రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో శతాబ్ది ఎక్స్ప్రెస్కు ప్రమాదం త్రుటిలో తప్పింది.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో శతాబ్ది ఎక్స్ప్రెస్కు ప్రమాదం త్రుటిలో తప్పింది. పుణె నుంచి సికింద్రాబాద్ వస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ను ప్రమాదవశాత్తు ఓ క్రేన్ ఢీకొంది. దాంతో రైలు అద్దాలు పగిలిపోయాయి.
శంకర్పల్లి రైల్వేస్టేషన్లో సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా అక్కడ ఆ పనుల కోసం క్రేన్ను ఉంచారు. ఇదే రైలును ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అంతా సురక్షితంగా ఉన్నారు.