గ్రేటర్‌లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యం
కాజీపేట రూరల్ : వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని పార్టీ అధిష్టానం నిర్ణరుుంచింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి సమావేశమయ్యారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డితో మూడు గంటలపాటు చర్చించారు. పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఎంపీ, గ్రేటర్ ఎన్నికలలో ైవైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయూలని రాఘవరెడ్డి సూచించినట్లు జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ తెలిపారు.
వచ్చే నెలలో షర్మిల పరామర్శ యాత్ర..
జిల్లాలో ఆగస్టులో షర్మిల పరామర్శ యాత్ర ఉంటుందని జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి వె ల్లడించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ తెలిపారు. షర్మిల యాత్రను జిల్లాలో విజయవంతం చేసేందుకు ైవైఎస్సార్ సీపీ నాయకులు కృషి చేయాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీలోకి సంగాల ఇర్మియా, సాల్మన్‌రాజ్
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఇర్మియా, సాల్మన్‌రాజ్ వైఎస్సార్ సీపీలో చేరినట్లు గ్రేటర్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ యాదవ్ తెలిపారు. లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, రాష్ట్ర సం యుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిషన్, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు అచ్చిరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు ఎర్రంరెడ్డి మహిపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మం చె అశోక్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ. ఖాదర్, ట్రేడ్ యూని యన్ జిల్లా అధ్యక్షుడు గౌని సాంబయ్యగౌడ్, జిల్లా నాయకులు నెమలి పురి రఘు, షంషీర్ బేగ్, చల్ల అమరేందర్‌రెడ్డి, బద్రొద్దీన్ ఖాన్, బీంరెడ్డి రవితేజరెడ్డి, నాగవెల్లి రజనీకాం త్, రాజేష్, యాకూబ్, సుధాకర్, పిట్టల శ్రీను పాల్గొన్నారు.