కష్టాలు ఎన్నోరోజులు ఉండవు
తాటికొండ(స్టేషన్‌ఘన్‌పూర్) : ‘కష్టాలు ఎన్నో రోజులు ఉండవు. త్వరలో మంచి రోజులు వస్తారుు’ అంటూ మండలంలోని తాటికొండకు చెందిన ఎడమ మల్లయ్య కుటుంబానికి షర్మిల ధైర్యం చెప్పారు. ‘అవ్వా ఆరోగ్యం బాగుందా.. పిల్లలెందరు.. బాగా చూసుకుంటున్నారా?’ అని మల్లయ్య భార్య పాపమ్మను ఆప్యాయంగా పలకరించారు. మల్లయ్య కుమారులతోనూ మాట్లాడారు. ‘మీరు మా ఇంటికొస్తారని కలలో కూడా అనుకోలేదు. దేవుడులాంటి రాజశేఖరరెడ్డి ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి కష్టం ఉండేది కాదు. పంటరుణాలు, విద్యుత్ సమస్య ఉండకపోయేది. ఆయన పోయూకే చాలా కష్టాలు పడుతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చెందొద్దని షర్మిల స్థైర్యం కల్పించారు.
అమ్మా, చెల్లిని బాగా చూసుకో..
పోచన్నపేట(బచ్చన్నపేట): ‘ఇంత చిన్న వయస్సులో నీకెంత కష్టం వచ్చింది. అమ్మా, చెల్లిని బాగా చూసుకో’ అంటూ మండలంలోని పోచన్నపేటకు చెందిన నేలపోగుల యూదగిరి కుమారుడు భాస్కర్‌కు షర్మిల సూచించారు. యూదగిరి కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. ‘బతికున్నప్పుడు అన్న ఏం చేసేటోడు.. ఇప్పుడెలా ఉన్నారమ్మా’ అంటూ షర్మిల అడిగారు. యూదగిరి భార్య యాదలక్ష్మి మాట్లాడుతూ, ‘నా భర్త పట్నంలో బార్బర్ దుకాణంల పనిచేసెటోడు. బిడ్డ, కొడుకు ఉన్నారు. ఆయన పోరుునంక నేను ప్రైవేటుకంపెనీల, కొడుకు బార్బర్ దుకాణంల పనిచేత్తాన్నం’ అని చెప్పింది.
వైఎస్‌ఆర్ కుటుంబం ప్రజల పక్షం
జనగామ/జనగామ టౌన్ : దేశంలో ఏ రాష్ర్టంలో జరగని అభివృద్ధిని చేసి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ కుటుంబం ప్రజల పక్షమని పార్టీ రాష్ర్ట ముఖ్య అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, గాదె ని రంజన్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి గూడూరు జయపాల్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షు డు మునిగాల కల్యాణ్‌రాజు అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో మంగళవారం వారు మాట్లాడారు. ప్రజలకు భరోసా కలిగించేందుకు ఆ కుటుంబం చేస్తున్న ఓదార్పు యాత్రలే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. మహానేత హయాంలో లబ్ధిపొందిన ఎందరో నేడు ఆ యన కూతురిని కలుసుకునేందుకు రావడం వారి అభిమానమన్నారు.
రెండో రోజూ అదే జోరు
- ఉత్సాహంగా పరామర్శలో పాల్గొన్న నేతలు
జనగామ : జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యూత్ర రెండు రోజు కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ పరామర్శ యాత్రను ముందుకు నడిపిస్తున్నారు. మంగళవారం జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు విలియం మునిగాల, సూర్యనారాయణరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు షర్మిలసంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జీ శివకుమార్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వి. శంకరాచారి, వరంగల్ జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం కల్యాణ్‌రాజ్, వరంగల్ జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఏ మహిపాల్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఏ కిషన్, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డి కిశోర్‌కుమార్, వరంగల్ జిల్లా పార్టీ నాయకులు నెమలిపురి రఘు, కంజుల రాజు, దయాకర్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జశ్వంత్‌రెడ్డి, టీఎన్ నరసింహరెడ్డి పాల్గొన్నారు.