కామారెడ్డిటౌన్ : అన్నిరంగాల్లో లాగే వ్యవసాయ రంగంలో కూడా యువత ప్రధానపాత్ర పోషిస్తే ఈ రంగం అభివృద్ధి చెందుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ, పరిశోధన సంచాలకులు డాక్టర్ డి.రాజిరెడ్డి అన్నారు. కామారెడ్డి డెయిరీ కళాశాలలో సోమవారం ఆకాశవాణి ప్రజాసేవా ప్రసార దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేడియో ప్రచారసభ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగంలో యువకులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తే మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆకాశవాణి రేడియో ప్రసారాల ద్వారా రైతులకు పూర్తిగా పరిజ్ఞానం అందుతుందన్నారు. టీవీలకన్నా, రేడియోలే మిన్నా అని చెప్పారు. రేడియోను పొలానికి, ఎక్కడికైనా తీసుకెళ్లి కార్యక్రమాలను వినవచ్చన్నారు.
వ్యవసాయం లాభదాయకం కావాలంటే పశుపోషణ, ఉద్యానవన, చేపల పెంపకం, తదితర రంగాలపైనా రైతులు దృష్టి పెట్టాలన్నారు. అవగాహనలోపంతో రైతులు చాలా వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పరిశోధన కేంద్రాలను సద్వినియోగం చేసుకుని, సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. రైతుల ఆత్మహత్యలపై బోర్డు ఆఫ్ స్టడీస్ ఇన్ సైకాలాజీ ఉస్మానియా యూనివర్సిటీ చైర్‌పర్సన్ డాక్టర్ ఏ. అనుపమ అవగాహన కల్పించారు. రైతే దేశానికి వెన్నుముక అని, ఆత్మహత్యలకు పాల్పడకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యఅతిథులుగా ఆకాశవాణి అసిస్టెంట్ డెరైక్టర్ ఉదయశంకర్, తిరుపతి డెయిరీ కళాశాల డీన్ డాక్టర్ ఎస్.రవికుమార్, అసోసియేట్ డీన్ ఆర్.చంద్రశేఖర్, రైతునేస్తం, పశునేస్తం సంపాదకులు వెంకటేశ్వర్ హాజరయ్యారు. కార్యక్రమంలో డెయిరీ కళాశాల సిబ్బంది రాజ్‌గోపాల్, ఉమాపతి, శ్రీపాద్, రాజశేఖర్, విజయ్‌గీతా, శాలిని, రవీందర్‌రెడ్డి, మాధవి, లింగం, డెయిరీ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయంలోకి యువత రావాలి
Published Tue, Nov 11 2014 3:40 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM
Advertisement