మండలి కోడ్ దృష్ట్యా షర్మిల యాత్ర వాయిదా | sharmaila program postponed because of council election code | Sakshi
Sakshi News home page

మండలి కోడ్ దృష్ట్యా షర్మిల యాత్ర వాయిదా

Published Sun, Feb 15 2015 1:05 AM | Last Updated on Thu, Aug 9 2018 4:45 PM

sharmaila program postponed because of council election code

- వైఎస్సార్ సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి


సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నెల 18వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో.. దివంగత మహానేత వైఎస్సార్ కుమార్తె, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కొనసాగించాల్సిన పరామర్శ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

మహానేత వైఎస్సార్ మరణంతో గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నల్లగొండ జిల్లాలో ఈ నెల 18-22 తేదీల మధ్య మలి విడతగా షర్మిల పరామర్శ యాత్ర చేపట్టాలని తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మండలి ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రస్తుతం వాయిదా పడిన ఈ యాత్రను మళ్లీ ఎప్పుడు చేపడతామనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని పొంగులేటి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement