కల్యాణ గీతం ఇవాళ్టికీ శ్రీరామనవమి పందిళ్ళలోనూ, గుళ్ళలోనూ, పెళ్ళిళ్ళలోనూ మారుమోగుతూ, తెలుగువారి జనజీవితాల్లో భాగంగా నిలిచింది. అలాగే, దేశ స్వాతంత్య్ర దినోత్సవం కానీ, గణతంత్ర దినోత్సవం కానీ వచ్చాయంటే – పెండ్యాల స్వరసారథ్యంలోని ‘వెలుగు నీడలు’లో శ్రీశ్రీ రాసిన దేశభక్తి గీతం ‘పాడవోయి భారతీయుడా...’ ఇప్పటికీ ఊరూవాడా వినపడుతుంది. అలాగే శ్రీశ్రీ రచించిన ఆలోచనాభరిత గీతం ‘కల కానిది..’ కూడా! ఆ మాటకొస్తే ఈ రెండు చిత్రాల్లో ‘వెలుగు నీడలు’ పెద్ద మ్యూజికల్ హిట్. అందులో శ్రీశ్రీయే రాసిన ‘ఓ రంగయో పూలరంగయో..’, ‘హాయి హాయిగా జాబిల్లి..’, కొసరాజు రాసిన ‘సరిగంచు చీరెగట్టి..’, కాలేజీ గీతం ‘భలే భలే మంచిరోజులులే..’ లాంటి పాటలన్నీ ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి. విప్లవాత్మక పాయింట్... సంప్రదాయ ట్రీట్మెంట్... వెలుగు నీడల వింత కలయిక జీవితం. ప్రతి ఒక్కరికీ సుఖదుఃఖాలు సహజమనీ, వాటిని ధైర్యంగా స్వీకరించాలనీ చెప్పే ‘వెలుగు నీడలు’ చిత్రానికి దుక్కిపాటి, ఆదుర్తి, కె. విశ్వనాథ్ కలసి కథ అల్లారు. దీనికి ఆత్రేయ రాసిన మాటలు హైలైట్. ‘‘కన్నీరు మానవుల్ని బతికించగలిగితే అది అమృతం కంటే కరువయ్యేది’’ లాంటి ఆత్రేయ మార్కు డైలాగులు ‘వెలుగు నీడలు’లో మనసును పట్టేస్తాయి. నిజానికి, ఆ చిత్రంలో దర్శక, రచయితలు తీసుకున్న విధవా పునర్వివాహం అనే పాయింట్ అరవై ఏళ్ళ క్రితం విప్లవాత్మకమైనది. కాలానికి నిలబడిపోయిన కల కానిది.. పాటలో వినిపించే ఆశావాదం ఆ పాయింట్‌నే కథానుగుణంగా, అంతర్లీనంగాప్రస్తావిస్తుంది. హీరో పాత్ర పెళ్ళికి ముందుకొచ్చినా, సావిత్రి నిరాకరిస్తుంది. భర్త (జగ్గయ్య)ను పోగొట్టుకున్న సావిత్రికి అక్కినేనితో పునర్వివాహం చేస్తే, అది ఆ కాలానికి ఓ రివల్యూషనరీ సినిమా అయ్యుండేది. కానీ, ఆనాటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకొని, సంప్రదాయ ధోరణిలోనే సినిమా కథను దర్శక,రచయితలు ముగించడం గమనార్హం. నైజామ్‌లో ఆలస్యంగా... ఎన్టీఆర్, ఏయన్నార్ల హవా నడుస్తున్న రోజులవి. డిస్టిబ్య్రూటర్లు – ఎగ్జిబిటర్లు విస్తరించిన దశ అది. ఆ సమయంలో సైతం ఈ రెండు చిత్రాలూ గమ్మత్తు గా ఒక్కో ఏరియాలో ఒక్కోసారి రిలీజయ్యా యి. మొదట ఆంధ్ర ప్రాంతంలో జనం ముందుకొచ్చిన ఈ చిత్రాలు, ఆ తరువాత వారం రోజులు ఆలస్యంగా నైజామ్ (తెలంగాణ) ఏరియాలో రిలీజయ్యాయి. ‘సీతారామ కల్యాణం’ ఆంధ్రాలో జనవరి 6న వస్తే, తెలంగాణలో జనవరి 14న రిలీజైంది. ఇక, ‘వెలుగు నీడలు’ ఆంధ్రాలో జనవరి 7న విడుదలైతే, తెలంగాణలో జనవరి 12న థియేటర్లలో పలకరించింది. ఆ రోజుల్లో ఎన్టీయార్ ‘సీతారామ కల్యాణం’ 28 ప్రింట్లతో రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. ఆ పైన 9 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ శ్రీలక్ష్మీ టాకీస్‌లో 156 రోజులు ఆడింది. జాతీయ అవార్డుల్లో రాష్ట్రపతి యోగ్యతా పత్రం (మెరిట్ సర్టిఫికెట్) అందుకున్న పౌరాణిక చిత్రంగా నిలిచింది. మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ బ్యాలెట్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికై, ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఇక, అక్కినేని ‘వెలుగు నీడలు’ కేవలం 20 ప్రింట్లతో రిలీజైంది. దిగ్విజయంగా 12 కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1961 ఏప్రిల్ 16న విజయవాడ అలంకార్ థియేటర్లో, ఆ మరునాడు రాజమండ్రిలో ‘వెలుగు నీడలు’ యూని ట్ సభ్యుల మధ్య శతదినోత్సవాలు జరిపారు. అప్పట్లో ఈ సినిమాలు రెండింటికీ ప్రత్యేకించి వెండితెర నవలలు రావడం విశేషం. ‘సీతారామ కల్యాణం’ చిత్రరచయిత సముద్రాల సీనియర్ కుమారుడైన సముద్రాల జూనియర్ ఆ సినిమాకు వెండితెర నవల రాశారు. ఇక, ‘వెలుగు నీడలు’ వెండితెర నవలకు ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ అక్షరరూపం ఇచ్చారు. సంక్రాంతికి అగ్రహీరోలిద్దరి పోటాపోటీలో వచ్చిన ఈ రెండు ఆణిముత్యాలు ఇవాళ్టికీ తెలుగు సినీ ప్రియులకు మరపురానివి! చరిత్ర మరువలేనివి!! – రెంటాల జయదేవ తెరపైకి ఫస్ట్ టైమ్... నాగార్జున నేటి ప్రముఖ హీరో నాగార్జున పది నెలల పసివా డుగా ఉన్నప్పుడే వెండితెరపై తొలిసారిగా ప్రత్యక్షమైన చిత్రం – ‘వెలుగు నీడలు’. ఆ సినిమాలోని ‘చల్లని వెన్నెల సోనలు..’ పాటలో అక్కినేని, సావిత్రి చేతుల్లో నెలల పిల్లాడైన నాగార్జున కనిపిస్తారు. నిజానికి, ఆ సినిమాలో ఆ పాట చిత్రీకర ణలో వేరే పిల్లాడు పాల్గొనాల్సింది. తీరా ఆ రోజు షూటింగ్ టైమ్‌కు ఆ పిల్లాడిని ప్రొడక్షన్ వాళ్ళు తీసుకురాలేదు. ఆలస్యమైపోతోంది. అదే సమయంలో అక్కినేని భార్య అన్నపూర్ణ, పసివాడైన నాగా ర్జునను తీసుకొని, షూటింగ్ స్పాట్‌కు ఊరకనే వచ్చారు. ఆమె చంకలోని పిల్లాణ్ణి చూసి, నిర్మాత దుక్కిపాటి వగైరా ఆ పాట సీనును నాగార్జునను పెట్టి, చిత్రీకరించేశారు. అలా యాదృచ్ఛికంగా నెలల వయసులోనే నాగార్జున ఫస్ట్ టైమ్ కెమెరాముందుకు వచ్చేశారు. కెమేరా మాంత్రికుడి తొలి ట్రిక్ ‘సీతారామ కల్యాణం’ ద్వారా కూడా ఓ ప్రముఖ సాంకేతిక నిపుణుడు పరిచయమయ్యాడు. ఆ సాంకేతిక మాంత్రికుడు– తాంత్రిక ఛాయాగ్రహణంలో దేశంలోనే దిట్టగా తరువాతి కాలంలో పేరు తెచ్చుకున్న రవికాంత్ నగాయిచ్. ఎన్టీఆర్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ ఎం.ఎ. రెహమాన్ రేసుల పిచ్చిలో పడి, ‘సీతారామ కల్యాణం’ ముహూర్తం టైముకు రాలేదు. అప్పటికే చాలాకాలంగా ఒక్క అవకాశం ఇవ్వాల్సిందంటూ ఎన్టీఆర్ చుట్టూ నగాయిచ్ తిరుగుతున్నారు. ఆ రోజు గేటు దగ్గర కనిపించిన రవికాంత్ నగాయిచ్ను కారులోఎక్కించుకొని తీసుకెళ్ళి, ముహూర్తం షాట్ చేసేశారు ఎన్టీఆర్. అలా మొదలైన వారిద్దరి బంధం ‘గులేబకావళి కథ’, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘ఉమ్మడి కుటుంబం’, ‘వరకట్నం’ లాంటి అనేక సినిమాల వరకు అప్రతిహతంగా కొనసాగింది. ‘లవకుశ’, ‘వీరాభిమన్యు’, ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతాకల్యాణం’ లాంటి ప్రసిద్ధ పౌరాణిక చిత్రాలకూ నగాయిచే ట్రిక్ వర్క్ చేశారు. ఆ తరువాత నగాయిచ్ పలు హిందీ చిత్రాలకు దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. నాటకీయ స్వగతానికి నాంది! ‘సీతారామ కల్యాణా’నికి మాటలు, పాటలు రాసిన సముద్రాల సీనియర్ తన రచనతో తెరపై ఓ కొత్త ధోరణికి నాంది పలికారు. కథలోని కీలకమైన పాత్ర రంగస్థలం మీది ఏకపాత్రాభినయం ధోరణిలో ధీరగంభీర స్వరంతో తన స్వగతాన్ని తానే పైకి ఆవిష్కరించుకుంటూ, డైలాగులు పలికే ప్రక్రియను సినిమాల్లోకి జొప్పించారు. ‘సీతారామ కల్యాణం’లోని రావణ పాత్రలో ఎన్టీఆర్ ఆ స్వగతాభినయం చేశారు. అలా మొదలైన ఆ ధోరణి ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘సంపూర్ణ రామాయణం’ (ఎస్వీఆర్), ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీరశూర కర్ణ’ (ఎన్టీఆర్) మీదుగా సాంఘిక చిత్రాల వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ సినిమాల్లో ఆ నాటకీయ ఉపన్యాస ఫక్కీని అనుసరిస్తుండడం విశేషం. -
అక్కడ కూడా బోయపాటి స్టైల్లోనే తీశారా..?
సాండల్‌వుడ్‌లో ‘సీతారామ కళ్యాణం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీ ఎవరిది అనుకుంటున్నారా.. జాగ్వార్‌తో టాలీవుడ్‌ను పలకరించిన నిఖిల్ తన తదుపరి చిత్రం (సీతారామ కళ్యాణం) తో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేయగా.. సేమ్ టు సేమ్ సరైనోడు సినిమాను దించేశారన్న కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్లో పలు తెలుగు సినిమా చాయలు కనిపిస్తుండగా.. మితిమీరిన యాక్షన్ సన్నివేశాలతో హీరో విలన్లను చితక్కొట్టేస్తున్నాడు. కె.జి.యఫ్తో కన్నడ పరిశ్రమ స్థాయి పెరగ్గా.. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రవి శంకర్, శరత్ కుమార్‌లు కీలకపాత్రల్లో నటించగా.. రచితా రామ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా.. హర్ష దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
సాక్షి, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక కోసం మిథిలాస్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అభిజిత్ లగ్నంలో స్వామివారు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. స్వామి కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులతో మిథిలా స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతకుముందు సీతారాముల వారికి తెలంగాణ ప్రభుత్వం, టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, పలువురు అధికారులు సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో ఆలయ పరిసరాలు శ్రీరామ నామ స్మరణతో మార్మోగుతున్నాయి. -
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి వైభవంగా ఏర్పాట్లు
-
రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం మనవడు
ఖమ్మం: సీతారాముల కళ్యాణం బుధవారం ఉదయం భద్రాద్రిలో కన్నులపండువగా జరిగింది. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా రాములోరికి పట్టువస్త్రాలను సమర్పించారు. అయితే సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. దీంతో కుటుంబం తరపున ఆయన మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారికంగా పాల్గొన్నారు. కేసీఆర్ సతీమణి శోభ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు కల్యాణమహోత్సవంలో పాల్గొన్నారు. -
ఆదర్శదాంపత్యానికి అసలైన అర్థంగా...
తెలుగునాట సీతారామ కల్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, చైత్రశుక్ల పాడ్యమి ఉగాది నుంచి నవమి వరకు అంటే సీతారామకల్యాణం వరకు తెలుగు వారు పెళ్లిళ్లు చేసుకోరు. భద్రాచలంలోనూ, ఇతర దేవస్థానాల్లోనూ సీతారామ కల్యాణం అయిన తర్వాత ఆ కల్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించి, శిరస్సున ధరించి నవమి తర్వాత ముహూర్తాలు పెట్టుకొని పెళ్లిళ్లు చేసుకుంటారు. భారతీయ సంస్కృతిలో వయస్సులో పెద్దవారైన జంటను చూస్తే ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల తోనూ, యౌవనంలో ఉన్న జంటను సీతారాములతోనూ పోల్చడం పరిపాటి. ఎందుకంటే పురుషోత్తముడు అంటే రాముడే. ఆదర్శ నారీమణి అంటే సీతయే. భిన్న దృక్పథాలు కలిగిన ఇద్దరిని ఒక్కటి చేసి బంధాలను దృఢం చేసే సంస్కారానికే వివాహమని పేరు. ఈ జగత్తుకు కల్యాణ సంస్కృతిని నేర్పిన జంట సీతారాముల జంట. ఆదర్శవంతమైన జంట. ఎన్నో వేల ఏళ్ల క్రితం జరిగిన కల్యాణాన్ని ఈనాటికీ మనం శ్రీరామ నవమినాడు ఆచరిస్తున్నాం అంటే వారి కల్యాణానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మాధవుడు మానవుడుగా అవతరించాడు. అతీత మానవుడుగా కాదు. సామాన్య మానవుడుగా పంచభూతాల సమ్మేళనంతో రూపొందే శరీరంతో జన్మించాడు. అది పార్థివ దేహం. భూసంబంధమైన లక్షణాలన్నీ ఆ దేహానికీ ఉంటాయి. ఆకలిదప్పులూ, ఆనందాలూ, ఆవేదనలూ, కష్టాలూ, కన్నీళ్లూ, సుఖాలూ ఆనందభాష్పాలూ అన్నీ ఉంటాయి. ఈ ద్వంద్వాలన్నింటినీ అనుభవించాల్సిందే! శ్రీరాముడు అనే మానవుడుగా జన్మించిన భగవంతుడు అన్నింటినీ అనుభవించాడు. మానవుడుగానే మరణించాడు. సహజ మానవుడుగా, స్వచ్ఛ మానవుడుగా, సార్థక మానవుడుగా జీవించాడు. మానవ సహజంగానే తనువు చాలించాడు. అయితే, మానవుడుగా పుట్టి, మానవుడుగా గిట్టిన శ్రీరాముడు ఇలమీద వేలుపు అయ్యాడు; ఇలవేలుపు అయ్యాడు! ఎందుకు? మానవుడుగా ఆయన గడిపింది ఆదర్శ జీవనం. ధర్మాధర్మ జీవనం. ధర్మం అనేది ఒక మహాశక్తి. విశాల విశ్వసృష్టి విన్యాసం ధర్మం మీదనే ఆధారపడి ఉందంటున్నాయి భారతీయ ధార్మిక దార్శనిక గ్రంథాలు ‘ధర్మం’ అంటే ఏమిటో మహాభారతం బహు చక్కగా చెప్పింది. ‘ఇతరులు ఏమి చేస్తే నీకు అప్రియాన్ని (కష్టాన్ని) కలిగిస్తుందో, దానిని ఇతరులకు నువ్వు చేయకుండా ఉండటమే ధర్మం’ అంటూ అరటిపండు ఒలిచినట్టు చెబుతుంది భారతం. సమస్త సృష్టికీ మూలాధారమైన ఆ ధర్మాన్ని - మనిషిగా పుట్టిన ప్రతివాడూ ఆచరిస్తూ జీవయాత్ర గడిపినందుకు శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన ఆలోచనా, అభివ్యక్తీకరణా, ఆచరణా ఒక్కటే! మనసు ఒకటీ, మాట ఒకటీ, చేత ఒకటీ కాదు. మానవ జీవితంలో ఆచరించాల్సిన ధర్మసంబంధమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులను గౌరవించడం, తోడబుట్టినవాళ్లను ప్రేమించడం. తోటిమానవులను ఆదరించడం. నిస్సహాయులను ఆదుకోవడం. ఏకపత్నీవ్రతం పాటించడం. ముఖ్యంగా సర్వకాల సర్వ అవస్థలలోనూ సత్యాన్నే పలకడం. ‘సత్యం వద, ధర్మంచర’ అన్నాయి మన శాస్త్రాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీరాముడు కేవలం సత్యాన్నే పలికాడు. కేవలం ధర్మాన్నే ఆచరించాడు. ఆయన మాట మహాసత్యం. మనుగడ మహాధర్మం. శ్రీమహావిష్ణువు ధర్మాన్ని ఉద్ధరించడానికి మాత్రమే కాదు, ఆచరించి చూపిస్తూ ధర్మాన్ని మానవజాతికి బోధించడానికి శ్రీరాముడుగా జన్మించాడు. ధర్మప్రవర్తననూ, సత్యవచన శిల్పాన్నీ మనిషికి నేర్పించడానికి జన్మించాడు. మనిషి మనీషిగా, పురుషుడు ఉత్తమపురుషుడుగా జీవించి తరించే విధానాన్ని విశదీకరించడానికి జన్మించాడు. ఆచరించి చూపిస్తూ ఆదర్శ పురుషుడుగా వెలుగొందాడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు రామకథను మనకు బహూకరించిన వాల్మీకి మహాకవి. రూపం దాల్చిన ధర్మమే రాముడు అంటాడాయన. బాల్యంలో ధర్మం తప్పని బాలుడు ఆయన. యవ్వనంలో ధర్మం తప్పని యువకుడు. ధర్మం తప్పని వీరుడు. మానవాళికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముడు అన్నిటా ఆదర్శప్రాయుడే. ఆయన ఆదర్శపుత్రుడు. ఆదర్శ సోదరుడు. ఆదర్శ యువరాజు. ఆదర్శ వనవాసి. ఆదర్శ వీరుడు. ఆదర్శ భర్త. ఆదర్శ పాలకుడు. సత్యధర్మాలు ప్రాతిపదికగా, ప్రజాశ్రేయస్సే పరమావధిగా సాగిన ఆయన పరిపాలన ఆదర్శపాలన అయింది. ఆయన రాజ్యం ‘రామరాజ్యం’ అయింది. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు అన్నది జగమెరిగిన సత్యం. తండ్రి మాట ఆయనకు వేదం. తండ్రి ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞతో సమానం. ప్రజారంజకమైన పరిపాలనలో కూడా ఆయనకు తండ్రి ఆదర్శం. ప్రవర్తన అయినా, పరిపాలన అయినా శ్రీరామచంద్రుడు తన పితృపితామహులనూ, సూర్యవంశ మూలపురుషులను ఆదర్శంగా స్వీకరించాడు. అయితే ఒక విషయంలో ఆ మూలపురుషులలో కొందరిని కానీ, దైవంగా భావించి ఆరాధించే తండ్రిని కానీ ఆదర్శంగా తీసుకోలేదు. అదే వివాహ విషయం. తనది సూర్యవంశం. సూర్యుడి తండ్రి కశ్యపుడు. ఆయనకు భార్యలు పదముగ్గురు! సాక్షాత్తూ తన తండ్రికి ముగ్గురు భార్యలు. కానీ శ్రీరామచంద్రుడు ఏకపత్నిని స్వీకరించి, బహుభార్యత్వాన్ని తిరస్కరించాడు. తను క్షత్రియుడు. క్షత్రియులు బహుభార్యత్వానికి అర్హులు. రాములవారి దృష్టిలో అది ధర్మం కాదు. ఆదర్శం కాదు. స్త్రీ ఒక పురుషుడికి సర్వాత్మనా అంకితమైనట్టే పురుషుడు కూడా సర్వాత్మనా తన స్త్రీకి అంకితమైపోవాలన్న సామాజికమైన ధర్మాన్ని ఆచరణలో చూపించాడు ఆయన. తాను అవతరించిన మానవ జాతి ఆదర్శ దాంపత్య ధర్మాన్ని పాటించాలన్న ఉదాత్త ఆశయం ఆయనది. శ్రీరామపత్ని సీతమ్మ సతీ ధర్మం గురించి తెలియని వాళ్లుండరు. ‘భారత స్త్రీకి వివాహం అయ్యేదాకా భగవంతుడే భర్త. వివాహం అయ్యాక భర్తే భగవంతుడు’ అన్నారు ధర్మ కోవిదులు. రావణాసురుడికి గడ్డిపరక అడ్డుపెట్టి మాట్లాడి, పరపరుషుడిని తిరస్కరిస్తే, ఇటు ఆమె భర్త సౌందర్యానికి ప్రతిరూపంగా రూపం మార్చుకుని వచ్చిన శూర్పణఖను తిరస్కరించాడు. సీతాదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికి అగ్నిపరీక్ష పెట్టాడు రాముడు. రాముడికి తన పాతివ్రత్యం మీద ఉన్న అచంచల విశ్వాసాన్ని లోకానికి కళ్లకు కట్టడానికి అగ్నిప్రవేశం చేసిన మహా మహిళ సీతమ్మ. రాముడికి సీత ప్రాణం. సీతకు రాముడు ప్రాణం. ఒకరు సముద్రం. ఒకరు కెరటం. ఒకరు పుష్పం. ఒకరు సౌరభం. ఒకరు జ్యోతి. ఒకరు కాంతి. సీతారాములు ఒకరికొకరు ఆదర్శం. సీతారాముల దాంపత్యం మానవ దంపతులకు ఆదర్శం. పురుషుడు శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా, స్త్రీ సీతాసాధ్విని ఆదర్శంగా స్వీకరించడం శ్రేయోదాయకం. రామయ్య సీతమ్మను స్వయంవరంలో గెలిచి వివాహం చేసుకున్నాడు. అన్నంత మాత్రాన ప్రేమ వివాహమో మరే ఇతర పద్ధతో కాదు. విశ్వామిత్రుని ఆదేశం ప్రకారమే శివధనుర్భంగం చేశాడు. ఆ తర్వాత కూడా తండ్రి అయిన దశరథుని ఆజ్ఞ అయితే సీతమ్మను స్వీకరించాడు. అంటే రామయ్యది పెద్దలు కుదిర్చిన వివాహమే. అలాగని, సీతమ్మను బలవంతాన ఇష్టపడలేదు. ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభి వర్థత ॥ పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. ఇదీ ఆదర్శ దాంపత్యానికి ఉండాల్సిన లక్షణం. అందుకే యుగాలు గడిచినా సీతారాముల దాంపత్యం నేటికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. అంతకు ముందురోజున రామా! రేపే పట్టాభిషేకం, అందుకు తగిన నియమాలతో సిద్ధంగా ఉండమన్నారు పెద్దలు, కులగురువులు. ఆయన ఆ ఏర్పాట్లలో ఉండగానే పట్టాభిషేకం లేదు సరికదా... పద్నాలుగేళ్లపాటు అడవులకు వెళ్లాలని అన్నారు. రాముడు సరే అన్నాడు. సీతమ్మ కూడా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. భర్తను వెనక్కు లాగలేదు. రాముడు మాత్రం తండ్రి తనను ఒక్కడినే కదా అడవులకు వెళ్లమన్నది... క్రూరమృగాలు, విషసర్పాలు సంచరించే అడవులకు అతి సుకుమారి, సుందర కోమలాంగీ, ఎండ కన్నెరుగని రాజకుమారి అయిన సీత తనతోబాటు ఎందుకు కష్టాలు పడాలి... ఆమె అయోధ్యలోనే ఉండి, రాణివాస స్త్రీగా భోగాలనుభవించవచ్చు లేదా పుట్టింటిలో హాయిగా కాలక్షేపం చేయవచ్చు అనుకున్నాడు. అదే మాట ఆమెతో చెప్పాడు. కానీ సీత అందుకు అంగీకరించలేదు. భర్త సామీప్యం లేని సిరిసంపదలు తనకు అక్కరలేదంది. భర్తను వెన్నంటి ఉండటమే భాగ్యం అనుకుంది. సంసారాన్ని ఈదడానికి నేనొక్కడినే కష్టపడుతున్నాను, భార్య హాయిగా ఇంట్లో తిని కూర్చుంటోంది అని వాపోయే నేటికాలపు పురుషులు ఈ విషయంలో రాముడి నుంచి నేర్చుకోవాలి. అలాగే అత్తగారికి, తనకు లేదా మామగారికి తనకు మధ్య ఏవైనా గొడవలు వచ్చినప్పుడు భర్త తన తరఫున మాట్లాడకుండా వారిని వెనకేసుకుని వచ్చినందుకు మూతివిరిచే భార్యలకు సీతమ్మ వారు ఆదర్శం కాదా! అశోకవనంలో ఉన్న సీత మ్మతో హనుమంతుడు తన భుజంపై కూర్చోబెట్టుకుని రాముని వద్దకు చేరుస్తానంటాడు. అప్పుడు సీతమ్మ- హనుమా! నీవు ఉత్తముడివే. కానీ పురుషుణ్ణి తాకన నే నియమం కలదాన్ని. అదేకాదు, నీవు నన్ను తీసుకొని వెళ్లిపోతే, తన భార్యను వేరే వారెవరో ఎత్తుకుని వెళితే, మరొకరితో ఆమెను తన వద్దకు తెప్పించుకున్నాడు పిరికివాడైన రాముడు అని నా నాథుణ్ణి లోకులు ఎగతాళి చేయరా? అదీగాక నాలాగే ఈ దుష్టుడి చెరలో ఉన్న ఇతర స్త్రీలకు కూడా విముక్తి లభించాలి కదా! అందుకే నా రాముణ్ణే రానివ్వు... ఆయన శూరత్వాన్ని లోకానికి చాటనివ్వు- అంటుంది సీతమ్మ. అది చాలదా? సీతమ్మకు తన భర్త వీరత్వం మీద ఎంత నమ్మకమున్నదో తెలుసుకోవడానికి! - వక్కంతం సూర్యనారాయణ రావు