
నేటినుంచి షర్మిల పరామర్శయాత్ర
* రంగారెడ్డి జిల్లాలో నాలుగు రోజులపాటు పర్యటన
*15 కుటుంబాలకు పరామర్శ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్ర ప్రారంభిస్తారు.
నాలుగు రోజులపాటు జరిగే ఆమె పర్యటనలో భాగంగా తొలిరోజు 177 కిలోమీటర్ల మేర పరామర్శయాత్ర కొనసాగనుంది. రెండో రోజు 134 కిలోమీటర్లు, మూడోరోజు 153 కిలోమీటర్లు, నాలుగోరోజు 126 కిలోమీటర్ల చొప్పున మొత్తం 590 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం పరామర్శ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరామర్శయాత్రలో షర్మిలతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు.
ఆత్మీయ స్వాగతం పలకండి: కొండా రాఘవరెడ్డి
మొయినాబాద్ రూరల్: రాజన్న బిడ్డ షర్మిల కు ఆత్మీయ స్వాగతం పలకాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా హిమాయత్‌నగర్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్యటనలో భాగంగా 15 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని తెలి పారు. మొదటి రోజు జిల్లెలగూడకు చెందిన అంజయ్య కుటుంబాన్ని పరామర్శించి అ క్కడి నుంచి మహేశ్వరం మండలం మంఖాల్‌లోని ఎంగల జోసెఫ్ కుటుం బాన్ని, అనంతరం ఇబ్రహీంపట్నం మండ లం దండుమైలారంలో పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారని వివరించారు.
30న కండ్లకోయలోని సముద్రాల సాయిబాబాగౌడ్ కుటుంబాన్ని, మేడ్చల్‌లోని కొల్తూరి ముత్యాలు కుటుంబా న్ని, శామీర్‌పేట మండలం కేసారం చేరుకొని చెన్నూరి వెంకటేశ్ కుటుంబాన్ని, మూడుచింతలపల్లిలో జామ కిష్టయ్య కుటుం బాన్ని, లక్ష్మాపూర్‌లో నూతనకం టి మహేశ్ కుటుం బాన్ని పరామర్శిస్తారని తెలిపారు. జూలై 1న మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామానికి చెందిన ఈడిగ సుగుణ కుటుంబాన్ని పరామర్శిస్తారని, అమ్డాపూర్ చౌరస్తాలోని, చేవెళ్ల చౌరస్తాలోని వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేస్తారన్నారు. పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌లో కృష్ణారెడ్డి, పరి గిలో శ్రీనివాస్, ఆవుసల లక్ష్మణయ్యచారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారన్నారు. 2వ తేదీన తాండూరు నుంచి బయలు దేరి మర్పల్లిలో కమ్మరి నారాయణ కుటుం బా న్ని, మోమిన్‌పేటలో అరిగె యాదయ్య, ఎన్కెతలలో ఆలంపల్లి వెంకటేశం కుటుంబీకులను కలుసుకుంటారని వివరించారు.