ఇంట్లో, బయట.. ‘ఆమె’పై హింస
ఆందోళన కలిగిస్తున్న నేరాల తీరు
పెరుగుతున్న గృహ హింస కేసులు
వరంగల్ క్రైం : గత నాలుగేళ్లతో పోలిస్తే మహిళలపై వేధిం పులు, వరకట్న హత్యలు, గృహ హింస కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మహిళలపై నేరాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా పరిస్థితిలో మార్పు రా వడం లేదు. అధికారిక గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారుు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లలో నిండిపోరుున బూతు సాహిత్యం, అశ్లీల చిత్రాలు యువతను పెడదారి పట్టిస్తున్నారుు. సామూహిక అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, కట్నం కోసం వేధించడం, తీసుకురాకుంటే హత్యకు పాల్పడడడం, భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడం, ప్రేమించాలని వేధింపులు, మహిళల అక్ర మ ర వాణా, కిడ్నాప్ వంటి జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నారుు. ఇది మా కర్మ అనుకుని సర్దుకుపోయే మహిళలు కొందరుంటే.. ఆ బాధలు భరించలేక ఈలోకా న్ని విడిచి వెళ్లిన అభాగ్యులు అనేక మంది ఉన్నారు. నిర్భ య, గృహ హింస నిరోధక చట్టాల్లాంటివి ఉన్నప్పటికీ పో లీస్‌స్టేషన్, కోర్టు మెట్లెక్కడానికి మహిళలు, యువతులు ‘పరువు’ సమస్యతో ఇంకా వెనుకాడుతూనే ఉన్నారు.
షీ టీమ్‌లు బలోపేతం కావాలి..
హైదరాబాద్ తరహాలో వరంగల్‌లో షీటీమ్‌లను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు తర్వాత మహిళలు, కాలేజీ యువతులపై వేధింపులు తక్కువయ్యాయి. బస్టాండ్లు, కళాశాల లు, ప్రముఖ కూడళ్లలో టీ షీమ్ బృందాలు పోకిరీల పనిపడుతున్నారు. వారి తల్లిదండ్రులను స్టేషన్లకు పిలిపించి తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ చేయడంతో సత్ఫలితాలు వస్తున్నారుు. 2015 ఏప్రిల్‌లో షీ టీమ్‌లు ఏర్పాటయ్యూక ఇప్పటి వరకు 324 మంది పోకిరీలను పట్టుకున్నారు. ఇం దులో 250 మందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపగా, మిగతా మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే వారిని యూంటీ ర్యా గింగ్, ఈవ్‌టీజింగ్ క్యాంపెరుున్లలో భాగస్వామ్యం చేస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు.