sultana bad
-
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకు తీవ్రగాయాలు
సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఎస్ఐ ఇంద్రసేనారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర బందోబస్తు నిర్వహించి నిరుకుళ్ల గ్రామం నుంచి సుల్తానాబాద్‌కు బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. తీవ్రగాయాలైన ఎస్ఐను చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
సుల్తానాబాద్: గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గారెపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన పోలీసులు ఎనిమిది మంది గుడుంబా తయారీ దారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు 400 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు రూ. 28 వేలు విలువ చేసే గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.