రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకు తీవ్రగాయాలు
Published Fri, Feb 19 2016 8:37 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM
సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర బందోబస్తు నిర్వహించి నిరుకుళ్ల గ్రామం నుంచి సుల్తానాబాద్‌కు బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. తీవ్రగాయాలైన ఎస్‌ఐను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement