మహిళల సంరక్షణే ‘షీ’టీం లక్ష్యం
Published Wed, Mar 22 2017 6:18 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM
చెన్నూర్: మహిళల సంరక్షణే షీటీంల లక్ష్యమని, ఎలాంటి సమస్యలు ఎదురైనా షీటీంకు సమాచారం అందించాలని ఏఎస్సై బెనర్జీ అన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణంలో బుధవారం షీటీంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కార్యాలయాల్లో కొందరు మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఆకతాయిలు, కుటుంబ సభ్యులు ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే షీటీం సభ్యులను ఆశ్రయించాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పవిత్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement