
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం చొరవ చూపడం లేదని, దీనికి నిరసనగా ఈ నెల 12న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆదివారం తెలిపారు. గతేడాది ఫీజు బకాయిలు రూ.1,600 కోట్ల మేర పేరుకుపోయినా, ప్రభుత్వం చోద్యం చూస్తోందని వి మర్శించారు. బ్యాంకుల తో సంబంధం లేకుండా దివంగత మాజీ సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఇచ్చిన మాదిరి విద్యార్థుల ఫీజులు చెల్లించాలని కోరారు. ఫీజులు చెల్లించకపోవడంతో హాల్‌టికెట్లు, సర్టిఫికెట్ల జారీలో యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment