అక్కడ కూడా బోయపాటి స్టైల్లోనే తీశారా..? | Nikhil Kumar Seetharama Kalyanam Trailer Released | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 8:21 PM | Last Updated on Sat, Jan 19 2019 8:21 PM

Nikhil Kumar Seetharama Kalyanam Trailer Released - Sakshi

సాండల్‌వుడ్‌లో ‘సీతారామ కళ్యాణం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీ ఎవరిది అనుకుంటున్నారా.. జాగ్వార్‌తో టాలీవుడ్‌ను పలకరించిన నిఖిల్‌ తన తదుపరి చిత్రం (సీతారామ కళ్యాణం) తో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఆ మధ్య టీజర్‌ రిలీజ్‌ చేయగా.. సేమ్‌ టు సేమ్‌ సరైనోడు సినిమాను దించేశారన్న కామెంట్స్‌ వినిపించాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ ట్రైలర్‌లో పలు తెలుగు సినిమా చాయలు కనిపిస్తుండగా.. మితిమీరిన యాక్షన్‌ సన్నివేశాలతో హీరో విలన్లను చితక్కొట్టేస్తున్నాడు. కె.జి.యఫ్‌తో కన్నడ పరిశ్రమ స్థాయి పెరగ్గా.. అత్యంత భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తున్న ఈ మూవీ రిజల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి. రవి శంకర్‌, శరత్‌ కుమార్‌లు కీలకపాత్రల్లో నటించగా.. రచితా రామ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందించగా.. హర్ష దర్శకత్వం వహించారు. ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement