కరోనా ఆంక్షల నడుమ వైభవంగా రాములోరి కల్యాణం | Covid Seetha Rama Wedding In Bhadrachalam | Sakshi
Sakshi News home page

కరోనా ఆంక్షల నడుమ వైభవంగా రాములోరి కల్యాణం

Apr 22 2021 1:51 AM | Updated on Apr 22 2021 7:34 AM

Covid  Seetha Rama Wedding In Bhadrachalam - Sakshi

భద్రాచలం: చూడచక్కగా అలంకరించుకున్న రామాలయ ప్రాంగణం. వైకుంఠాన్ని తలపించిన కల్యాణ మండపం. చల్లని రామయ్య వేద పండి తుల మంత్రోచ్ఛారణల నడుమ.. మంగళ వాయిద్యాల మోతల నడుమ చక్కని సీతమ్మను పరిణయమాడేందుకు పెళ్లి పీటలెక్కారు. సంప్రదా యబద్ధంగా నిర్వహించిన ఈ వివాహ వేడుక వైభవోపేతంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం కనుల పండు వగా జరిగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారి కల్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

స్వామివారి కల్యాణం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున 2 గంటలకే రామాలయ తలుపులు తెరిచారు. సుప్రభాత సేవ అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళా శాసనం, అభిషేకం నిర్వహించారు. గర్భగుడిలో మూల వరులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను పూలపల్లకీలో ఉంచి.. మంగళ వాయిద్యాల నడుమ సకల విధ రాజలాంఛనాలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొని వచ్చి సీతమ్మ వారిని, స్వామివారిని ఆసీనులను చేశారు. ముందుగా తిరువారాధన, విశ్వక్సేన పూజ నిర్వహించారు. ఆ తర్వాత అందరి గోత్రనామాలు జపించి చేయ బోయే కల్యాణ తంతుకు ఎటువంటి విఘ్నాలు జరగకుండా మండప శుద్ధి చేశారు. కల్యాణానికి సంబంధించిన వస్తువులకు ఎటువంటి దోషాలు లేకుండా మంత్రజలంతో సంప్రోక్షణ జరిపించారు. దీని ద్వారా కల్యాణ సామగ్రి అంతా సీతా రాములకు వినియోగించేందుకు యోగ్యతమవు తాయని అర్చకులు వివరించారు. శ్రీ యముద్వాహ్యస్యే అన్న సంకల్పంతో స్వామివారికి ఎదురుగా సీతమ్మను కూర్చుండబెట్టి కన్యావరణను నిర్వహించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణం చేశారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబం ధించి ప్రవరలను ప్రవచించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళణం, పుష్పోదక స్నానం నిర్వహించి వర పూజ చేశారు.

రామదాసు చేయించిన ఆభరణాలతో..
రామ భక్తుడైన భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాల గురించి వివరించి.. వాటిని స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. మధుపర్కప్రాశన అనంతరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామికి నివే దించి, సీతారామయ్య లకు నూతన వస్త్రాలంకరణ చేశారు. లోకమంతా సుఖసంతోషాలతో ఉండాలని మహాసంకల్పం పట్టించారు. అనంతరం కన్యాదానంతోపాటు గోదానం, భూదానం చేయించారు. స్వామికి ఎని మిది శ్లోకాలతో, అమ్మవారికి మరో ఎనిమిది శ్లోకా లతో మంగళాష్టకం చదివారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్‌ లగ్నం సమీ పించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్ర హాల శిరస్సులపై ఉంచారు. రామదాసు చేయించిన మంగళసూత్రాలకు పూజ నిర్వహించి సీతమ్మ వారికి మాంగళ్యధారణ గావించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమం కనుల పం డువగా జరి గింది. తాత్కాలిక నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశా రు. మహదాశీర్వచనం నిర్వహించి హారతి పట్టారు. దీనితో స్వామివారి కల్యాణ తంతు పూర్తయింది.

వీఐపీలు, వేదపండితుల సమక్షంలో..
కోవిడ్‌–19 కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్ది మంది వీఐపీలు, వేదపండితుల సమక్షంలోనే సీతారాముల కల్యాణం జరిపారు. గురువారం ఇదే నిత్యకల్యాణ వేదిక వద్ద స్వామివారి మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. కల్యాణ వేడుకలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దంపతులు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఆలయ ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement