సాక్షి, మంచిర్యాల : తెలంగాణ సర్కారు తీసుకున్న రుణమాఫీ నిర్ణయం మేలు చేసే దిశగా రూపొందించాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు. రైతులు సహకార పద్ధతిలో ఏర్పరచుకున్న సహకార బ్యాంకులు, సొసైటీలకు వెలుగులు నింపే దిశగా ఆ చర్యలుండాలని అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా రుణమాఫీలో మొదటి ప్రాధాన్యం సహకార బ్యాంకులు, సొసైటీల రుణాలు చెల్లించే విధంగా మార్గదర్శకాలు వెలువరించాలని కోరుతున్నారు.
టీఆర్‌ఎస్ సర్కారు మార్చి 31 వరకు తీసుకున్న పంట రుణం, పంట ఉత్పత్తుల రుణం, బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాలు ఏవైనా లక్షలోపు మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మాఫీ పరిధిలోకి వచ్చే వారి వివరాలు బ్యాంకులవారీగా సేకరించే కసరత్తు పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
వెలుగులు నింపాలి..
అధికారుల సమాచారం ప్రకారం ఈ మార్చి 31 వరకు పంట రుణం రూ.1,502 కోట్లు, రూ.165 కోట్లు బంగారం తాకట్టు రుణాలు ఆయా బ్యాంకులు, సొసైటీలు అన్నదాతలకు అందజేశాయి. మొత్తం రుణాల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రుణాలు దాదాపు రూ. 180 కోట్ల వరకు ఉన్నాయి. ఇవన్నీ పంట రు ణాలే. వీటితోపాటు వాటి అనుబంధ సొసైటీల్లో రైతులు తీసుకున్న రుణాల్లో బంగార ం తాకట్టు పెట్టి తీసుకున్నవి లేవు. తాజా రుణ మాఫీలో రైతులకు జీవనాడిలా ఉన్న సహకా ర బ్యాంకులు, సొసైటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులు ఆకాంక్షిస్తున్నారు.
దాదాపుగా రెండేళ్ల నుంచి కొత్త రుణాల మంజూరు, పాత రుణాల పునరుద్ధరణ స్తంభించడంతో పలు సంఘాలు చీకట్లో ఉన్నాయని పేర్కొంటున్నారు. కొన్నిసంఘాలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయని ఉదహరి స్తున్నారు. ఈ నేపథ్యంలో సహకార రంగానికి ఊతం ఇచ్చేలా మార్గదర్శకాలు ఉండాలని కోరుతున్నారు. మాఫీ జాబితాలో సహకార బ్యాంకు, సొసైటీల్లో తీసుకున్న రుణాల మొ త్తం మాఫీ చేసేలా ఉత్తర్వులు విడుదల అయి తే వాటికి ఊతం ఇచ్చినట్లు ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై లీడ్‌బ్యాంకు వర్గాలను సంప్రదించగా ఇప్పటివరకు తమకు రుణమాఫీలో ప్రాధామ్యాలను వివరిస్తూ అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.
సహకారానికి ప్రాధాన్యమివ్వాలి
Published Sat, Aug 23 2014 2:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement