ఎంకన్నా... ఎంతపనైపాయే... | ses elections | Sakshi
Sakshi News home page

ఎంకన్నా... ఎంతపనైపాయే...

Published Sat, Feb 20 2016 2:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఎంకన్నా... ఎంతపనైపాయే... - Sakshi

ఎంకన్నా... ఎంతపనైపాయే...

ముస్తాబాద్ : ముస్తాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి సెస్‌లో పోటీ చేస్తారని.. సెస్‌కు బకాయి పడ్డ మొత్తాన్ని ఆయన అభిమానులు చెల్లించారంటూ చర్చలు సాగాయి. రెడ్డి సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఈసారి జరిగే సెస్ ఎన్నికల్లో విజయం ఆయనదేనంటూ అన్ని పక్షాల నాయకులు చర్చించుకున్నారు. సెస్‌లో ఆయన 1998లో సభ్యుడిగా ఉండగా.. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో ఆయన కోర్టుకు వెళ్లడం.. ఈ లోగా సెస్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, నామినేషన్ల స్వీకరణ కూడా పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. చివరి నిమిషం వరకు వెంకటేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేస్తారని భావించారు. ఓటు హక్కు లేక చివరకు ఆయన పోటీకి దూరం కాగా, ఆయన సోదరుడు బాల రాజేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బాలరాజేందర్‌రెడ్డి పోటీలో ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement