Sharmila paramarsha yatra
-
రాజన్న రాజ్యం తెచ్చుకుందాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ప్రజల కష్టాలను తీర్చిన మహానేత వైఎస్సార్‌కు మరణం లేదు. ఆయన అందరి హృదయాల్లో కొలువై ఉన్నారు. వైఎస్ ఆశయాల సాధన కోసం జగనన్న నాయకత్వంలో మనమంతా రాజన్న రాజ్యం సాధించుకోవాలి..’’అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. నిజామాబాద్ జిల్లాలో రెండోరోజు పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం కామారెడ్డి నియోజక వర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ఆరు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. మొదట మాచారెడ్డి మండలం మొండివీరన్న తండాలో మెగావత్ మీఠ్య కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం అన్నారం గ్రామంలో మండ్ల నడిపి బాలమణి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడ్నుంచి అటవీప్రాంతం గుండా సోమారంపేట చేరుకొని అక్కడి తండాలో గుగులోత్ గజన్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత దోమకొండ మండలం బీబీపేటలో వడ్ల శ్రీనివాస్, భిక్కనూరు మండలం కాచాపూర్‌లో మర్రి చిన్నపోచయ్య, భిక్కనూరు రైల్వేస్టేషన్ గ్రామంలో అరిగె మమత కుటుంబ సభ్యులను కలసి ధైర్యం చెప్పారు. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. మారుమూల గ్రామాల మీదుగా సాగిన షర్మిల పరామర్శ యాత్రలో జనం అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలతో మాట్లాడుతూ.. వైఎస్ సేవలను గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చాయని, తెలుగు ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుంటారన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు వైఎస్సార్ పేరు మార్మోగుతుందని అన్నారు. రెండ్రోజుల్లో 242 కిలోమీటర్లు... నిజామాబాద్ జిల్లాలో షర్మిల మొదటి విడత పరామర్శ యాత్ర మంగళవారం ముగిసింది. రెండ్రోజుల్లో సుమారు 242 కి.మీ. ప్రయాణించిన షర్మిల.. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో 12 కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఇన్నారెడ్డి, రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు పి.ప్రపుల్లారెడ్డి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ముజతబు అహ్మద్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాసరావు, నాడెం శాంతికుమార్, జి.రాంభూపాల్‌రెడ్డి, ఎ.గోపాల్రావ్, అయిలూరి వెంకటేశ్వర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. -
మూడు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శ
హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తరపున ఆయన సోదరి షర్మిల ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా సోమవారం షర్మిల మూడు కుటుంబాలను పరామర్శించారు. తొలుత బజార్ హత్నూరులోని కాసుబక్కయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అక్కడి నుంచి నిర్మల్ మీదుగా దిలావర్ పూర్ చేరుకుని కామాటిబొల్ల ముత్యం కుటుంబాన్ని కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్వరం మండలం హవర్గాకు వెళ్లి పర్స భోజన్న కుటుంబాన్ని పరామర్శించారు. నేటితో ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర ముగుస్తుంది. అనంతరం నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్రను చేపడతారు. జిల్లాలోని బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. -
నేటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలో..
ఐదు నియోజకవర్గాల్లో పది కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల శనివారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో సాగనున్న ఈ పర్యటన సందర్భంగా పది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. బెల్లంపల్లి, సిర్పూర్(టి), ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల పరిధిలో షర్మిల పర్యటన ఉంటుంది. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పర్యటనకు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. షర్మిల కరీంనగర్ జిల్లా పర్యటన ముగించుకుని... శనివారం మధ్యాహ్నం మంచిర్యాల మీదుగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తారు. తొలుత కాసిపేట మండలం దేవాపూర్‌లో మహ్మద్ జకీర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత కాగజ్‌నగర్ మండలం చింతగూడలోని కొట్రంగి ఆనందరావు కుటుంబాన్ని కలుసుకుని రాత్రికి సోమగూడెంలో బసచేస్తారు. ఆదివారం ఉదయం వేమనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి వెళ్లి గండ్ర పెద్ద రామారావు కుటుంబాన్ని, తర్వాత జన్నారం మండలం పొన్కల్, కడెం మండలం లింగాపూర్, ఖానాపూర్ మండలం సత్తెనపల్లి, తాటిగూడ తండాల్లో పరామర్శ జరుగుతుంది. ఆదివారం ఖానాపూర్‌లో బస చేస్తారు. సోమవారం బజార్హత్నూర్, దిలావర్పూర్, లోకేశ్వరం మండలం హవర్గాలలో పరామర్శ యాత్ర నిర్వహిస్తారు. మొత్తంగా జిల్లాలో సుమారు 680 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. అనంతరం షర్మిల నిజామాబాద్ జిల్లాలో యాత్ర నిర్వహిస్తారు. -
కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
కష్టాలు ఎన్నోరోజులు ఉండవు
తాటికొండ(స్టేషన్‌ఘన్‌పూర్) : ‘కష్టాలు ఎన్నో రోజులు ఉండవు. త్వరలో మంచి రోజులు వస్తారుు’ అంటూ మండలంలోని తాటికొండకు చెందిన ఎడమ మల్లయ్య కుటుంబానికి షర్మిల ధైర్యం చెప్పారు. ‘అవ్వా ఆరోగ్యం బాగుందా.. పిల్లలెందరు.. బాగా చూసుకుంటున్నారా?’ అని మల్లయ్య భార్య పాపమ్మను ఆప్యాయంగా పలకరించారు. మల్లయ్య కుమారులతోనూ మాట్లాడారు. ‘మీరు మా ఇంటికొస్తారని కలలో కూడా అనుకోలేదు. దేవుడులాంటి రాజశేఖరరెడ్డి ఉన్నన్ని రోజులు మాకు ఎలాంటి కష్టం ఉండేది కాదు. పంటరుణాలు, విద్యుత్ సమస్య ఉండకపోయేది. ఆయన పోయూకే చాలా కష్టాలు పడుతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చెందొద్దని షర్మిల స్థైర్యం కల్పించారు. అమ్మా, చెల్లిని బాగా చూసుకో.. పోచన్నపేట(బచ్చన్నపేట): ‘ఇంత చిన్న వయస్సులో నీకెంత కష్టం వచ్చింది. అమ్మా, చెల్లిని బాగా చూసుకో’ అంటూ మండలంలోని పోచన్నపేటకు చెందిన నేలపోగుల యూదగిరి కుమారుడు భాస్కర్‌కు షర్మిల సూచించారు. యూదగిరి కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. ‘బతికున్నప్పుడు అన్న ఏం చేసేటోడు.. ఇప్పుడెలా ఉన్నారమ్మా’ అంటూ షర్మిల అడిగారు. యూదగిరి భార్య యాదలక్ష్మి మాట్లాడుతూ, ‘నా భర్త పట్నంలో బార్బర్ దుకాణంల పనిచేసెటోడు. బిడ్డ, కొడుకు ఉన్నారు. ఆయన పోరుునంక నేను ప్రైవేటుకంపెనీల, కొడుకు బార్బర్ దుకాణంల పనిచేత్తాన్నం’ అని చెప్పింది. వైఎస్ఆర్ కుటుంబం ప్రజల పక్షం జనగామ/జనగామ టౌన్ : దేశంలో ఏ రాష్ర్టంలో జరగని అభివృద్ధిని చేసి, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ కుటుంబం ప్రజల పక్షమని పార్టీ రాష్ర్ట ముఖ్య అధికార ప్రతి నిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, గాదె ని రంజన్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శి గూడూరు జయపాల్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షు డు మునిగాల కల్యాణ్‌రాజు అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో మంగళవారం వారు మాట్లాడారు. ప్రజలకు భరోసా కలిగించేందుకు ఆ కుటుంబం చేస్తున్న ఓదార్పు యాత్రలే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. మహానేత హయాంలో లబ్ధిపొందిన ఎందరో నేడు ఆ యన కూతురిని కలుసుకునేందుకు రావడం వారి అభిమానమన్నారు. రెండో రోజూ అదే జోరు - ఉత్సాహంగా పరామర్శలో పాల్గొన్న నేతలు జనగామ : జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యూత్ర రెండు రోజు కార్యక్రమంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ పరామర్శ యాత్రను ముందుకు నడిపిస్తున్నారు. మంగళవారం జరిగిన పరామర్శ యాత్రలో రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గ ట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు విలియం మునిగాల, సూర్యనారాయణరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు షర్మిలసంపత్, గూడూరు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జీ శివకుమార్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వి. శంకరాచారి, వరంగల్ జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం కల్యాణ్‌రాజ్, వరంగల్ జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఏ మహిపాల్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఏ కిషన్, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డి కిశోర్‌కుమార్, వరంగల్ జిల్లా పార్టీ నాయకులు నెమలిపురి రఘు, కంజుల రాజు, దయాకర్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జశ్వంత్‌రెడ్డి, టీఎన్ నరసింహరెడ్డి పాల్గొన్నారు. -
అండగా ఉంటాం..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహానేత వైఎస్సార్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించే ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ తనయ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల మంగళవారం బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో పర్యటించారు. ఏడు కుటుంబాలను ఓదార్చారు. ఏడు కుటుంబాల పరామర్శ ముగిసిన తర్వాత మల్కాపూర్‌కు సమీపంలోని జ్యోతినికేతన్ పాఠశాల ఆవరణలో బస చేశారు. రెండో రోజు 78 కిలో మీటర్ల దూరంలో షర్మిల యాత్ర సాగింది. షర్మిల తమ ఊరికి వస్తున్నారనే సమాచారంతో బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లోని గ్రామాల వారు ఆమెను కలిసేందుకు, చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూశారు. అన్ని ఊళ్లలోనూ గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి వచ్చి షర్మిలకు అభివాదం చేశారు. జనగామలో బస్సు నుంచి షర్మిల దారి పొడవునా అభివాదం చేస్తూ యాత్ర సాగించారు. ఈ సందర్భంలో షర్మిలను దగ్గరగా చూసేందుకు మహిళలు ఉత్సాహంగా కదిలారు. జనగామ చౌరస్తాలో షర్మిల తన దగ్గరికి వచ్చిన వారికి కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. జనగామలో వైఎస్సార్ సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో షర్మిల రాక సందర్భంగా సందడి నెలకొంది. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో షర్మిలకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. భారీగా వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అన్ని తెలుసుకుంటూ.. మహానేత వైఎస్సార్ అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. బచ్చన్నపేట మండల కేంద్రంలో గుడిసెల లచ్చవ్వ కూతురు బాలలక్ష్మి కుటుంబాన్ని మంగళవారం షర్మిల పరామర్శించారు. ఎలా చనిపోయారమ్మా అని షర్మిల అడగ్గా ‘పెద్దాయన ఇమానంలో పోతుంటే చనిపోయాడంటా బిడ్డా. పింఛను ఇచ్చిన దేవుడు లేడట. అంటూ ఫొటో చూసి ఏడ్చింది. కొద్ది సేపటికే గుండెనొప్పి వస్తుందంటూ చెప్పింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయింది’ అని లచ్చవ్వ కూతురు చెప్పింది. బాధపడకండి మా కుటుంబం మీకు అండగా ఉంటుంది అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. బచ్చన్నపేటలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అలువాల యాదగిరి కుటుంబానికి షర్మిల ధైర్యం చెప్పారు. యాదగిరి పెద్ద కూతురు కల్యాణి తండ్రిని గుర్తుకు చేసుకుంటూ విలపిస్తుంటే షర్మిల దగ్గరకు తీసుకుని అక్కున చేర్చుకుంది. యాదగిరి కొడుకు ప్రవీణ్ మెడిసిన్ చదవాలనుకుంటున్నట్లు చెప్పగానే ‘లక్ష్యం పెద్దదే, బాగా చదువు. అనుకున్నది సాధించు. మీకు ఏ కష్టం వచ్చినా. మా కుటుంబం మీకు అండగా ఉంటుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నింపారు. తర్వాత బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నేలపోగుల యాదగిరి ఇంటికి రాజన్న తనయ షర్మిల వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు. యాదగిరి చనిపోయిన తర్వాత అతని కుమారుడు భాస్కర్ తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసి సెలూన్లో పని చేస్తూ వచ్చిన డబ్బులతో తల్లిని పోషిస్తూ, చెల్లిని చదివిస్తున్నాడని తెలుసుకుని భాస్కర్ భుజం తట్టారు షర్మిల. ‘నీకు మంచి కొడుకు ఉన్నాడు. బాధపడకు. అమ్మాయిని మంచిగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మీకు ఏ ఆపద వచ్చినా రాజన్న కుటుంబం ఉందని మర్చిపోవద్దంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండకు చెందిన గాదె శంకర్ కుటుంబ బాగోగులను షర్మిల తెలుసుకున్నారు. 45 నిమిషాల పాటు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ‘పిల్లల కోసమైనా దిగులు మానుకుని ఆరోగ్యంగా ఉండాలని, మళ్లీ మంచిరోజులు వస్తాయని, ఏ కష్టం వచ్చినా తనకు ఫోన్ చేయాలంటూ’ షర్మిల ధైర్యం చెప్పారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ పట్టణానికి చెందిన వల్లాల లక్ష్మీ ఇంటికి చేరుకున్నారు. కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న మా మనవరాలు ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోంది’ అని లక్ష్మీ చెప్పింది. ఏ కష్టం వచ్చినా మీకు అండగా నిలబడేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడు ఉంటారని షర్మిల భరోసా ఇచ్చారు. అనంతరం తాటికొండలో ఎడమ మల్లయ్య ఇంటికి చేరుకున్న షర్మిల.. ‘ఆరోగ్యం బావుంటుందా, పిల్లలు బాగా చూసుకుంటున్నారా’ అని అడిగారు. మల్లయ్య భార్య పాపమ్మ పిల్లలు బాగానే చూసుకుంటున్నారని చెప్పింది. ‘మీరు, మా ఇంటికి వస్తారని కలలో కూడా అనుకోలేదంటూ’ మల్లయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. క్రిష్ణాజీగూడానికి చెందిన జక్కుల కొమురమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. షర్మిలను చూడగానే జక్కుల వీరయ్య ‘అమ్మా.. ఈ ముసలోడు ఎలా ఉన్నాడో చూసి రమ్మని మా ఇంటికి నిన్ను ఆ మహానేత పంపించాడా? పంపించాడా అంటూ’ బోరున విలపించాడు. ‘మీరు ఆందోళన చెందవద్దని, అన్ని విధాల ఆదుకుంటానని షర్మిల ధైర్యం చెప్పారు. బుధవారం ఏడు కుటుంబాలు పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య కుటుంబాన్ని మొదట పరామర్శిస్తారు. ఇదే మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ ఇంటికి వెళ్తారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో మద్దెల గట్టయ్య, దోమ లింగయ్య, బస్కుల సుధాకర్ కుటుంబాలను పరామర్శిస్తారు. తర్వాత వర్ధన్నపేట మండలం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. మూడో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో 82.5 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగుతుంది. -
గ్రేటర్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యం
కాజీపేట రూరల్ : వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణరుుంచింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి సమావేశమయ్యారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డితో మూడు గంటలపాటు చర్చించారు. పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఎంపీ, గ్రేటర్ ఎన్నికలలో ైవైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయూలని రాఘవరెడ్డి సూచించినట్లు జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ తెలిపారు. వచ్చే నెలలో షర్మిల పరామర్శ యాత్ర.. జిల్లాలో ఆగస్టులో షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి వె ల్లడించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ తెలిపారు. షర్మిల యాత్రను జిల్లాలో విజయవంతం చేసేందుకు ైవైఎస్సార్ సీపీ నాయకులు కృషి చేయాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీలోకి సంగాల ఇర్మియా, సాల్మన్‌రాజ్ హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఇర్మియా, సాల్మన్‌రాజ్ వైఎస్సార్ సీపీలో చేరినట్లు గ్రేటర్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సం యుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మం చె అశోక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ. ఖాదర్, ట్రేడ్ యూని యన్ జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్యగౌడ్, జిల్లా నాయకులు నెమలి పురి రఘు, షంషీర్ బేగ్, చల్ల అమరేందర్‌రెడ్డి, బద్రొద్దీన్ ఖాన్, బీంరెడ్డి రవితేజరెడ్డి, నాగవెల్లి రజనీకాం త్, రాజేష్, యాకూబ్, సుధాకర్, పిట్టల శ్రీను పాల్గొన్నారు. -
నేటినుంచి షర్మిల పరామర్శయాత్ర
-
నేటినుంచి షర్మిల పరామర్శయాత్ర
* రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులపాటు పర్యటన *15 కుటుంబాలకు పరామర్శ సాక్షి, రంగారెడ్డిజిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్ర ప్రారంభిస్తారు. నాలుగు రోజులపాటు జరిగే ఆమె పర్యటనలో భాగంగా తొలిరోజు 177 కిలోమీటర్ల మేర పరామర్శయాత్ర కొనసాగనుంది. రెండో రోజు 134 కిలోమీటర్లు, మూడోరోజు 153 కిలోమీటర్లు, నాలుగోరోజు 126 కిలోమీటర్ల చొప్పున మొత్తం 590 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం పరామర్శ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరామర్శయాత్రలో షర్మిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు. ఆత్మీయ స్వాగతం పలకండి: కొండా రాఘవరెడ్డి మొయినాబాద్ రూరల్: రాజన్న బిడ్డ షర్మిల కు ఆత్మీయ స్వాగతం పలకాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్యటనలో భాగంగా 15 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని తెలి పారు. మొదటి రోజు జిల్లెలగూడకు చెందిన అంజయ్య కుటుంబాన్ని పరామర్శించి అ క్కడి నుంచి మహేశ్వరం మండలం మంఖాల్‌లోని ఎంగల జోసెఫ్ కుటుం బాన్ని, అనంతరం ఇబ్రహీంపట్నం మండ లం దండుమైలారంలో పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారని వివరించారు. 30న కండ్లకోయలోని సముద్రాల సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని, మేడ్చల్‌లోని కొల్తూరి ముత్యాలు కుటుంబా న్ని, శామీర్‌పేట మండలం కేసారం చేరుకొని చెన్నూరి వెంకటేశ్ కుటుంబాన్ని, మూడుచింతలపల్లిలో జామ కిష్టయ్య కుటుం బాన్ని, లక్ష్మాపూర్‌లో నూతనకం టి మహేశ్ కుటుం బాన్ని పరామర్శిస్తారని తెలిపారు. జూలై 1న మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఈడిగ సుగుణ కుటుంబాన్ని పరామర్శిస్తారని, అమ్డాపూర్ చౌరస్తాలోని, చేవెళ్ల చౌరస్తాలోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేస్తారన్నారు. పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌లో కృష్ణారెడ్డి, పరి గిలో శ్రీనివాస్, ఆవుసల లక్ష్మణయ్యచారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారన్నారు. 2వ తేదీన తాండూరు నుంచి బయలు దేరి మర్పల్లిలో కమ్మరి నారాయణ కుటుం బా న్ని, మోమిన్‌పేటలో అరిగె యాదయ్య, ఎన్కెతలలో ఆలంపల్లి వెంకటేశం కుటుంబీకులను కలుసుకుంటారని వివరించారు. -
షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేయండి
శుక్రవారం లోటస్ పాండ్ లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న పొంగులేటి. చిత్రంలో నల్లా సూర్యప్రకాశ్, శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి గాదె నిరంజన్ రెడ్డి తదితరులు * రంగారెడ్డి జిల్లాలో 29న జిల్లెలగూడ మంద మల్లమ్మచౌరస్తా నుంచి యాత్ర ప్రారంభం * వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి * ప్రతి కార్యకర్తా నాలుగు రోజులూ షర్మిల వెంట నడవాలి * పరామర్శయాత్ర నియోజవర్గ ఇన్చార్జిలతో భేటీ సాక్షి, హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్న పరామర్శ యాత్రను జయపద్రం చేయాలని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తతోపాటు మండలం నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఉన్న నాయకులంతా ఈ నాలుగు రోజులు షర్మిల వెంట నడవాలన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి అధ్యక్షతన ‘పరామర్శ యాత్ర నియోజకవర్గ ఇన్చార్జి’లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బెంగళూరు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి ఆమె జిల్లెలగూడ మంద మల్లమ్మ చౌరస్తా, కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి మహానేత వైఎస్సార్ ఆకస్మిక మృతి తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్నారు. ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి వారికి భరోసా కల్పిస్తారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, పార్టీ కార్యదర్శి ఎనుగు మహిపాల్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మహిళా నేతలు అమృతసాగర్, సూరజ్ ఎజ్ధానీ, జి.ధనలక్ష్మి, ఎం.శ్యామల, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం. ప్రభుకుమార్, కార్మిక నేత నర్రా భిక్షపతి, మైనార్టీ నేతలు ముజ్తబ అహ్మద్, మసూం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు భాస్కర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నగర యువజన, సేవాదళ్ విభాగాల అధ్యక్షులు ఎ.అవినాష్‌గౌడ్, బండారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మనోధైర్యం నింపేందుకే పరామర్శ యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ వెల్లడి యాదగిరిగుట్ట: వైఎస్ మరణం తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్ర పోస్టర్లను శుక్రవారం యాదగిరిగుట్టలో ఆవిష్కరించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్సార్ మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అనేకమంది కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపడుతున్నారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లిలో సుంచు చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని, ఆలేరులోని ఏదుల శ్రీనివాస్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
మనోధైర్యం నింపేందుకే షర్మిల పరామర్శయాత్ర
యాదగిరిగుట్ట(నల్లగొండ): మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక గుండెపగిలి మృతి చెందిన వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపేందుకే వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్రకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అనేకమంది కుటుంబాలను పరామర్శిస్తామని గతంలోనే జగన్మోహన్రెడ్డి నల్లకాలువలో ప్రకటించి సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారిలో మనోధైర్యం నింపేందుకు షర్మిల ఈ యాత్రను చేపట్టారని పేర్కొన్నారు. ఈ యాత్ర జిల్లాలో 9 నుంచి12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 9, 10 తేదీల్లో సాగుతుందన్నారు. ఈ యాత్రకు పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. షర్మిల యాత్ర కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన గాదె నిరంజన్‌రెడ్డి, స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్న, రాష్ట్ర కార్యదర్శులు కుసుమ కుమార్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి, వడ్లోజు వెంకటేశ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూడూరు జైపాల్‌రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. -
మండలి కోడ్ దృష్ట్యా షర్మిల యాత్ర వాయిదా
- వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 18వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో.. దివంగత మహానేత వైఎస్సార్ కుమార్తె, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల కొనసాగించాల్సిన పరామర్శ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహానేత వైఎస్సార్ మరణంతో గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నల్లగొండ జిల్లాలో ఈ నెల 18-22 తేదీల మధ్య మలి విడతగా షర్మిల పరామర్శ యాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మండలి ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రస్తుతం వాయిదా పడిన ఈ యాత్రను మళ్లీ ఎప్పుడు చేపడతామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని పొంగులేటి పేర్కొన్నారు. -
షర్మిల పరామర్శయాత్ర తాత్కాలిక వాయిదా
ఎన్నికల కోడ్ అడ్డంకితో నిర్ణయంలో మార్పు కోడ్ ముగిసిన తర్వాత జరిగే అవకాశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో తలపెట్టిన మలివిడత పరామర్శయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. జిల్లాలో శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై కోడ్ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ెహైదరాబాద్లో వెల్లడించారు.ఎన్నికల కోడ్ అడ్డంకి కావడంతో జిల్లాలో పరామర్శయాత్ర తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.అయితే, షర్మిల యాత్ర జిల్లాలో మళ్లీ జరుగుతుందని, తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల వద్దకు షర్మిల వస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. తాత్కాలికంగానే యాత్ర వాయిదా పడిందని, కోడ్ ముగిసిన తర్వాత జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన వెల్లడించారు. -
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా.. : షర్మిల
* ఏడోరోజు పరామర్శ యాత్రలో షర్మిల భరోసా * మూడు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ తనయ * నల్లగొండ జిల్లాలో ముగిసిన మొదటి విడత పరామర్శ యాత్ర * ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను కలుసుకున్న షర్మిల సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలుసుకునేందుకు వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల నల్లగొండ జిల్లాలో చేపట్టిన మొదటి విడత ‘పరామర్శ యాత్ర’ ముగిసింది. ఏడోరోజు మంగళవారం ఆమె సూర్యాపేట నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను కలవడంతో మొదటి విడత యాత్ర పూర్తయింది. 7 రోజుల పాటు జరిగిన యాత్రలో షర్మిల జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పర్యటించి 30 కుటుంబాలను పరామర్శించారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్న షర్మిల వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ఆ కుటుంబాలకు తమ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చివరి రోజు మూడు కుటుంబాలు.. జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలో పర్యటించారు. చివ్వెంల మండలంలోని వాల్యాతండాలో నునావత్ లక్ష్మి కుటుంబాన్ని, ఆ తర్వాత ఆత్మకూరు (ఎస్) దుబ్బతండాలోని అజ్మీరా గంసీ కుటుంబాన్ని, చివ్వెంల మండలం కుడకుడలోని శేర్ల రాములు కుటుంబాన్ని ఆమె కలుసుకున్నారు. చివరి రోజు యాత్రకు కూడా మంచి స్పందన కనిపించింది. పరామర్శ కుటుంబాల వద్ద, గ్రామాల వెంట ప్రజలు పెద్దఎత్తున షర్మిలకు స్వాగతం పలికారు. షర్మిల వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, భీష్వ రవీందర్, అమృతాసాగర్, జి.రాంభూపాల్‌రెడ్డి, సత్యం శ్రీరంగం, ఆకుల మూర్తి, ముస్తాబ్ అహ్మద్, ప్రపుల్లారెడ్డి, జార్జి హెర్బర్ట్, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, జిల్లా నేతలు పిట్ట రాంరెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, దొంతిరెడ్డి సైదిరెడ్డి, దండా శ్రీనివాసరెడ్డి, పచ్చిపాల వేణుయాదవ్ తదితరులున్నారు. అందరికీ కృతజ్ఞతలు: పొంగులేటి నల్లగొండ జిల్లాలో జరిగిన పరామర్శ యాత్రకు సహకరించిన అందరికీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర మొదటి విడత ముగిసిన అనంతరం కుడకుడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలసి మాట్లాడారు. షర్మిల ఎక్కడకు వెళ్లినా ఆమె తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి, వారికి జరిగిన లబ్ధి గురించి ప్రజలు ఆమెకు వివరించారని చెప్పారు. వైఎస్‌లాంటి పరిపాలన ఆయన కన్నా ముందు గానీ, ఆయన తర్వాత గానీ ఎవరూ చేయలేరని ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో తమకు పింఛన్లు రాలేదని, తాగునీరు లేదని, ఇళ్లు లేవని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇబ్బందిగా ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని పొంగులేటి చెప్పారు. -
ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా
వైఎస్ తనయ షర్మిలను అక్కున చేర్చుకున్న నల్లగొండ జిల్లా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేవరకొండ గుట్టల్లో ఉన్న దేవరచర్లలో పరామర్శ కోసం హనుమా నాయక్ కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు కొడుకు రతన్‌సింగ్‌కు కాళ్లవాపులు ఉండడంతో షర్మిల ఆయన కాళ్లపై తన చేతులు వేసి ‘ఏం తాతా? కాళ్లెందుకు వాచాయి?’ అని ఆరా తీయగా ఆయన కళ్లలో కనిపించిన నీళ్లు... ‘మాపై మీ కుటుంబానికి ఇంత ప్రేమా తల్లీ’ అని పలకరించాయి... నాగార్జునసాగర్‌లో కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు ఆయన కూతుళ్లు నోమిని, పార్వతిలు షర్మిలను చూసి వెక్కివెక్కి ఏడ్చినప్పుడు ఆ మహానేత తనయ హృదయం ద్రవించిపోయింది. వాళ్లు కూడా తన తోబుట్టువులే అన్నట్టు... ఆమె కూడా కన్నీటిపర్యంతమయ్యారు. షర్మిల ఏడుస్తుంటే ఆ కుటుంబం అల్లాడిపోయింది... ఇన్నాళ్లు పలకరించిన వాళ్లు లేరమ్మా! ఒక్కదానినే ఉంటున్నా... ఇప్పుడు నువ్వొస్తున్నావంటే ఇంతమంది వచ్చారు అని మిర్యాలగూడలో అక్కిమళ్ల సుందర్ భార్య కృష్ణవేణి ఏడ్చినప్పుడు రాజన్న బిడ్డ కూడా ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టారు. నువ్వు ఒంటరి దానివి కాదమ్మా...! నీకు మా కుటుంబం అండగా ఉందంటూ భరోసా ఇచ్చినప్పుడు ఆమె మోములో ఆనందం విరిసింది... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉద్వేగ సంఘటనలు... నల్లగొండ జిల్లాలో షర్మిల ఏడు రోజుల పరామర్శయాత్రలో అడుగడుగునా అంతులేని అభిమానం పొంగిపొర్లింది. ఆమె ఏడురోజులపాటు నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పర్యటించి తన తండ్రి మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 30 మంది కుటుంబాలను పరామర్శించారు. తన తండ్రి చనిపోయిన ఐదున్నరేళ్ల తర్వాత ఆయన కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం చేపట్టిన యాత్ర అడుగడుగునా ఆప్యాయత, అభిమానం నింపుకుని నడిచింది. ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా ఆ కుటుంబంపై ప్రేమానురాగాలు మరచిపోలేనివని ఈ యాత్ర నిరూపించింది. ‘బాగున్నారా..’ అంటూ షర్మిల ప్రజలను పలకరించినప్పుడు, హాయ్ అంటూ చేయి కలిపినప్పుడు... వైఎస్సార్‌ను కలిశామనే స్థాయిలో అనుభూతి పొంది ఆనందంతో తిరిగి వెళ్లిపోయారు. మేళ్లచెరువు అయితే జనసంద్రమైపోయింది. షర్మిల వస్తోందని తెలుసుకున్న గ్రామస్తులు వేల సంఖ్యలో ఆమెను చూసేందుకు మెయిన్సెంటర్కు రావడం గమనార్హం. కొన్నిచోట్ల షర్మిల చేత తమ పిల్లలకు నామకరణం చేయించారు... అన్నప్రాసనలు చేయాలని కోరారు. గ్రామస్తుల మేళతాళాలు, మంగళహారతులు, కోలాటాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, గిరిజన భాషలో పాటలు పాడుతూ షర్మిలమ్మను తమ గ్రామంలోకి స్వాగతించారు. సూర్యాపేట పరిధిలోని కందగట్లలో అయితే మహిళలంతా దారిపొడవునా రంగురంగుల ముగ్గులు వేసి షర్మిలమ్మను పరామర్శ కుటుంబం వద్దకు తీసుకెళ్లారు. ఆ కుటుంబాల ప్రేమ వెలకట్టలేనిది తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుం బాల వద్దకు షర్మిల వెళ్లినప్పుడు ఆయా కుటుంబాల సభ్యులు ఆమెపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివనే చెప్పాలి. షర్మిల తమ ఇంట్లోకి రాగానే వారి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. రెండు చేతులతో నమస్కరించి అందరినీ పేరుపేరునా బాగున్నారా అని షర్మిల పలకరించినప్పుడు వారంతా ఆత్మీయంగా స్పందించారు. కోదాడ నియోజకవర్గంలోని వెంకట్రాంపురంలో తన చిన్నారిని షర్మిల ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘హర్ష’ అని పేరు పెట్టినప్పుడు ఆమె తల్లి రాధ పొంగిపోయింది. షర్మిల మన బిడ్డతో మాట్లాడుతోందని కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్న భర్తకు వెంటనే ఫోన్ చేసి చెప్పి తన సంతోషాన్ని పంచుకుంది. మొత్తమ్మీద షర్మిల ఆ కుటుంబాలను పలకరించిన ఆ అరగంట వారికి ఉద్వేగభరిత అనుభూతులను మిగిల్చింది. షర్మిల వెళ్లిపోయాక వారిని పలకరిస్తే ‘ఆ బిడ్డ మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే ఉంది’ అని చెప్పడం గమనార్హం. ఏమ్మా.. బాగున్నారా! షర్మిల కూడా పరామర్శకు వెళ్లిన ప్రతి కుటుంబంలోని వారందరినీ పేరుపేరునా పలకరించారు. వయసుమళ్లిన పెద్దవాళ్లను వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. విద్యార్థులు కనిపిస్తే బాగా చదువుకోవాలి.. అమ్మా, నాన్నలను బాగా చూసుకోవాలని సూచిం చారు. పెద్దవాళ్లు కనిపించినప్పుడు ఏమ్మా..! రేషన్ వస్తోందా? వ్యవసాయం బాగుందా? పంటలు ఎలా ఉన్నాయి? రైతు రుణమాఫీ అయిందా? పింఛన్ వస్తోందా? కరెంటు ఉంటోందా? అని కుశలప్రశ్నలు వేసిన షర్మిల.. అందరూ ధైర్యంగా ఉండాలని , మంచిరోజులు వస్తాయని ధైర్యం చెప్పి వెళ్లారు. -
‘హక్కులు’ కాపాడిన నేత వైఎస్: షర్మిల
నేటితో నల్లగొండ జిల్లాలో పూర్తికానున్న తొలిదశ యాత్ర * ఆరో రోజు సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు పరామర్శ * ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యతను ఆయన గుర్తించారు * రైతులు, మహిళలు, విద్యార్థులు సహా అందరికీ న్యాయం చేశారు * వైఎస్ పాలనను ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచన * సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలకు పరామర్శ * వైఎస్ కుటుంబం తోడుగా ఉంటుందని భరోసా కల్పించిన వైఎస్ జగన్ సోదరి * ముక్కుడుదేవులపల్లిలో మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించిన షర్మిల సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘రాజ్యాంగం దేశ పౌరులందరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఇచ్చింది. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. చాలా మంది రాజకీయ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడగలరు.. కానీ ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రమే రాజ్యాంగం ఆత్మను అర్థం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేశారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల... 66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఆనంద విద్యా మందిర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. రాజ్యాంగం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాల్సిన బాధ్యతను వైఎస్ గుర్తించారని చెప్పారు. ఆయన ప్రభుత్వం ప్రతి ఒక్కరి హక్కులను కాపాడిందని... రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేసిందని తెలిపారు. వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. భారత పౌరులుగా ఈ దేశానికి చేస్తున్న సేవను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భారతమాతకు చేస్తున్న సేవగా గుర్తెరగాలని కోరారు. అనంతరం ఆమె పాఠశాల విద్యార్థులు నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆరు కుటుంబాలకు పరామర్శ.. పరామర్శ యాత్రలో భాగంగా నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ఆరో రోజు సూర్యాపేట నియోజకవర్గంలో ఆరు కుటుంబాలను పరామర్శించారు. ఉదయం సూర్యాపేటలోని ఏవీఎం స్కూల్లో జరిగిన గణతంత్ర వేడుకలలో షర్మిల పాల్గొన్నారు. తర్వాత పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి బయలుదేరిన ఆమె... మార్గమధ్యలో సింగారెడ్డిపాలెంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జెండా వందనం చేశారు. ఆ తర్వాత అనంతారం వెళ్లి దామర్ల లింగయ్య కుటుంబాన్ని పరామర్శించి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి దురాజ్‌పల్లి మార్గంలో జాతీయ రహదారి మీదుగా చివ్వెంల మండలం హున్యానాయక్ తండాకు వెళ్లి బానోతు ముకుంద కుటుంబాన్ని కలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు(ఎస్) మండలం నశింపేటకు వెళ్లి నర్రా లచ్చయ్య కుటుంబాన్ని పరామర్శించారు. నెమ్మికల్లు సమీపంలో భోజనం పూర్తి చేసుకుని ముక్కుడు దేవులపల్లికి వెళ్లి... కుంచం ఎల్లమ్మ కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడి నుంచి కందగట్లకు చేరుకుని... కుషనపల్లి రాములు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఈ గ్రామంలో షర్మిలకు ఘన స్వాగతం లభించింది. గ్రామస్తులు ఊరి ప్రారంభం నుంచే రంగు రంగుల ముగ్గులు వేసి.. రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఆమెను ఆహ్వానించారు. గ్రామంలో వెళుతుండగా వైఎస్సార్ అభిమాని పూతనపల్లి చెన్నయ్య కుమార్తె కలకొండ ప్రియాంక, రమేష్ దంపతులు షర్మిలను ఆపి... తమ 23 రోజుల కుమార్తెకు పేరు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో ఆ పాపకు షర్మిల.. ‘విజయ’ అని పేరు పెట్టారు. అనంతరం ఏనుబాములలో వర్రె వెంకులు కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో షర్మిల పరామర్శించిన ఆరు కుటుంబాలూ... రాజన్న బిడ్డకు సాదర స్వాగతం పలికాయి. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన తమ కుటుంబ పెద్దను గుర్తుంచుకుని, ఐదున్నరేళ్ల తర్వాత కూడా తమను కలుసుకునేందుకు వచ్చిన షర్మిలను చూసి ఆ కుటుంబాల సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి కుటుం బాన్ని పరామర్శించిన షర్మిల.. వారందరికీ ధైర్యం చెబుతూ... వారికి వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బారులు తీరిన ప్రజలు... సూర్యాపేట నియోజకవర్గంలో షర్మిల యాత్రకు భారీ స్పందన కనిపించింది. పర్యటన మార్గంలో ప్రజలు రోడ్డు పక్కన బారులు తీరి ఆమెను స్వాగతించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శిస్తుండగా... ఆమెను చూసేందుకు ఆ ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లిలో ఓ కుటుంబాన్ని పరామర్శించి వెళుతున్న షర్మిలకు శివమాలధారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి పునర్నిర్మించుకున్న పురాతన మల్లన్న దేవాలయాన్ని ప్రారంభించాలని వారు కోరగా... షర్మిల ఆ దేవాలయాన్ని ప్రారంభించారు. కాగా మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలో మూడు కుటుంబాలను పరామర్శించడంతో షర్మిల పరామర్శ యాత్ర తొలివిడత ముగియనుంది. సోమవారం యాత్రలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, ఆకుల మూర్తి, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్వ రవీందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాబ్ అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మెండెం జయరాజ్, పార్టీ కార్యదర్శులు జి.రాంభూపాల్‌రెడ్డి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, అమృతాసాగర్, కొమురం వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులు ఇరుగు సునీల్, షర్మిలా సంపత్, బంగి లక్ష్మణ్, యువజన విభాగం ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల కోఆర్డినేటర్ సాధు రమేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజల కలలు నెరవేరాలి: పొంగులేటి 60 ఏళ్ల పోరాటం తర్వాత ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొంటున్న తొలి గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సూర్యాపేటలోని ఏవీఎం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేర్చేలా పాలకులు ప్రయత్నించాలని కోరారు. వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సోమవారం షర్మిల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కొణిజర్ల మండలం ఉప్పలచెలక సర్పంచ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బాదావత్ సైదులు, నాయకులు గగులోతు నర్సింహారావు, జాల ఆంజనేయులు, బూక్యా మాన్సింగ్, గుడివాడ వెంకటేశ్వర్లు, బూక్యా బాలు తదితరులు ఉన్నారు. పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా నేతలు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, మధిర ఎంపీపీ వేమిరెడ్డి శేఖర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కోట్లాది గుండెల్లో వైఎస్సార్..
* నల్లగొండ జిల్లా ‘పరామర్శయాత్ర’లో షర్మిల * ఒక నాయకుడి కోసం వందల గుండెలు ఆగిన చరిత్ర లేదు * ఆయనకు ముందు ఏ సీఎం పేదవాడి గురించి ఆలోచించలేదు * ఏ ముఖ్యమంత్రీ విద్యార్థుల గురించి పట్టించుకోలేదు * వైఎస్సార్ పేదవాడిని భుజాన మోశారు.. రైతును రాజును చేశారు * ఆశయాల కోసం చేయికలుపుదామని వైఎస్ జగన్ సోదరి పిలుపు * నాలుగోరోజు 5 కుటుంబాలకు పరామర్శ.. అడుగడుగునా నీరాజనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజాస్వామ్యంలో ఓ నాయకుడి గురించి వందలాది గుండెలు ఆగి పోయిన చరిత్ర ఎప్పుడూ లేదని... అది ఒక్క వైఎస్సార్ విషయంలోనే జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ పేద ప్రజల కోసమే బతికారని, పేదలకు మేలు చేయడం కోసమే ఆయన పోరాడారని చెప్పారు. పేదవాడిని తన భుజాన మోసి, రైతును రాజును చేశా డు కాబట్టే కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా కొలువుదీరారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల నాలుగో రోజు శనివారం హుజూర్నగర్ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌తో పాటు మేళ్లచెరువులో తనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్ కంటే ముందు ఏ ముఖ్యమంత్రి కూడా పేద విద్యార్థుల గురించి ఆలోచించలేదు.. పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. వైఎస్ మాత్రమే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చి, రైతును దేశానికి వెన్నెముకగా చేయాలనుకున్నారు. తెలుగు ప్రజలందరినీ సొంత బిడ్డలుగా ప్రేమించారు. ఏ అవసరమున్నా మీకు తోడుగా ఉంటానంటూ ప్రజల పక్షాన నిలబడ్డారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా.. తన పార్టీనా, వేరే పార్టీనా అనేది చూడకుండా ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేశారు. అందుకే వైఎస్‌కు మరణం లేదు. తెలుగు జాతి బతికున్నంత వరకు వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారు’’ అని షర్మిల పేర్కొన్నారు. కోట్లాది మందికి మేలు చేశారు..: దేశంలో, రాష్ట్రంలో ఎందరో ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు పనిచేసినా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక్కడికే కోట్లాది మంది ప్రజలు తమ గుండెల్లో చోటిచ్చారని షర్మిల పేర్కొన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మేలు కోసమే ఆయన పాటుపడ్డారన్నారు. రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడ్డ వైఎస్ వారి కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర ఇచ్చారని చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారని, లక్షలాది మంది పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నారని షర్మిల తెలిపారు. ఇన్ని చేసినా ఏ ఒక్క రోజు ఏ ఒక్క చార్జీ, ఏ ఒక్క పన్ను పెంచలేదని... పన్నులు, చార్జీలు పెంచకుండానే అన్ని పథకాలను అద్భుతంగా అమలుచేసిన రికార్డు ముఖ్యమంత్రిగా వైఎస్ నిలిచిపోయారని షర్మిల తెలిపారు. అలాంటి వైఎస్సార్ ఆశయాలను మనమే ముందుకు తీసుకెళ్లాలని... అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి చేయి కలపాలని షర్మిల కోరారు. మేళ్లచెర్వు జన సంద్రం..: పరామర్శయాత్రలో భాగంగా షర్మిల మేళ్లచెర్వు మండల కేంద్రానికి చేరుకునే సరికి సాయంత్రం ఆరున్నర గంటలైంది. ఆ ఊరి బయట పెట్రోల్‌బంక్ వద్ద నుంచే ప్రజలు షర్మిలను చూడడానికి బారులు తీరారు. అక్కడి నుంచి రేవూరు రోడ్డు వరకు దారి పొడవునా భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, అన్నివర్గాల ప్రజలు ఎదురేగి షర్మిలకు స్వాగతం పలికారు. ఈ సమయంలో ఎక్కడచూసినా జనమే కనిపిం చారు. ఇక గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇన్నేళ్లయినా వైఎస్‌ను గుర్తుపెట్టుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆ గ్రామ ప్రజలకు షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. యాత్రలో షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశరావు, గున్నం నాగిరెడ్డి, భీష్వ రవీందర్, పి.సిద్ధార్థరెడ్డి, ఆకుల మూర్తి, మెండెం జయరాజ్, జార్జ్హెర్బర్ట్, ముస్తఫా అహ్మద్, వడ్లోజు వెంకటేశం, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, షర్మిలా సంపత్, ఇరుగు సునీల్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి, వరంగల్ అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, ఎన్.భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి మీరే వెలుగులు.. హుజూర్నగర్ నియోజకవర్గంలో పరామర్శయాత్ర ప్రారంభించడానికి ముందు నేరేడుచర్ల సమీపంలోని సిటీ సెంట్రల్ స్కూల్ విద్యార్థులతో షర్మిల కొంతసేపు ముచ్చటించారు. ఆ పాఠశాలకు వెళ్లిన షర్మిలను చూడగానే పిల్లలు కేరింతలు కొట్టారు. వారందరితో కరచాలనం చేసిన షర్మిల కాసేపు మాట్లాడారు. వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులే సమాజంలో మార్పు తీసుకురాగలరని.. ఈ ప్రపంచానికి మీరే వెలుగు దివ్వెలని చెప్పారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి బాధ్యత చాలా ఉందన్నారు. రానున్నవి మంచి రోజులు..: పొంగులేటి రానున్నవి మంచిరోజులేనని.. వైఎస్సార్ కలలుగన్న సమాజాన్ని నిర్మించుకునేందుకు అందరం చేయి కలిపి పనిచేయాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మేళ్లచెరువు, హుజూర్నగర్, నేరేడుచర్లలలో ప్రసంగించారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ లేదనే రాజకీయ పార్టీలు ఒక్కసారి హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపుతున్న ప్రేమను చూడాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా వైఎస్సార్ సీపీ అధికారంలోనికి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వైఎస్‌లాంటి పాలన అందించాలని, మంచి ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఐదు కుటుంబాలకు పరామర్శ.. పరామర్శయాత్రలో భాగంగా షర్మిల నాలుగోరోజు ఐదు కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరించి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్లలో తురక లింగయ్య కుటుంబాన్ని షర్మిల కలుసుకున్నారు. తర్వాత గరిడేపల్లి మండలం కాల్వపల్లిలో వెంకటగిరి జయమ్మ, హుజూర్నగర్ పట్టణంలోని సుందరయ్యనగర్‌లో లింగం పాండు కుటుంబాలను ఆమె పరామర్శించారు. భోజన విరామం తర్వాత మేళ్లచెర్వు మండల కేంద్రంలోని చల్లా పూర్ణయ్య కుటుంబం వద్దకు వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడి, అదే మండలంలోని కందిబండలో పేరుపంగు లింగయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. -
నాన్నలాంటి నాయకుడికి మరణం లేదు: షర్మిల
* నల్లగొండ ‘పరామర్శ యాత్ర’లో షర్మిల * ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న వైఎస్సార్ * మనిషిని మనిషిగా చూశారు.. పేదవాడిని గౌరవించిన నేత * రైతులు, రైతు కూలీలకు అండగా నిలిచిన మహామనిషి * తన ఐదేళ్ల పాలనలో ఏనాడూ ఏ చార్జీలు పెంచలేదు * కుల, మత, వర్గ భేదం లేకుండా ఆదరించిన నాయకుడు * ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సింది మనమే.. * రాజన్న రాజ్యం కోసం చేయిచేయి కలిపి సాగుదామని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి పిలుపు * దేవరకొండ నియోజకవర్గంలో 3 కుటుంబాలకు పరామర్శ సాక్షి, నల్లగొండ/హైదరాబాద్: తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారని, ఒక నాయకుడిగా కాకుండా కన్నతండ్రిలా పాలన సాగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన వైఎస్సార్ లాంటి నాయకుడికి మరణం లేదని, తెలుగు జాతి బతికి ఉన్నంత వరకు ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆమె చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభించిన షర్మిల దేవరకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ముగ్గురి కుటుంబాలను పరామర్శించి, వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, దేవరకొండల్లో తనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలనే విధంగా పాలించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. మనిషిని మనిషిగా చూసి, పేదవాడిని కూడా మనస్ఫూర్తిగా గౌరవించిన కారణ ంగానే రాజన్నగా పిలిపించుకున్నారని.. అలాంటి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకునేందుకు అందరం చేయిచేయి కలిపి ముందుకెళదామని పిలుపునిచ్చారు. అంతకుముందు షర్మిల నల్లగొండ పర్యటనకు హైదరాబాద్ నుంచి ఉదయం 9.40కి బయలుదేరారు. లోటస్‌పాండ్‌లో తమ నివాసంలో తల్లి వైఎస్ విజయమ్మ, సోదరుడు జగన్మోహన్రెడ్డి ఆమెను ఆశీర్వదించి, వాహనం వద్దకు వచ్చి పర్యటనకు పంపారు. నల్లగొండ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే... ‘‘వైఎస్‌ను ఎంతగానో అభిమానిస్తూ.. నన్ను చూడడానికి వచ్చిన అందరికీ మీ రాజన్న కూతురు, జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది. ఒక నేత మరణిస్తే ఆ బాధతో వందలాది మంది ప్రాణాలు విడవడం దేశంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. ఒక్క వైఎస్సార్ మరణించినప్పుడు మాత్రమే అలా జరిగింది. మనసున్న నాయకుడిగా ప్రజలు ఆయన్ను గుండెల్లో దాచుకున్నారు కాబట్టే వైఎస్సార్ మరణించినప్పుడు రాష్ట్రంలో వందలాది గుండెలు ఆగిపోయాయి. జన్మనిచ్చిన తల్లి, నడక నేర్పిన నాన్న, తోడబుట్టిన వారికి, ఆత్మ బంధువులకు జీవితాంతం గుండెల్లో చోటిస్తాం.. అలాంటి చోటు వైఎస్సార్‌కు కోట్లాది మంది ప్రజలు ఎందుకిచ్చినట్టు? కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎందుకు బతికి ఉన్నట్టు? రాష్ట్రానికి నేతగా కాకుండా కన్నతండ్రిలా ప్రజలను చూసుకున్నందుకే ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్నారు. ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన ఘనత ఆయన సొంతం. వైఎస్సార్ ప్రతి రైతుకు, రైతు కూలీలకు అండగా నిలబడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర అందించిన ఘనత ఆయనది. పేదరికంతో డబ్బులేని కారణంగా పిల్లల చదువు ఆగిపోకూడదని, డాక్టర్ చదువుతారో, ఇంజనీర్ అవుతారో, ఎంబీఏ, ఎంసీఏ చదువుతారో.. ఏదైనా ప్రభుత్వమే చదివిస్తుందన్న వైఎస్ భరోసాతో లక్షలాది మంది చదువుకుని ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలని మంచి మనసుతో ఆలోచించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి.. లక్షలాది మందికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. ‘కుయ్.. కుయ్.. కుయ్’మంటూ ప్రమాదం జరిగిన నిమిషాల్లోపే వచ్చిన ‘108’ అంబులెన్సులు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. ఇన్ని చేసినా పేదలపై భారం పడకూడదని ఐదేళ్లలో ఒక్క రూపాయి కరెంటు చార్జీలు గాని, బస్సు చార్జీలుగానీ పెంచలేదు. ఈ విషయంలో ప్రతిపక్షాలూ ఆయనను విమర్శించలేకపోయాయి. అందుకే ఆయన రికార్డు సీఎంగా నిలిచారు. వైఎస్సార్ పాలించిన ఐదేళ్లలో దేశం మొత్తమ్మీద అన్ని రాష్ట్రాల్లో 46 లక్షల పక్కాగృహాలు నిర్మిస్తే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారు. రచ్చబండకెళ్లి ఎవరికైనా ఇల్లు లేదా అని అడిగితే చేతులు లేపే వారు ఉండకూడదని వైఎస్ చెబుతుండేవారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఒక్క పూరిగుడిసె ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఎకరానికి నీళ్లు ఉండేవి. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఉండేది. బిడ్డలకు, చదువులు ఉద్యోగాలు ఉండేవి. తన, పర భేదం లేకుండా ప్రతి వర్గం ప్రజలకు, ఏ కులం, ఏ మతం అని చూడకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయగలిగాడు వైఎస్సార్. ఆయన ఆశయాలను మన మే ముందుకు తీసుకెళ్లాలి. ఆయన పథకాలను కొనసాగించుకోవాలి. అందుకే రాజన్న రాజ్యం కోసం అందరం చేయి కలపాలి..’’ అని షర్మిల పేర్కొన్నారు. యాత్రలో ఆమె వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, కొండా రాఘవరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, వడ్లోజు వెంకటేశం, గూడూరు జైపాల్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, బీష్య వీరేందర్, షర్మిలా సంపత్, సిద్ధార్థరెడ్డి తదితరులు ఉన్నారు. ఆత్మీయ పరామర్శ... వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను స్వయంగా వచ్చి ఓదారుస్తానని మాట ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతినిధిగా వచ్చిన షర్మిల ఆత్మీయ పరామర్శతో మూడు కుటుంబాలు పులకించాయి. ముందు దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చింతపల్లి మండలం మదనాపురంలో ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని, తర్వాత చందంపేట మండలం దేవచర్లలో కేతావత్ హనుమంతునాయక్ కుటుంబాన్ని, అనంతరం అదే మండలం గువ్వలగుట్టలో రమావత్ బీమిని కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పలకరించారు. ‘పెద్దాయనా.. ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటమ్మా.. అందరూ బాగున్నారా? కాలువాపు ఎందుకు వచ్చింది? రేషన్ వస్తుందా అమ్మా..? పిల్లలూ బాగా చదువుకోవాలి.. మీకు అండగా మా కుటుంబం ఉంటుంది.’ అంటూ షర్మిల మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. షర్మిల కూడా తమ కుటుంబసభ్యురాలే అన్న అనుభూతికి వారు లోనయ్యారు. హనుమంతునాయక్ కుటుంబాన్ని పరావ ుర్శిస్తున్న సమయంలో ఆయన కుమారుడు ధరంసింగ్, మనుమరాలు ప్రియాంక ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. వారిని షర్మిల ఓదార్చి భరోసానిచ్చారు. బీమిని మనుమరాలు పద్మ తన కుటుంబ పరిస్థితిని కన్నీళ్లు పెట్టుకుంటూ షర్మిలకు వివరించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత షర్మిలకు ఆత్మీయతతో పెరుగన్నం తినిపించారు. యాత్ర పొడవునా షర్మిలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చందంపేట మండలంలోని మారుమూల ప్రాంతమైన గువ్వలగుట్టకు వెళుతున్న సమయంలోనూ స్థానిక గిరిజనులు తమ గ్రామాల్లో ఆమెను ఆపి మాట్లాడారు. రాజశేఖరరెడ్డి కుమార్తె తమ ఊరికి వచ్చిందని చెప్పుకుంటూ మురిసిపోయారు. మంగళహారతులు, గిరిజన మహిళలు నృత్యాలతో షర్మిలను స్వాగ తించారు. గువ్వలగుట్టలో పరామర్శ కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి ఏడున్నర అయినా గ్రామస్తులు ఆమె కోసం ఉండిపోవడం.. షర్మిలను చూస్తుంటే రాజశేఖరరెడ్డి గుర్తుకువ స్తున్నాడని వ్యాఖ్యానించడం వైఎస్ కుటుంబంపై ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నేటి నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
-
నేటి నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
6 నియోజకవర్గాల్లో 30 కుటుంబాలకు పలకరింపు సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిం చేందుకు ఆయన కుమార్తె, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నేటి నుంచి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపడుతున్న తొలివిడత పరామర్శ యాత్ర కోసం బుధవారం ఉదయం లోటస్‌పాండ్ నివాసం నుంచి షర్మిల బయలుదేరి వెళ్తారు. నల్లగొండ జిల్లాలోని మాల్‌కు చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి దేవరకొండ నియోజకవర్గానికి చేరుకుని చింతపల్లి మండలం మదనాపురంలో ఆడేపు బాలమ్మ కుటుంబాన్ని, చందంపేట మండలం ఎల్మలమంద గ్రామం దేవరచర్ల తండాలో లక్ష్మి కుటుంబాన్ని, ఇదే మండలంలోని గువ్వలగుట్టలో బి.మణి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండలో పరామర్శ పూర్తయ్యాక27వ తేదీ వరకు హుజూర్నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగనుంది. పరామర్శ యాత్రలో భాగంగా ఏడు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను షర్మిల కలుసుకోనున్నారు. కొన్ని రోజుల తర్వాత రెండోవిడత పరామర్శ యాత్రలో జిల్లాలోని మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వస్తానని ఐదున్నరేళ్ల క్రితం నల్లకాల్వ సాక్షిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సోదరి షర్మిల ఈ పర్యటనను నిర్వహిస్తున్నారు. జిల్లాలో షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌లోనూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో షర్మిల పర్యటించి వైఎస్సార్ అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తారన్నారు. -
షర్మిల పరామర్శయాత్ర షెడ్యూల్ విడుదల
-
షర్మిల పరామర్శయాత్ర షెడ్యూల్ విడుదల
21 నుంచి నల్లగొండ జిల్లాలో పర్యటన సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్ర షెడ్యూల్ విడుదలైంది. ఆరు నియోజకవర్గాల్లో ఏడు రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో 34 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను సోమవారం ఆయన పత్రికలకు విడుదల చేశారు. 21న దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర 27న సూర్యాపేట నియోజకవర్గంలో ముగుస్తుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం షర్మిల దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం మదనాపురం, చందంపేట మండలం దేవరచర్ల తండాతో పాటు, గువ్వలగుట్టలో మొత్తం మూడు కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే హుజూర్నగర్ నియోజకవర్గంలో నేరేడుచర్ల మండలం దిర్శించర్ల ఎస్సీ కాలనీ, కాలువపల్లి, హుజూర్‌నగర్‌లోని సుందరయ్యనగర్, మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, ఇదే మండలంలోని కందిబండలో మొత్తం 5 కుటుంబాలను పరామర్శిస్తారు. కోదాడ నియోజకవర్గంలోని తొగర్రాయి, కోదాడ, ఆచార్యులగూడెం, గణపవరం, వెంకట్రాంపురంలో 5 కుటుంబాలను షర్మిల కలుసుకుంటారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని నందిపాడు క్యాంప్, సల్కునూరు, మిర్యాలగూడ, ఆలగడపలో 4 కుటుంబాలను పరామర్శిస్తారు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్దవూర మండలం నాగార్జునసాగర్, హాలియా మండలం గరికేనాటి తండా, త్రిపురారం మండల కేంద్రంలో 3 కుటుంబాలను షర్మిల కలుసుకుంటారు. కాగా, సూర్యాపేట నియోజకవర్గంలో రెండురోజులపాటు షర్మిల పరామర్శ యాత్ర కొనసాగనుందని పొంగులే టి తెలిపారు. ఈ నియోజకవర్గంలోని పెన్‌పహాడ్ మండలం అనంతారం, చివ్వెంల మండలం హున్యానాయక్ తండా, ఆత్మకూర్-ఎస్ మండలం నశీంపేట, ముక్కుడుదేవుడుపల్లి, కందగట్ల, ఏనుభాముల, చివ్వెంల మండలం మంగలితండా, ఆత్మకరూర్-ఎస్ మండలం దుబ్బతండా, సూర్యాపేట మండలం కుడకుడలో పలు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని తెలిపారు.